జగన్ తెలివే తెలివి!

Publish Date:Nov 30, 2013

Advertisement

 

 

 

రాష్ట్రాన్ని అడ్డంగా ముంచేసిన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పోతూపోతూ తనకంటే వెయ్యిరెట్లు ఎక్కువ తెలివితేటలున్న జగన్ని ఈ రాష్ట్రానికి కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు. తెలివితేటల్లో ఆయనే ముదురనుకుంటే ఆయనగాని తనయుడు జగన్ మహాముదురు... ఇంకా చెప్పాలంటే దేశముదురు! వివిధ సందర్భాలలో జగన్ ప్రదర్శిస్తున్న తెలివితేటలు చూస్తుంటే కాకలు తిరిగిన రాజకీయ పరిశీలకులకే నోటమాట రావడం లేదు. ఏదైనా ఇష్యూని తనకు అనుకూలంగా టర్న్ చేసుకోవడంలో జగన్ తెలివే తెలివని నోళ్ళు పెగల్చుకుని మరీ అంటున్నారు.

 

ఇప్పుడు కృష్ణానది మిగులు జలాల విషయంలో రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. తెలుగోడు భవిష్యత్తులో నీళ్ళో రామచంద్రా అని అల్లాడే పరిస్థితులు వచ్చే ప్రమాదం వుంది. రాష్ట్రమంతా ఈ బాధలో వుంటే, జగన్ మాత్రం ఈ ఇష్యూలో కొత్తకోణం ఆలోచించాడు. ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబే కారణమని తేల్చిపారేశాడు. ‘‘మిగులు జలాల మీద మేము హక్కు కోరం’’ అని దివంగత రాజశేఖరరెడ్డి ట్రిబ్యునల్‌కి లేఖ రాసిన పాపమే ఇప్పుడు తెలుగు ప్రజల పాలిట శాపంగా మారిందని అందరూ దివంగతుడైన పెద్దమనిషిని విమర్శిస్తున్నారు.  ఈ సమయంలో నేరం తన తండ్రి మీదకు రాకుండా వుండటానికి జగన్ భలే పథకం వేశాడు.



ఈ ఇష్యూలో చంద్రబాబునే దోషిగా నిలబెట్టే ప్లాన్ వేశాడు. దాంతో చంద్రబాబు తన తొమ్మిదేళ్ళ హయాంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందని వెరైటీ పాట పాడటం మొదలుపెట్టాడు. లేఖ రాసి తప్పు చేసిన తన ‘బాబు’ మీద వున్న ఫోకస్‌ని తన రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్ర‘బాబు’ మీదకు మళ్ళేలా స్కీమ్ సెట్ చేశాడు. ఈ స్కీమ్‌ని మరింత మోయడానికి జగన్ మానసపుత్రికలు పేపరు, ఛానలూ ఎలాగూ ఉండనే వున్నాయి. దొంగే దొంగా దొంగా అని అరిస్తే ఎలా వుంటుందో ఇదికూడా అలాగే వుంది.

By
en-us Political News

  
పవన్ కళ్యాణ్‌తో సహా మెజారిటీ సభ్యులు లేచి నిల్చున్నారు. దాంతో సభలో నవ్వులు విరిశాయి.
అగ్రరాజ్యంలాగా ప్రపంచం మీద ఆధిపత్యం చేయాలని చూసే అమెరికా పరిస్థితి గురివింద గింజ మాదిరిగానే తయారైంది. తమ దేశంలో తప్ప మిగతా ప్రపంచంలో ఎక్కడా భద్రత వుండదని భావిస్తూ వుంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వానికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పథంలో దూసుకువెళ్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలర్ట్ అయినట్టు సమాచారం.
హు కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలో సమాధానం దొరకబోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు.
రాజ్యాన్ని పాలించే రాజుకు మంచిత‌నం మాత్ర‌మే ఉంటే స‌రిపోదు.. ఎప్పుడూ ప్ర‌జ‌ల అభివృద్ధికోసం ఆలోచించ‌డ‌మే కాదు.. రాజ్యంపై దండెత్తే ప్ర‌త్య‌ర్థులపైనా, దోపిడీ దారుల‌పైనా కఠినంగానూ ఉండాలి. అప్పుడే రాజ్యంలోని ప్ర‌జ‌లు ఎలాంటి భ‌యాలు లేకుండా సంతోషంగా జీవ‌నం సాగిస్తారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున తన మార్క్ హంగామా ప్రదర్శించారు. అసెంబ్లీ సజావుగా సాగడం జగన్ కు సుతరామూ ఇష్టం లేదన్న సంగతిని తొలి రోజు విస్పష్టంగా బయటపెట్టుకున్నారు.
ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో జగన్ అనే ఒక మహా నటుడు వున్నాడు. ఈసారి ఆస్కార్ అవార్డు ఆయనకి ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.
కమ్మ అంటే అమ్మలాంటి వాళ్ళు. ఆకలి మీద వున్న వాళ్ళకి అమ్మలాగా అన్నం పెట్టే కులం ఇది అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఏరా విజయసాయిరెడ్డి కళింగిరి శాంతిని కూతుర్లా భావించాట్ట. ఈ గొప్ప విషయాన్ని తెలియజేస్తూ శనివారం నాడు ఏరా విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశాడు.
జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు, ప్రభుత్వానికి అడ్డుగా కట్టిన గోడ ఇప్పుడు కూలిపోయింది. బెర్లిన్ గోడ లాగా అవరోధాన్ని కలిగిస్తున్న ఈ గోడను ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాలతో కూల్చేశారు.
సకల రోగాలకూ మందు జాలిమ్ లోషన్ అన్నట్లుగా.. రాజకీయంగా తాను ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ రైతు రుణమాఫీయే విరుగుడు అని రేవంత్ భావిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం వలసల పర్వం కొనసాగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కాంగ్రెస్ లోకి చేరిపోతుండగా, ఆ పార్టీకి రాజ్యసభలో ఉన్న నలుగురు సభ్యులూ గంపగుత్తగా కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మనుగడపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ ఎక్కడా కనిపించడం లేదు. ఏదో ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలో వార్తలు, ప్రకటనల్లో తప్ప.. రాష్ట్రంలో ఎక్కడా ఆ పార్టీ నేతలు కనిపించడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.