జస్ట్ లేటయ్యింది..అర్ధ శతాబ్దం తరువాత అందిన పుస్తకం
Publish Date:Jun 18, 2022
Advertisement
పుస్తకాలు చదివే అలవాటున్నవాళ్లు వాళ్లకు నచ్చిన పుస్తకాన్ని లైబ్రరీ నుంచి ఇంటికి తీసుకువెళ్లి చదివి వెంటనే తిరిగి ఇచ్చేస్తుంటారు. మహా అయితే అప్పుడప్పుడు ఒకటి రెండురోజులు ఆలస్యం జరగవచ్చు. వేరే పనిలో పడి మర్చిపోయానని సదరు పాఠకుడు ఆనక చెప్ప వచ్చు. కానీ కెనడా వాంకోవర్ లైబ్రరీ విషయంలో గొప్ప వింతే జరిగింది. ఒక పుస్తకం ఏకంగా 51 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చింది, అదీ సారీ మరోలా అనుకోవద్దన్న చిన్న లెటర్‌తో పాటు! మన వూళ్లలా కాదు అక్కడ పుస్తకం ఇవ్వడంలో ఆలస్యం చేస్తే పుస్తకం అద్దతో పాటు అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. కానీ ఈ మహాశయుడు ఎవరోగానీ, ఆ అదనపు ఛార్జీలను తప్పించుకోవడానికి లైబ్రరీ వారికి ఒక వుత్తరం పెట్టా డు. ఇన్నాళ్ల జాప్యం వూహించనిదని, తనను క్షమించమని ఆ లేఖ సారాంశం! చిత్రంగా వుంది గదూ! ఈ వుత్తరం చదివిన తర్వాత ఆ లైబ్రరీ వారు హాయిగా నవ్వుకున్నారు. పోయిందేమో అనుకున్న పుస్తకం చక్కగా తిరిగి వచ్చినందుకు! ఇక ఆ పాఠకుడు మంచి మనసుతో తన తప్పు తెలుసుకుని మరీ క్షమించాలని కోరడంతో అదనపు ఛార్జీలు వసూలు మాట వదిలేసేరు! వాంకోవర్ లైబ్రరీ వారు తమ ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో ఒక బొమ్మను పెట్టారు. 51 ఏళ్ల తర్వాత లైబ్రరీకి ఎంతో భద్రం గా తిరిగి వచ్చిన పుస్తకం అని! హెన్రీ ఎడ్వర్డ్ నీల్ అనే ఆయన రాసిన ది టెలిస్కోప్ అనే పుస్తకం అది. పుస్తకం మీద చివరిగా చదువరికి ఇచ్చిన తేదీ 1971 ఏప్రిల్ 20 అని స్టాంప్ కూడా వేసి వుంది. బొమ్మలో స్టాంప్ పైన 5 సెంట్‌లు చెల్లించవలసి వుంది అని పేర్కొన్నారు. కానీ ఈ అదనపు ఛార్జీలు లైబ్రరీ తొలగించేసి చాలా కాలమయింది కూడా! ఇన్‌స్టా గ్రామ్‌లో ఈ పుస్తకం బొమ్మను చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యపోతూ కామెంట్లు పెట్టారు. ఈ ఫోటో ద్వారా తమకు అసలీ లైబ్రరీ సౌత్ హిల్ లైబ్రరీ 51 సంవత్సరాల పాతది అని తెలిసిందని! నిజమేనా? అనీ అడుగుతున్నారు.
http://www.teluguone.com/news/content/a-book-was-returned-to-libraury-after-51-years-25-137909.html





