సనత్‌నగర్ మైనర్ బాలుడి హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష

Publish Date:May 12, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరాన్ని 2023లో కుదిపేసిన సనత్‌నగర్ మైనర్ బాలుడి హత్య కేసులో కూకట్‌పల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కేసులో ప్రధాన నిందితుడు ఇమ్రాన్ అలీ ఖాన్ (33)కు మరణ శిక్ష విధించగా, సహనింది తుడు మహమ్మద్ రఫీక్ (32)కు ఏడేళ్ల కారాగార శిక్ష విధించింది. సనత్‌నగర్ పోలీసులకు ఈ కేసు పెద్ద సవాల్‌గా మారినప్పటికీ, కేవలం సాంకేతిక ఆధారాలు మరియు పరిస్థితుల ఆధార సాక్ష్యాలతో కేసును ఛేదించారు. మొబైల్ కాల్ డేటా రికార్డులు, లొకేషన్ ట్రాకింగ్, ఇతర డిజిటల్ సాక్ష్యాలను సేకరించి నిందితుల పాత్రను నిర్ధారించారు.

ప్రాసిక్యూషన్ కోర్టులో బలమైన వాదనలు వినిపిస్తూ సాంకేతిక సాక్ష్యాలు, పరిస్థితుల ఆధార సాక్ష్యాలను పకడ్బందీగా సమర్పించ డంతో నిందితులపై ఆరోపణలు రుజువయ్యాయి. ఈ కేసును విచారించిన 3వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎం. వెంకటేశ్వర రావు, నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ప్రధాన నింది తుడికి మరణశిక్ష విధించారు. కేసులో సహకరించిన మహమ్మద్ రఫీక్‌కు ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. ఈ తీర్పు నగరంలో సంచలనం రేపుతోంది. పోలీసులు, ప్రాసిక్యూషన్ సమన్వ యంతో కేసును విజయ వంతంగా ఛేదించడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి

By
en-us Political News

  
చైనాలో ఉద్యోగ మార్కెట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేసే ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగుచూసింది.
తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు సభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి
దేశంలో సుదీర్ఘకాలంగా నలుగుతున్న అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యాచరణను ముందుకు తెచ్చింది.
తెలంగాణ గ్లోబల్ ఇండస్ట్రియల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన రాయదుర్గ్ ఇ-వేలం తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించింది.
ఎన్టీఆర్ ప్రాంతీయ నేత కాదు..యావత్ తెలుగుజాతి గర్వించదగిన బిడ్డ..
సాఫ్ట్‌వేర్ రంగంలో ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నప్పటికీ, మట్టి వాసనపై ఉన్న మక్కువతో ఆ ఐటీ ఉద్యోగాన్ని వదిలేశాడు.
భారతదేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించిన ఒక సంచలన వివాదం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రకు రెండు పెద్ద దెబ్బలు తగిలాయని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
మండిపోతున్న ఎండలు, వడగాల్పులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.
హైదరాబాద్ నగరంలో 14 సంవత్సరాలుగా పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్న సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన
యువత అంకితభావం, సమష్టి కృషి, త్యాగం అలవర్చుకోవాలని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, విద్యా-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు మహానాడు వేడుకలు అట్టహాసంగా జరుగుతుంటే, మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎన్టీఆర్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే, ఐటీ నిరుద్యోగులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అమీర్‌పేట్ మైత్రీవనం జంక్షన్ వద్ద దివంగత నేత ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు.
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్ ) రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.