బండి వెర్సెస్ ఈటల.. ముదురుతున్న యుద్ధం!

Publish Date:Jun 23, 2025

Advertisement

భారతీయ జనతా పార్టీ  తెలంగాణ రాష్ట్ర శాఖలో సందడి మొదలైంది. కారణాలు ఏవైనా చాలా కాలంగా స్తబ్దుగా  ఉన్న కమలదళం నాయకుల్లో కదలిక వచ్చింది. అయితే..  కదలికతో పాటు  కయ్యాలకు తెర లేచింది. అఫ్కోర్స్.. పార్టీ స్తబ్దుగా ఉన్నా, మరోలా ఉన్నా.. బీజేపీలో అంతర్గత కుమ్ము లాటలు,నాయకుల మధ్య విభేదాలు, వివాదాలు నిత్యకృత్యంగా సాగుతూనే ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. అయితే..   తాజాగా పాత గొడవలు కొత్తగా తెర పైకి రావడంతో పార్టీ క్యాడర్  నారాజ్  అవుతున్నారు.  పార్టీ ముఖ్య నాయకులు, వ్యవహరిస్తున్న తీరు, మరీ ముఖ్యంగా ఈ ఇద్దరు కీలక నేతలు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో  బహిరంగంగా పరస్పర విరుద్ద ప్రకటనలు చేయడం పార్టీ ఇమేజ్ ని దెబ్బ తీస్తోందని పార్టీ వర్గాల్లో అందోళన, పార్టీ క్యాడర్ లో ఆవేదన వ్యక్తమవుతున్నాయి.

నిజానికి..  కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద మోదీ, సారధ్యంలోని  ఎన్డీఎ ప్రభుత్వం ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని  సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో మల్కా జ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో ఆదివారం(జూన్ 22) వికసిత్‌ భారత్‌ సంకల్ప సభ జరుగతున్న సమయంలోనే.. కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్  సభకు హాజరు కాకపోవడమే కాకుండా..  అదే సమయంలో  కరీంనగర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసీ మరీ,కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో.. గతంలో ఈటల చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా తప్పు పట్టారు.అంతే కాదు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో బీజేపీ స్టాండ్ ఎప్పుడూ ఒక్కటే అంటూ..  కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అయిందని గతంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన మాట, తీసుకున్న స్టాండ్ లో ఈ రోజుకూ ఇసుమంతైనా  మార్పు లేదని కుండబద్దలు కొట్టేసినట్లు చెప్పారు. అంత వరకు అయితే కొంతవకు ఓకే.. బండి అక్కడితో ఆగలేదు బీజేపీలో ఉన్న ఎవరైనా  బీజేపీ స్టాండే తీసుకోవాలనీ..  వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండదని పరోక్షంగా ఈటలకు చురకలు అంటించారు.  

అంతే కాదు..  కాళేశ్వరం ప్రాజెక్టు సమబందించి అప్పటిరాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని, మాజీ మంత్రి హోదాలో ఈటల ఒకటికి పదిసార్లు చెప్పడమే కాకుండా,కాళేశ్వరం ప్రాజెక్టుకు కాబినెట్ ఆమోదం లేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పు కుంటానని కాంగ్రెస్ నేతలకు సవాలు కూడా విసిరారు. అయితే, బండి సంజయ్ ఈటల సవాలును సింపుల్ గా తీసి పారేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈటల రాజేందర్ అభిప్రాయానికి పార్టీ స్టాండ్ పూర్తి భిన్నమని బండి పేర్కొన్నారు. కేసీఆర్ కాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారంటే.. ఎవరూ నమ్మరన్నారు. అంటేఈటల చెప్పింది తప్పు, కాంగ్రెస్ చెప్పిందే సత్యం అని బండి, కాంగ్రెస్ పార్టీకి సర్టిఫికేట్ ఇచ్చారు.  

విషయంలోకి వెళితే, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్ లో మూడు పిల్లర్లు కూలిన సంఘటన, ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలు, ఆర్థిక ఆకతవకలపై విచారణ జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ పీసీఘోష్ కమిషన్‌  ఏర్పాటు చేసిన విషయం  అందరికీ తెలిసిందే. ఈ కమిటీ ఎదుట ఈటల రాజేందర్, బీజేపీ ఎంపీగా కాకుండా..  గతంలో  కేసీఆర్  మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి,  మాజీ మంత్రి హోదాలో ఇటీవల హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో , ఆర్థిక విషయాలకు సబంధం లేని  కాబినెట్ ఆమోదం వంటి కొన్ని సాంకేతిక అంశాలకు సంబంధించి  కేసీఆర్  ప్రభుత్వానికి సానుకూలంగా మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు, ఈటల వ్యాఖ్యల, పూర్వాపరాలు, పర్యవసానాలపై, పార్టీలో చర్చ జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట, ఈటల మాజీ మంత్రిగా హాజరయ్యారే కానీ, బీజేపీ ఎంపీగా హాజరు కాలేదని స్పష్టం చేశారు. సరే.. అది ఎంత వరకు సమంజసం అనే విషయాన్నిపక్కనపెడితే.. అంతర్గతంగా చర్చించవలసిన  అంశాలను  బహిరంగా అది కూడా  బీజేపీ దేశ వ్యాప్తంగా, భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగంగా మోదీ ప్రభుత్వం విజయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ అభియాన్ లో  భాగంగా రాష్ట్రంలో వికసిత భారత్ సంకల్ప సభ నిర్వహిస్తున్న  సమయంలో.. పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్దేశపూర్వకంగా వివాదాన్ని సృష్టించదాన్ని పార్టీ పెద్దలు తప్పుపడుతున్నారు. అలాగే..  ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య రాజుకున్న ఈ వివాదం ఎటు దారి తెస్తుంది, ఎందాకా పోతుంది అనేది  ఇప్పడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. అలాగే..  పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుంటేనే కానీ, బండి వర్సెస్ ఈటల మధ్య ముదురుతున్న యుద్ధం చల్లారదని అంటున్నారు.

By
en-us Political News

  
ఏపీ మద్యం కుంభ కోణం కేసులో అరెస్ట్‌యిన వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రత్యేక వసతులు కల్పించడానికి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది.
హైదరాబాద్ వనస్థలిపురంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బోనాల పండుగకు తెచ్చుకున్న చికెన్, మటన్ బొటిని ఫ్రిజ్‌లో పెట్టుకుని తిని ఓకే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురుయ్యారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయ్‌ రెడ్డి ఏసీబీ కోర్టు ఎదుట తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జైల్లో ఉన్న తన గురించి, బయట ఉన్న తన ఫ్యామిలీ గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ జడ్జి ముందు ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ వ్యాప్తంగా సంచలన సృష్టించిన వైసీపీ నేత అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు తదుపరి విచారణకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుమతి ఇచ్చింది.
వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పేర్లు మార్పుపై ఏడుగురు మంత్రులతో ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేసింది.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి సందడి చేశారు. పట్టణంలోని రాజగోపాలపురంలో టీచ్‌ ఫర్‌ చేంజ్‌ఫౌండేషన్‌ ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ను మంచు లక్ష్మి ప్రారంభించారు.
తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన జరిగింది.
జ‌గ‌న్ స్టైలే వేర‌బ్బా. చాలా మంది చంద్ర‌బాబే సంప‌ద సృష్టిలో టాప్ అంటారుగానీ అదంతా ఉట్టిది. ఇది కేవ‌లం రాష్ట్రానికి సంబంధించిన వ్య‌వ‌హారం. అదే సొంతంగా సంపాదించ‌డంలో జ‌గ‌న్ త‌ర్వాతే ఎవ‌రైనా.
భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావానికి కొంచెం అటూ ఇటుగా, జన్మించిన కురువృద్ద కమ్యూనిస్ట్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ మృతితో భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది.
ర్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండవరోజు ఎలాంటి చర్చ లేకుండా వాయిదా పడ్డాయి.
తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఘం క్యూ కాంప్లెక్స-3 నిర్మాణానికి సాధ్యాసాధ్యాల పరిశీలనకు నిపుణుల కమిటీని వేయాలని తరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయించింది.
మ‌ద్య‌పాన నిషేధం అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో ఏకంగా మద్యం కుంభకోణం చేసి 3500 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని సిట్ అంటోంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ వేసిన 305 పేజీల‌ ఛార్జ్ షీట్ లో ఈ స్కామ్ లో కీల‌క పాత్ర పోషించినది ఏ 1 రాజ్ కేసిరెడ్డి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.