ఈ నాలుగు పాటిస్తే అత్తాకోడళ్ల మధ్య గొడవలే ఉండవు

Publish Date:Nov 18, 2026

Advertisement

 ఈ నాలుగు పాటిస్తే అత్తాకోడళ్ల మధ్య గొడవలే ఉండవు

ఇంట్లో సంతోషం , ప్రశాంతత ఉండాలంటే కేవలం ఆర్థిక పరిస్థితులు బాగుండటమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కూడా ఎంతో సజావుగా సాగాలి. ముఖ్యంగా ఏ ఇల్లయినా సంతోషంగా ఉండాలంటే అక్కడ అత్తాకోడళ్ల మధ్య అనుబంధం ఎంతో కీలకం అవుతుంది. సమాజంలో సాధారణంగా అత్తాకోడళ్ల మధ్య చిన్నపాటి మనస్పర్థలు, గొడవలు ఉండటం సర్వసాధారణం అని అనుకుంటూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం రెండు వేర్వేరు తరాల ఆలోచనలు, వారి అనుభవాలు , వారి అంచనాలు ఒకే చోట ఉండటమే.. ఎప్పుడైతే ఇద్దరి మధ్య చిన్న పొరపాట్లు జరుగుతాయో, అవి క్రమంగా పెద్ద గొడవలుగా మారి ఇళ్లలోని శాంతిని దూరం చేస్తాయి. అయితే ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఈ బంధాన్ని మరింత గట్టిగా మార్చుకోవడానికి , ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషకరమైన వాతావరణం నెలకొనడానికి కొన్ని సులభమైన మార్గాలను అందించారు. ఆ నాలుగు ముఖ్యమైన విషయాలను పాటిస్తే ఈ బంధంలో ఎప్పుడూ ఎలాంటి అనుమానాలు, గొడవలు రావని స్పష్టం చేశారు.అవేంటో తెలుసుకుంటే..

సంయమనం..

ఏదైనా ఒక విషయంపై  ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు లేదా ఒకరిమీద మరొకరికి  కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కాస్త సంయమనం పాటించడం చాలా అవసరం. కోపంలో నోటి వెంట వచ్చే మాటలు ఎప్పుడూ జీవితాంతం  ఇతరుల మనసులో చెడు అభిప్రాయాన్ని కలిగిస్తాయి. కాబట్టి కోపం వచ్చిన తక్షణం గొడవ పడకుండా ప్రశాంతంగా పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకరి మాటలు మరొకరు పూర్తిగా వినడం వల్ల చాలా వరకు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయి. ఈ చిన్న నియమం వల్ల అత్తాకోడళ్ల మధ్య దూరం పెరిగే అవకాశమే ఉండదు.

పరస్పర గౌరవం..

అత్తాకోడళ్లు  ఒకరి భావాలను మరొకరు గౌరవించడం కూడా అంతే ముఖ్యం. అత్తగారు ఏళ్ల తరబడి ఇంటి బాధ్యతలను మోస్తూ తనకంటూ కొన్ని పద్ధతులు ఏర్పరచుకుని ఉంటారు. అలాగే కోడలు కూడా తనదైన ఆలోచనలు, ఆధునిక భావనలతో కొత్త వాతావరణంలోకి అడుగుపెడుతుంది. ఇలాంటి సమయంలో ఇద్దరూ ఒకరి అభిప్రాయాలను, వారి స్వేచ్ఛను గౌరవించాలి. అత్తగారు తన పాత అనుభవాలను గౌరవించాలని కోరుకుంటే, కోడలు కూడా ఇంటి పాత సంప్రదాయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా పరస్పర గౌరవం ఉంటే ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది.

బయటి వ్యక్తుల దగ్గర ఓపెన్ అవ్వడం..

కుటుంబానికి సంబంధించిన చిన్నచిన్న విషయాలను లేదా మనస్పర్థలను బయటి వ్యక్తుల వద్ద, బంధువుల వద్ద చర్చించడం ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా కోడలు తన పుట్టింటికి వెళ్లినప్పుడు కూడా ఇంట్లోని విషయాలను బయట పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత పెద్దవిగా మారుతాయి. ఎప్పుడైనా సమస్యలు వస్తే వాటిని ఇంట్లోనే ఒకరితో ఒకరు కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సులువుగా పరిష్కరించుకోవచ్చు.

ఇది కూడా చదవండి   జీవితంలో నిజమైన విజయం ప్రశాంతత కావాలా.. ఇదిగో ఈ సూత్రాలు పాటించండి.. !
 

సహకారం..

ఇద్దరి మధ్య మంచి సహకారం ఉండటం ఎంతో ముఖ్యం. ఏ బంధంలోనైనా ఇద్దరి అంచనాలు స్పష్టంగా లేనప్పుడు అపార్ధాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంటి పనులు, బాధ్యతలు , ఇతర విషయాల గురించి ఒకరికొకరు తోడుగా ఉంటూ పనులను పంచుకోవాలి. అత్తగారు కొత్తగా వచ్చిన కోడలికి విషయాలు నేర్చుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలి. ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళితే ఆ ఇంటిలో ఎప్పుడూ నవ్వులు , సంతోషానికి లోటు ఉండదు. అత్తాకోడళ్ల మధ్య కూడా గొడవలు అనేవి చాలా వరకు రావు.. ఒకవేళ వచ్చినా పై మార్గాలు ఫాలో అవుతూ ఉంటే అవన్నీ

                                                                                                                                            *రూపశ్రీ.

 

మీకు నచ్చవచ్చు  రిలేషన్‌షిప్‌లో పర్సనల్ స్పేస్..భాగస్వామి ఒంటరిగా గడపాలని కోరుకోవడానికి అసలు కారణాలు..!

 

By
en-us Political News

  
ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రేమ, నమ్మకం , నిజాయితీ  అనేవి ఏ బంధానికైనా ప్రాణాధారమైన మూలాలు.
జీవితాంతం ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేసినా చాలామంది ఆర్థికంగా ఎదగలేకపోతుంటారు.
రోజూ ఉదయం టీతో బిస్కెట్లు తినే అలవాటు ఉందా? నెల రోజుల్లో మీ శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో, నిపుణులు ఏం చెబుతున్నారో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
దంతాలపై పేరుకున్న పాచి, పసుపు మరకలను ఇంట్లోనే బేకింగ్ సోడా మరియు కొబ్బరి నూనెతో సులభంగా ఎలా తొలగించుకోవాలో తెలుసుకోండి. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకునే సింపుల్ చిట్కాలు.
మధ్య వయస్కులు మరియు వృద్ధులు ఆరోగ్యం కోసం జిమ్‌లకు బదులుగా టీవీ, యూట్యూబ్ ద్వారా ఇంట్లోనే వ్యాయామాలు చేయడానికి ఎలా మొగ్గు చూపుతున్నారో తెలుసుకోండి. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
మహిళలు రోజూ రాత్రి రెండు వేయించిన ఖర్జూరాలు తినడం వల్ల కలిగే హార్మోన్ల సమతుల్యత, సంతానోత్పత్తి మెరుగుదల, గర్భాశయ బలం మరియు ఎముకల ఆరోగ్య ప్రయోజనాల పూర్తి వివరాలు.
కీమోథెరపీ మరియు బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ మానవ రోగనిరోధక శక్తి కోలుకోవడంపై ఎలా ప్రభావం చూపుతాయో వివరించే తాజా వైద్య విశేషాలు.
చలికాలంలో ఎస్పీఎఫ్ మాయిశ్చరైజర్ సరిపోతుందా లేక సన్‌స్క్రీన్ అవసరమా? డాక్టర్ కరుణ మల్హోత్రా సలహాలు, రీసెర్చ్ డేటా మరియు సరైన లేయరింగ్ పద్ధతుల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అలసందల్లో ఉండే పోషకాలు, ప్రొటీన్లు, పీచు పదార్థం మరియు ఆరోగ్య ప్రయోజనాల పూర్తి సమాచారం. బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మరియు షుగర్ కంట్రోల్ కోసం అలసందలను ఎలా తినాలి?
శీతాకాలంలో జిమ్‌కు వెళ్లకుండానే బరువు తగ్గాలనుకుంటున్నారా? చలికాలంలో హైడ్రేషన్, ఆరోగ్యకరమైన పానీయాలు, డైట్ చిట్కాలతో ఫిట్‌గా ఉండే అద్భుతమైన మార్గాలను ఇక్కడ తెలుసుకోండి.
కాంతివంతమైన, మచ్చలేని మరియు సహజమైన చర్మం కోసం పచ్చి పాలను ఏ విధంగా ఉపయోగించాలో ఈ వెబ్ స్టోరీ ద్వారా తెలుసుకోండి. ఇంట్లోనే సులభంగా చర్మాన్ని మెరిపించే చిట్కాలు.
వైరల్ ఫీవర్ మరియు కోవిడ్ 19 తర్వాత గుండె ఆరోగ్యంపై పడే ప్రభావం గురించి తెలుసుకోండి. మయోకార్డిటిస్, పెరికార్డిటిస్ సమస్యలను సూచించే 5 ముఖ్యమైన హెచ్చరిక లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి వివరాలు.
ఉల్లి, వెల్లుల్లి లేకుండా అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో ఎంతో రుచికరంగా తయారయ్యే సాంప్రదాయ ఆంధ్ర స్టైల్ అల్లం వంకాయ కూర తయారీ విధానం మరియు పూర్తి పదార్థాల కొలతలతో స్టెప్ బై స్టెప్ గైడ్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.