పాడెపై శవం లేచి కూర్చుంది..
Publish Date:May 15, 2021
Advertisement
ఆమె పేరు శంకుత గైక్వాడ్. ఆమెకు 76 ఏళ్ళు. బామ్మకు కొద్ది రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే వయసు పైబడటంతో.. ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు బారామతిలోని ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మే 10వ తేదీన ఓ ప్రైవేట్ వాహనంలో శంకుతల కుటుంబ సభ్యులు ఆమెను తీసుకుని బారామతి చేరుకున్నారు. ఆస్పత్రిలో బెడ్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ లాభం లేకుండా పోయింది. వారు కారులో వేచి చూడసాగారు. అయితే ఆ సమయంలో శకుంతల పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కదలం కూడా ఆపేసింది. దీంతో ఆమె చనిపోయిందని అనుకున్న కుటుంబ సభ్యులు.. అనంతరం ఊరికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు. అంతిమ యాత్రలో భాగంగా ఆమెను పాడెపై పడుకో బెట్టారు. అయితే ఒక్కసారిగా బామ్మ తన కళ్లు తెరిచి ఏడవడం ప్రారంభించింది. దీంతో షాక్ తిన్న కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీస్ అధికారి సంతోష్ గైక్వాడ్ ఈ ఘటనను ధ్రువీకరించారు. ఇక, ప్రస్తుతం ఆ బామ్మను బారామతిలోని సిల్వర్ జూబ్లీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెకు వైద్యం అందిస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బారామతి జిల్లాలోని ముధలే గ్రామంలో జరిగింది.
http://www.teluguone.com/news/content/76-year-old-womwn-covid-positive-then-wakes-up-minutes-before-cremation-39-115524.html





