డెబ్యూ బౌలర్ల వికెట్ల పండుగ.. రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం

Publish Date:Apr 13, 2026

Advertisement

హైదరాబాద్‌  వేదికగా   సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్), రాజస్థాన్ రాయల్స్ మధ్య సోమవారం (ఏప్రిల్ 13) జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో అద్భుతమే జరిగింది. ఎస్ ఆర్ హెచ్  57 పరుగుల ఆధిక్యతతో ఆర్ ఆర్ పై చిరస్మరణీయమైన విజయం సా ధించింది. ఐపీఎల్ లో బలహీనమైన బౌలింగ్ అటాక్ ఎవరిది అని అడిగతే ఎవరైనా ఠక్కున ఎస్ ఆర్ హెచ్ అనే చెబుతారు. ఇప్పటి వరకూ  ఏ సీజన్ లోనైనా ఎస్ఆర్ హెచ్ సాధించిన విజయాలన్నీ ఆ జట్టు బ్యాటింగ్ బలంతోనే. బౌలింగ్  విభాగం బలహీనంగా ఉండటంతో ఆ జట్టు 200 పరుగుల పై చిలుకు స్కోరును కూడా కాపాడుకోలేక చతికిల పడిన సందర్భాలున్నాయి.

అటువంటి ఎస్ఆర్ హెచ్ సోమవారం (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్ లో  బౌలింగ్ ప్రదర్శన వల్లనే భారీ విజయం నమోదు చేసింది. ఈ సారి ఆ జట్టు తన  సీనియర్ బౌలర్లను పక్కన పెట్టి ఇద్దరు యువ పేసర్లను బరిలోకి దించింది. ఐపీఎల్ లో తొలి సారి ఆడుతున్న ఆ ఇద్దరూ రాజస్థాన్ రాయల్స్ బలమైన బ్యాటింగ్  లైనప్ ను పేకమేడలా కూల్చేశారు.  ఆ ఇద్దరు బౌలర్లూ ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్. ఇద్దరికీ ఇదే ఐపీఎల్ డెబూ.. అయినా ఫామ్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నారు. వీరి  బౌలింగ్ కు ఆర్ఆర్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. డెబ్యూ మ్యాచ్ లోనే ఇద్దరూ చెరో నాలుగు వికెట్లు పడగొట్టి అదరగొట్టారు. 

ఇక మ్యాచ్  విషయానికి వస్తే టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బ్యాటర్లలో ఓపెనర్ ఇషాంత్ శర్మ తొలి బంతికే డకౌట్ గా వెనుదిరిగాడు. అయితే స్కిప్పర్ ఇషాంత్ కిషన్ అద్భుతంగా ఆడి   44 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 91 పరుగులు చేశాడు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ (26 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్సర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 28; 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. 

ఇక 217 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ ల ధాటికి పేకమేడలా కూప్పకూలింది. డెబ్యూలో వేసిన తొలి ఓవర్లోనే ప్రఫుల్ హింగే.. అరవీర భయంకర ఫామ్ లో ఉన్నసూర్యవంశీని డకౌట్ చేశాడు. అక్కడితో ప్రఫుల్ హింగే విధ్వంసం ఆగలేదు. నాలుగో బంతికి ధృవ్ జురేల్ ను, చివరి బంతికి ప్రిటోరియస్ ను పెవిలియన్ కు పంపించాడు. డెబ్యూలో తొలి ఓవర్ లోనూ మూడు వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాశించాడు.  ఆ తరువాత ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన సాకిబ్ హుస్సేన్ యశస్విజైస్వాల్ కు ఔట్ చేశాడు. ఇక ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ప్రఫుల్ సింగ్ ఆర్ఆర్ స్కిప్పర్ రియాన్ పరాగ్ ను పెవిలియన్ కు పంపించాడు. దీంతో 9 పరుగులకే ఆర్ఆర్ ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరకుపోయింది.

అయితే ఆ దశలో   డోనోవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా  నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ ను చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో ఇరువురూ ఆరో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఫెరీరా 7 ఫోర్లు, 3 సిక్సర్ల తో  42 బంతుల్లో 62 పరుగులు సాధించాడు. అలాగే జడేజా  32 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేశాడు.  అయితే సాకిబ్ హుస్సేర్ మళ్లీ మాయ చేశాడు. వీరి భాగస్వామ్యన్ని విడదీశాడు. వీరిద్దరు ఔటైన తరువాత రాజస్థాన్ ఇక కోలుకోలేదు. చివర్లో తుషార్ దేశ్ పాండే 11 బంతుల్లో 3 సిక్సర్లు బాది పాతిక పరుగులు చేసినా అది ఓటమి అంతరాన్ని తగ్గించడానికి తప్ప ఎందుకూ పనికి రాలేదు. చివరకు ఆర్ఆర్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయ్యింది.  

By
en-us Political News

  
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.