యుగాంతం కాబోతోందా? కొన్ని గంటలే బతుకుతామా? ఆరు గ్రహాల కలయిక ప్రళయమేనా?

Publish Date:Dec 24, 2019

Advertisement

డిసెంబర్ 25... సాయంత్రం 4గంటల 41నిమిషాలకు ఖగోళ అద్భుతం కనువిందు చేయబోతోంది. విశ్వంలో మరో విశేషాన్ని గ్రహాలు ఆవిష్కరించబోతున్నాయ్‌. ఆరు గ్రహాలు ఒకేరాశిలో కలబోతున్నాయ్‌. ఇది డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 27 రాత్రి 11గంటల 40 నిమిషాల వరకు కొనసాగనుంది. షష్టి గ్రహ కూటమిగా దీన్ని పిలుస్తున్నారు. అయితే, ఇలాంటి అద్భుతం వందేళ్ల క్రితం ఏర్పడిందని కొందరు చెబుతుంటే, కాదుకాదు 297ఏళ్ల క్రితం ఇలా కనిపించిందంటున్నారు ఇంకొందరు. అసలు ఇలాంటిది గతంలో ఎన్నడూ ఏర్పడలేదని మరికొందరు చెబుతున్నారు. అయితే, ఏదో జరగబోతున్నదనే ప్రచారం మాత్రం పెద్దఎత్తున జరుగుతోంది. ఎందుకంటే, ఒకేసారి ఆరు గ్రహాలు ఒకే రాశిలో కలుస్తుండటంతో అరుదైన విశేషమే అయినా... ఏవైనా దుష్పరిణామాలు జరుగుతాయేమోనని భయపడుతున్నారు.

వాస్తవానికి గోచారంలో పంచ గ్రహకూటమి కానీ... షష్టగ్రహ కూటమి కానీ... లేదా సప్త గ్రహ, అష్ట గ్రహకూటమి జరిగినప్పుడు ఫలితం ఏవిధంగా ఉంటుదో కచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని, దాంతో అంచనా వేయడం కష్టమంటున్నారు. అందులోనూ గోచార ఫలితాలు కేవలం 20 శాతం వరకు మాత్రమే మానవులపై ప్రభావం చూపే అవకాశాలుంటాయని చెబుతున్నారు‌. ఆయా రాశుల్లో జన్మించిన వారికి ఈ కూటమి ఏర్పడే స్థానాన్ని బట్టి ఫలితంలో మార్పు ఉంటుందే తప్ప అన్ని రాశుల వారికి చెడు ఫలితం ఇస్తుందనుకోవటం కేవలం అపోహ మాత్రమే అంటున్నారు పండితులు. అంతేకాకుండా ఈ ఫలితాలు ఏవైనా కూడా అవి కొత్తగా వచ్చేవి కాదు. ఎందుకంటే అంతకు పది రోజుల ముందు సూర్యుడు, 50 రోజులకు ముందు గురువు ధనుస్సులోకి వచ్చి వాటి ఫలితాలను ఇవ్వడం ప్రారంభించినందున... ఈ కూటమి వలన కొత్తగా జరిగే చెడు గానీ, మంచిగానీ ఏదైనా నామమాత్రంగానే ఉంటుందని అంటున్నారు.

ఖగోళంలో మరో అద్భుతాన్ని మనం చూడబోతున్నామని ఖగోళ శాస్త్రవేత్తలు అంటుంటే... పండితులు మాత్రం ప్రళయం తప్పదని అంటున్నారు. మరికొందరైతే యుగాంతం ఖాయమంటున్నారు. కొన్ని గంటలే మన బతుకుతామనే మాటలు చెబుతున్నారు. షష్టగ్రహ కూటమి ప్రకృతి ఒడిలో చిచ్చు పెట్టబోతోందని అంచనా వేస్తున్నారు. గ్రహాల కలయిక జరిగిన కొన్ని గంటల్లోనే సూర్యగ్రహణం కూడా ఉండటంతో డిసెంబర్ 25న అసలేం జరగబోతోందనేది ఉత్కంఠగా మారింది.

By
en-us Political News

  
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.