భారీ వర్షాలకు తెలంగాణలో 15 మంది మృతి..స్తంభించిన విజయవాడ హైవే
Publish Date:Sep 2, 2024
Advertisement
తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరుసగా వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల ప్రభావం నల్గొండ, వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా ఉంది. నల్గొండ జిల్లా కోదాడ వరద ముంపుకు గురయ్యింది. పలు కాలనీ వసుల ఇళ్లలోకి నీరు చేరింది. ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఖమ్మం జిల్లాలో మున్నేరు పోటెత్తింది.. ఖమ్మం జిల్లాలో దాదాపు 100 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. మహబూబాబాద్, సూర్యపేటలలో రైల్వే ట్రాక్ లు వరదతాకిడికి కోతకు గురయ్యాయి. అనేక రైళ్లు రద్దయ్యాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లుతుంది. ఇక్కడ కిలో మీటర్లకు పైగా ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. నాగార్జునాసాగర్ ఎడమకాల్వకు నాలుగు చోట్ల గండిపడింది. భక్త రామదాసు పంప్ హౌజ్ పూర్తిగా మునిగిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు చేరడంతో మూసీ, ఈసా నదులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు దాదాపు 15 మంది మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో అడ్రస్ లేకుండా పోయారు.
http://www.teluguone.com/news/content/15-people-died-in-telangana-due-to-heavy-rainsvijayawada-highway-is-at-a-standstill-39-184084.html





