మీకు దనవంతులు కావాలని ఉందా..అయితే మార్వాడీల నియమాలు తెలుసుకోండి..!

Publish Date:Nov 18, 2026

Advertisement

జీవితాంతం ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేసినా చాలామంది ఆర్థికంగా ఎదగలేకపోతుంటారు. కానీ కొందరు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనైనా తరతరాలుగా అత్యంత ధనవంతులుగా నిలదొక్కుకుంటూ ఉంటారు. దీనికి అసలు కారణం వారి దగ్గర ఉన్న డబ్బు కాదు, వారి ఆలోచనా విధానం లేదా మైండ్ సెట్. భారతదేశంలో వ్యాపారాలకు  మార్వాడీలు  పెట్టింది పేరు.   మార్వాడీలు అవలంబించే కొన్ని ప్రత్యేకమైన ఆర్థిక సూత్రాలను తెలుసుకోవడం ద్వారా సామాన్యులు కూడా తమ సంపదను  వృద్ధి చేసుకోవచ్చు.  ఆ ఆర్థిక సూత్రాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే..

డబ్బును ప్రేమించడం కంటే దానితో పని చేయించడం ముఖ్యం..

చాలామందికి జీతం రాగానే కొత్త వస్తువులు కొనడం, రెస్టారెంట్లు , ట్రిప్స్ అంటూ ఖర్చు చేయడానికి ప్లాన్ చేసుకుంటుంటారు. కానీ మార్వాడీలు ఎప్పుడూ ఈ డబ్బు నాకు ఇంకో రూపంలో ఎంత సంపాదించి పెడుతుంది అనే కోణంలో ఆలోచిస్తారు. కేవలం పొదుపు చేయడం వల్ల డబ్బు నిలబడుతుంది కానీ ఇన్వెస్ట్‌మెంట్లు మాత్రమే డబ్బును రెట్టింపు చేస్తాయి. ప్రతి రూపాయిని ఒక ఉద్యోగిలా భావించి తగిన ప్రతిఫలం రాబట్టడంపై దృష్టి పెట్టాలి.

ప్రతి రూపాయికి స్పష్టమైన లెక్క ఉండాలి..

నెలవారీ ఖర్చులపై సరైన అవగాహన లేకపోవడం వల్లనే చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. లెక్క తెలియని సంపద ఎప్పుడూ నిలవదు. మార్వాడీలు తాము ఖర్చు చేసే ప్రతి పైసాను రాసుకుంటారు. రాత్రి పడుకునే ముందు ఆ రోజు ఎంత ఖర్చు చేశాం, ఎందుకు చేశాం అని పరిశీలించుకోవడం ద్వారా అనవసరపు ఖర్చులకు అడ్డుకట్ట వేయవచ్చు.

జీవనశైలి మార్చుకోవడం కాదు.. ఆస్తులు పెంచుకోవాలి..

సమాజంలో హోదా కోసం లేదా పక్కవాళ్ళను చూసి ఐఫోన్లు, ఖరీదైన బైకులు, కార్లు కొంటూ ఈఎంఐలు , లోన్లతో జీవితాన్ని అప్పులమయం చేస్తుంటారు. కానీ ఆదాయం పెరిగిన వెంటనే జీవనశైలిని మార్చుకోకూడదని, ముందుగా ఆస్తులను పెంచుకోవాలని మార్వాడీలు నమ్ముతారు. ధనవంతులుగా కనిపించడం కోసం కాకుండా నిజంగా ధనవంతులు కావడానికి ఖర్చు చేయాలి.

ఇది కూడా చదవండి    చేతికి డబ్బు రాగానే ఈ పనులు చేయండి.. లేకపోతే బాధపడతారు..!​
 

వాతావరణం..

చిన్నప్పటి నుంచే పిల్లలకు వ్యాపారం, డబ్బు నిర్వహణ గురించి మాట్లాడే వాతావరణం మార్వాడీ కుటుంబాల్లో ఉంటుంది. దీనివల్ల మంచి అవకాశాలు దక్కుతాయి. జీవితంలో ఎదగాలంటే మంచి ఆలోచనలు ఉన్నవారితో కలవడం, మంచి పుస్తకాలు చదవడం , అనుభవజ్ఞులైన మార్గదర్శకుల సలహాలు తీసుకోవడం ఎంతో అవసరం.

రిస్క్..

రిస్క్ తీసుకోవడం అంటే గుడ్డిగా డబ్బు పెట్టేయడం కాదు, అన్ని కోణాల్లో ఆలోచించి చిన్న మొత్తంతో ప్రారంభించడం. ఈరోజు ఇన్ఫ్లేషన్ వల్ల డబ్బు విలువ పడిపోతున్న తరుణంలో ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడమే పెద్ద రిస్క్ అవుతుంది. సరిగ్గా నేర్చుకొని, అర్థం చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలి.

ఆస్తి కాదు.. జ్ఞానం ముఖ్యం..

కేవలం బడిలో, పుస్తకాల  చదువులతో సరిపెట్టకుండా చిన్న వయసులోనే వ్యాపార మెలకువలు, కస్టమర్లతో మాట్లాడే విధానం, లాభనష్టాల బేరీజు వేయడం నేర్పిస్తారు. దీనివల్ల యుక్తవయసు వచ్చేసరికి వారికి అద్భుతమైన  అనుభవం సొంతమవుతుంది.

రేపటి తరం కోసం..

రేపటి లాభాల కోసం ఆశపడకుండా, సుదీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రణాళికలు రచిస్తారు. ఒక రైతు విత్తనం నాటి వెంటనే ఫలితం ఆశించకుండా ఎలా రోజూ నీరు పోసి సంరక్షిస్తాడో, సంపద సృష్టించడంలో కూడా అలాగే సహనంతో కూడుకున్న ప్రక్రియ.

ఎప్పటికీ చేయకూడని పొరపాట్లు..

ఆదాయం పెరిగిన వెంటనే విలాసవంతమైన ఖర్చులు పెంచడం, కేవలం ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకుండా వివిధ మార్గాల్లో సంపాదనను సృష్టించడం, అలాగే భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా లాజిక్ గా  రీసెర్చ్ ఆధారంగా పెట్టుబడులు పెట్టడం వంటి నియమాలు వారిని ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంచుతాయి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టడం మన చేతుల్లో లేకపోయినా, సరైన ఆర్థిక నిర్ణయాలతో జీవితాన్ని మార్చుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది.

                                                                                                                                              *రూపశ్రీ.

 

మీకు నచ్చవచ్చు   రిలేషన్‌షిప్‌లో పర్సనల్ స్పేస్..భాగస్వామి ఒంటరిగా గడపాలని కోరుకోవడానికి అసలు కారణాలు..!​
                                    మీ దగ్గర డబ్బు నిలవడం లేదా..అసలు కారణాలు ఇవే..!

By
en-us Political News

  
రోజూ ఉదయం టీతో బిస్కెట్లు తినే అలవాటు ఉందా? నెల రోజుల్లో మీ శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో, నిపుణులు ఏం చెబుతున్నారో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
దంతాలపై పేరుకున్న పాచి, పసుపు మరకలను ఇంట్లోనే బేకింగ్ సోడా మరియు కొబ్బరి నూనెతో సులభంగా ఎలా తొలగించుకోవాలో తెలుసుకోండి. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకునే సింపుల్ చిట్కాలు.
మధ్య వయస్కులు మరియు వృద్ధులు ఆరోగ్యం కోసం జిమ్‌లకు బదులుగా టీవీ, యూట్యూబ్ ద్వారా ఇంట్లోనే వ్యాయామాలు చేయడానికి ఎలా మొగ్గు చూపుతున్నారో తెలుసుకోండి. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
మహిళలు రోజూ రాత్రి రెండు వేయించిన ఖర్జూరాలు తినడం వల్ల కలిగే హార్మోన్ల సమతుల్యత, సంతానోత్పత్తి మెరుగుదల, గర్భాశయ బలం మరియు ఎముకల ఆరోగ్య ప్రయోజనాల పూర్తి వివరాలు.
కీమోథెరపీ మరియు బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ మానవ రోగనిరోధక శక్తి కోలుకోవడంపై ఎలా ప్రభావం చూపుతాయో వివరించే తాజా వైద్య విశేషాలు.
చలికాలంలో ఎస్పీఎఫ్ మాయిశ్చరైజర్ సరిపోతుందా లేక సన్‌స్క్రీన్ అవసరమా? డాక్టర్ కరుణ మల్హోత్రా సలహాలు, రీసెర్చ్ డేటా మరియు సరైన లేయరింగ్ పద్ధతుల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అలసందల్లో ఉండే పోషకాలు, ప్రొటీన్లు, పీచు పదార్థం మరియు ఆరోగ్య ప్రయోజనాల పూర్తి సమాచారం. బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మరియు షుగర్ కంట్రోల్ కోసం అలసందలను ఎలా తినాలి?
శీతాకాలంలో జిమ్‌కు వెళ్లకుండానే బరువు తగ్గాలనుకుంటున్నారా? చలికాలంలో హైడ్రేషన్, ఆరోగ్యకరమైన పానీయాలు, డైట్ చిట్కాలతో ఫిట్‌గా ఉండే అద్భుతమైన మార్గాలను ఇక్కడ తెలుసుకోండి.
కాంతివంతమైన, మచ్చలేని మరియు సహజమైన చర్మం కోసం పచ్చి పాలను ఏ విధంగా ఉపయోగించాలో ఈ వెబ్ స్టోరీ ద్వారా తెలుసుకోండి. ఇంట్లోనే సులభంగా చర్మాన్ని మెరిపించే చిట్కాలు.
వైరల్ ఫీవర్ మరియు కోవిడ్ 19 తర్వాత గుండె ఆరోగ్యంపై పడే ప్రభావం గురించి తెలుసుకోండి. మయోకార్డిటిస్, పెరికార్డిటిస్ సమస్యలను సూచించే 5 ముఖ్యమైన హెచ్చరిక లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి వివరాలు.
ఉల్లి, వెల్లుల్లి లేకుండా అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో ఎంతో రుచికరంగా తయారయ్యే సాంప్రదాయ ఆంధ్ర స్టైల్ అల్లం వంకాయ కూర తయారీ విధానం మరియు పూర్తి పదార్థాల కొలతలతో స్టెప్ బై స్టెప్ గైడ్.
పసుపులోని కర్కుమిన్ గుణాలు మొటిమలను తగ్గించి, చర్మానికి సహజ కాంతిని ఎలా ఇస్తాయో తెలుసుకోండి. జీవక్రియలను మెరుగుపరిచే ఉత్తమ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
ఆముదం ఆకులతో మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, గౌట్ సమస్య మరియు గాయాలను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి. పూర్వకాలం నాటి ఈ అద్భుతమైన ఆయుర్వేద సహజ చిట్కాల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.