జగన్ సర్వేలో బయట పడ్డ నిజాలేంటి?
Publish Date:Dec 11, 2025
Advertisement
తాజాగా కోటి సంతకాల సేకరణ చేసింది వైసీపీ. జగన్ పాలనికిదో రెఫరెండంగానూ చెప్పుకొస్తున్నారు భూమన, రోజా వంటి వైసీపీ జగజ్జంత్రీలు. ఇదంతా ఇలా ఉంటే ఈ పైపై మెరుగులకు మోస పోని... జగన్ లోలోపల ఒక భారీ సర్వే చేయించారట. ఈ సర్వేలో 18 నెలల కూటమిపాలన ఎలా ఉందో ఒక తులనాత్మక పరిశీలన చేయించారట. ఈ పరిశీలనలో తేలిన వాస్తవాలేంటో చూస్తే.. గతంలో కన్నా ఎంతో మెరుగ్గా కూటమి పాలన ఉన్నట్టు చెప్పారట ఈ సర్వేలో పాల్గొన్న ప్రజలు. తమకు అన్నీ పథకాలు అందుతున్నాయని.. ఫించన్లు స్వయంగా బాబే ఇవ్వడం గొప్ప విషయమనీ.. గూగుల్ వంటి సంస్థలు రావడంతో పాటు.. ఇటీవల పార్టనర్ సమ్మిట్ ద్వారా 13 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయని.. ఇక సంక్షేమపథకాలు కూడా పెద్ద ఎత్తున జనానికి చేరుతున్నాయనీ చెప్పారట. మరి పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు ఈ కూటమి కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయమేంటని అడగ్గా.. అలా ఉంటేనే రాజధానిపూర్తవుతుంది. పోలవరం కూడా కంప్లీట్ అవుతుంది. ఆపై కేంద్రప్రభుత్వంతో ఉన్న సఖ్యత కారణంగా ఇంకా ఎన్నో మంచి పనులు జరుగుతాయి కాబట్టి.. మాకీ ప్రభుత్వమే బాగుందని అన్నారట ఆంధ్రప్రజలు. ఇక చంద్రబాబు అపార అనుభవం, లోకేష్ యువనాయకత్వం, పవన్ పాపులారిటీ కూటమి ప్రభుత్వానికి పెట్టని కోటలుగా మారి.. ఏపీని సంక్షేమాబివృద్ధి దిశగా పరుగులు తీయిస్తున్నట్టుగానూ చెప్పుకొచ్చారట సర్వేలో పాల్గొన్న ప్రజలు. దీంతో జగన్ కి దిమ్మ తిరిగి భవిష్యత్ బొమ్మ కనిపించిందట. ఆయన అధికారపు ఆశలపై ఫ్రిడ్జ్ లోంచి బయటకు తీసిన చల్ల చల్లని నీళ్లు కుమ్మరించినట్టయ్యిందట. బేసిగ్గా జగన్ ఇప్పటి వరకూ ఏం భావించాడో చూస్తే.. ఆయనకు ఉన్న 40 శాతం ఓటు బ్యాంకుకు కూటమి వ్యతిరేఖత ద్వారా మరో 8 శాతం ఓటు బ్యాంకు తన పార్టీకి కలిసి వస్తుంది. కాబట్టి, సుమారు 50 శాతం ఓట్లతో తాను 2029లో గెలవబోతున్నట్టుగా ఫీలయ్యేవారట ఇన్నాళ్లూ. ఇప్పుడా ఫీలింగ్స్ మొత్తం బూడిదలో పోసినట్టే అయ్యిందట. ఆ సర్వే ఫలితాలు అలా అఘోరించాయట. ఇలా ఎందుకు జరిగిందో కూపీ లాగిన జగన్ కి నమ్మలేని నిజాలెన్నో బయట పడ్డాయట. మరీ ముఖ్యంగా జగన్ మైండ్ సెట్లో ఆల్రెడీ ఉన్న హింసాత్మక ప్రవృత్తికి రప్పా రప్పా ఫ్లెక్సీల మోత కూడా తోడయ్యిందట. అంతే కాదు కొందరు ఫ్యాను పార్టీ మద్దతు దారులు కౌంటింగ్ మొదలయ్యి ఫలితాలు తమ వైపునకు తిరుగుతున్నాయని తెలిసిన వెంటనే న*కుడు మొదలవుతుందని చేస్తోన్న హెచ్చరికలు సైతం ఆయనకు చేటు తెస్తున్నట్టు బయట పడిందట.
http://www.teluguone.com/news/content/jagan-survey-39-210842.html




