Publish Date:May 14, 2026
వికారాబాద్ జిల్లా తాండూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కిడ్నాప్ కేసులో అరెస్టైన ఓ నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచే పోలీసుల కళ్లుగప్పి పరారైనట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్‌కు చెందిన అజీమ్ (ఆసిఫ్ అలియాస్ అజిమ్) తాండూరులోని ఓ సెలూన్‌లో పని చేస్తున్నాడు. అదే ప్రాంతంలో నివసిస్తున్న 17 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు తాండూరు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు హైదరాబాద్‌లో నిందితుడిని అరెస్టు చేసి తాండూరుకు తీసుకువచ్చి రిమాండ్ ప్రక్రియ కొనసాగిస్తున్న సమయంలో, అనూహ్యంగా నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచే పరారైనట్లు సమాచారం... ఐదు రోజులుగా సీక్రెట్ గా ఉంచిన ఈ ఘటన ఇప్పుడు బయటకు రావడంతో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఈ ఘటన పలు అనుమా నాలకు దారితీస్తోంది. ఇప్పటికే పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ ప్రాంతానికి పంపినట్లు తెలుస్తోంది. అంతర్రాష్ట్ర స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగు తున్నాయి. ఈ ఘటనలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోపణలతో ఇద్దరు పోలీస్ సిబ్బందిపై వేటు పడే అవకాశం ఉంది..పోలీసులు మాత్రం అధికారికంగా ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటన తాండూరు పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/accused-absconds-from-tandur-police-station-36-219735.html
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్