తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది.  ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కాంగ్రెస్ అభ్యర్థికే అనుకూలంగా వచ్చాయి. జూబ్లీహిల్స్ ఓటర్లు అధికార పార్టీకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన అన్ని సంస్థలూ అంచనావేశాయి.   మాగంటి మరణం తర్వాత అనివార్యంగా జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అందరికంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం మొదలుపెట్టింది. సిట్టింగ్ సీట్‌ను ఎలాగైనా దక్కించుకునేందుకు, తిరిగి మాగంటి కుటుంబానికే జూబ్లీహిల్స్ టికెట్ కన్ ఫర్మ్  చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. సెంటిమెంటే తమ అస్త్రంగా మాగంటి సునీత, ఆమె కుటుంబ సభ్యులు ప్రచారం చేశారు. అయినా కూడా మాగంటి సునీతకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ వర్గాలలో దీనిపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి.  జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి వరుసగా  మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపినాథ్ కు అనేకమంది అనుచరులు, అభిమానులు ఉన్నారు. అయితే ఆయన అకాల మరణం తర్వాత వచ్చిన ఈ ఉపఎన్నికలో మాత్రం గోపినాథ్ భార్య మాగంటి సునీతకు ఆయన అనుచరులు, అభిమానులు ఎవరూ  గ్రౌండ్ లెవల్ లో సహకరించలేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాగంటి ఎన్నికల్లో నిలబడుతున్నారంటే చాలు ఆయన అభిమానులే ఎన్నికల భారమంతా తమ భుజాల మీద మోస్తూ గోపీనాథ్ ను గెలుపించుకునేవారు. కానీ, ఈ ఉపఎన్నికలో మాత్రం వారంతా నామమాత్రంగానే పనిచేశారనీ, అందుకే సునీత వెనుకంజలో ఉన్నారని గులాబీ పార్టీలో టాక్ నడుస్తోంది.  మాగంటి సునీత విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ ఎలాగైనా ఆమెను గెలుపించుకోవాలని శతవిధాల ప్రయత్నించింది. ప్రచార బాధ్యతను మొత్తం ఒంటిచేత్తో లాక్కొచ్చిన కేటీఆర్, కింది స్థాయి నాయకత్వాన్ని సమన్యయపరచడానికి సరైన కార్యచరణ చేయలేకపోయారని, మాగంటి గోపీనాథ్ అనుచరులను సునీత విజయం  కోసం పనిచేసేలా మోటివేట్ చేయడంలో విఫలమయ్యారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే సునీత విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డ కేటీఆర్ నాయకుల్లో సమన్వయం తీసుకురావడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారట. మాగంటి గోపీనాథ్‌ది సహజ మరణం కాదంటూ, ఆయన మరణం వెనుక ఏదో కారణం ఉందంటూ.. గోపీనాథ్ అభిమానుల పేర్లతో జూబ్లీహిల్స్ లో వెలిసిన పోస్టర్లు.. మాగంటి మొదటి భార్య, కొడుకు హైదరాబాద్ కు వచ్చి చేసిన ఆరోపణలు, గోపీనాథ్ తల్లి మహానంద కుమారి ఏకంగా కేటీఆర్ పైనే ఆరోపణలు చేయడం.. ఇవన్నీ సునీత ఓటమికి కారణాలు అయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    గోపీనాథ్ అభిమానులు, అనుచరులు ఈ ఉప ఎన్నికలో సునీత విజయం కోసం అంకిత భావంతో పని చేయకపోవడం  బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగా మారిందని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి.  మరి చూడాలి ఈ ఉపఎన్నిక ఫలితం ఎలా ఉంటుందో..  మాగంటి సునీతకు ఎంతమేర ఓటు పర్సెంటేజ్ నమోదవుతుందో?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం (నవంబర్ 14)న వెలువడనున్నాయి. పోలింగ్ ఈ నెల 11న అంటే మంగళవారం జరిగిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం తధ్యం అని అంచనా వేసినా, తుది ఫలితం కోసం పార్టీలూ, అభ్యర్థులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో కూడా తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి వ్యక్తం అవుతోంది.   ఈ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తరువాత కేంద్ర బలగాల మూడంచెల భద్రత నడుమ కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో భద్రంగా ఉంచారు. శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమౌతుంది.  ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి.  ఇక కౌంటిగ్ కోసం  42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలోనే  కౌంటింగ్ పూర్తి అవుతుంది.  ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు అధికారులు కౌంటింగ్‌లో పాల్గొంటారు. అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లో నుంచి ఈవీఎంలను తీసుకొచ్చి కౌంటింగ్ ప్రారంభిస్తారు.  ఈ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాకపోవడంతో.. ముందుగా హోం ఓటింగ్ ఓట్లు లెక్కిస్తారని తెలుస్తోంది.  హోం ఓటింగ్ కోసం 103 మంది నుంచి అప్లికేషన్లు రాగా, 101 మంది ఓటు వేశారు. ఈవీఎంలో ముందుగా షేక్ పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. చివరగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్ పూర్తయిన వెంటనే ఫలితాల వివరాలను ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. మరోవైపు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. ఇందులో 1,94,631 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 99,771 మంది పురుషులు, 94,855 మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. మొత్తం 48.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.  ఇక మధ్యాహ్నానికల్లా ఫలితం వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. 
ఒకే రోజు మూడు సారీలు. లారీల నిండా సారీలు. వారిలో టాప్ ప్లేస్ కి చెందిన సారీ చెప్పిన వారు.. మంత్రి కొండా సురేఖ‌. ఈమె గ‌తంలో అంటే తాను మంత్రి అయిన తొలి రోజుల్లో  నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఒక అబాంఢం వేశారు. దీంతో  నాగార్జున న్యాయాన్ని ఆశ్ర‌యించారు కూడా. ఆపై సురేఖ మంత్రిపదవి ఊడిపోతుందేమో అన్నంతగా వ్య‌వ‌హారం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.  అయితే.. , బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారే అలా వెంట్రుక వాసిలో  అప్పట్లో వేటు నుంచి కొండా సురేఖ త‌ప్పించుకున్నారు.  ఆమె మంత్రిగా ఉండి కూడా  ప్రభుత్వంలో తమను   తొక్కేస్తున్నార‌ని ఆరోపణలు గుప్పించి కూడా  పదవిని భద్రంగా కాపాడుకోగలుగుతున్నారు. అది వేరే విషయం.  అప్ప‌టి నుంచీ కూడా సురేఖ సైలెంట్ మోడ్ లో కి వెళ్లిపోయాన‌ని అంటారు. తానేదైనా అంటే  అది మ‌రొక‌టిగా రూపాంత‌రం చెందుతోంద‌ని.. ఫీల‌య్యి మీడియాతో మాట్లాడ్డ‌మే మానేశాన‌ని చెప్పుకొచ్చారీ మ‌ధ్య ఒక మీడియా చిట్ చాట్ లో. ఇప్పుడు కూడా సురేఖ‌.. ట్వీట్ చేసి స‌రిపుచ్చారు త‌ప్ప‌.. మీడియా ముందుకు రాకుండా జాగ్ర‌త్త వ‌హించారు చూశారా!? ద‌టీజ్ కొండంత సారీల సురేఖ‌  అంటే. ఇక  రెండో బిగ్గెస్ట్ సారీ ఆఫ్ ద ఏపీ విష‌యానికి వ‌స్తే.. మాజీ ఐఏఎస్ ప్ర‌వీణ్ ప్ర‌కాశ్. ఒక స‌మ‌యంలో షాడో సీఎం గా వ్య‌వ‌హించార‌న్న పేరుండేది. అప్ప‌ట్లో ఇద్ద‌రి ప‌ట్ల తాను ఎంతో దారుణంగా ప్ర‌వ‌ర్తించాన‌నీ ఆయ‌న ఇప్పుడు తాజాగా ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేశారు. ఇంత‌కీ వారెవ‌రో చూస్తే మాజీ ఐపీఎస్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు, ఐఆర్ఎస్ జాస్తి కిషోర్ కుమార్. ఈ ఇద్ద‌రి ప‌ట్ల తాను అలా వ్య‌వ‌హ‌రించి ఉండ‌కుండా ఉండాల్సింద‌న్న కోణంలో ఆయ‌న చేసిన ఒక వీడియో ప్రెజంటేష‌న్ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.  అప్ప‌ట్లో జ‌గ‌న్ ఏదంటే  అది అన్న మాట‌క‌న్నా, ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ ఏదంటే అదీ అన్న టాక్ వినిపించేది. ఒక ద‌శ‌లో ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ మీద ఉపాధ్యాయులంతా  క‌ల‌సి కంప్ల‌యింట్ చేశారంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు. అలాంటి ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ నుంచి  సారీ.. అది  కూడా ఇద్ద‌రు ఉన్న‌తాధికారుల‌కు అందింది.  ఒక మూడో సారీ..  న‌టుడు ప్ర‌కాష్ రాజ్చెప్పారు.   బేసిగ్గా ప్ర‌కాష్ రాజ్ ఎంత అగ్రెసివ్ గా ఉంటారంటే.. జ‌స్ట్ ఆస్కింగ్ పేరిట ఏకంగా ప్ర‌ధాన మంత్రినే ఏ ప్ర‌శ్న‌లంటే ఆ ప్ర‌శ్న‌లు అడిగే బాప‌తు. దేశంలో ఏ చిన్న విష‌య‌మైనా స‌రే ఆయ‌న నిగ్గ దీసి అడుగు- ఈ సిగ్గులేని స‌మాజాన్ని అనే టైపు. అలాంటి ప్ర‌కాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్ చేసినందుకుగానూ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తనకే పాపం తెలీదంటే అది త‌ప్పు అవుతుందని అన్నారు.  అయితే.. తాను గ‌తంలో చేసిన బెట్టింగ్ యాప్ ప్ర‌చారానికిగానూ సారీ చెబుతున్నా! అంటూ మీడియా ముఖంగా చెప్పారు. దీంతో ఒకే రోజు ముగ్గురు ప్ర‌ముఖుల నుంచి మూడు సారీలు వెలువ‌డ్డంతో ఇదో స‌రికొత్త రికార్డు  సృష్టించింది. వీరంతా మామూలోళ్లు కారు. అలాంటి మొండి- జ‌గ‌మొండి ఘ‌టాల నుంచి ఇలాంటి క్ష‌మాప‌ణ‌ల ప‌ర్వం ఈ స‌మాజం చూస్తుంద‌నుకోలేదు. కాబ‌ట్టే ఇంత ఎగ్జ‌యిట్ మెంట్. ఇందులో ఏదైనా త‌ప్పుంటే సారీయే..!
ALSO ON TELUGUONE N E W S
Cast: Dulquer Salmaan, Bhagyashrii Borse, Rana Daggubati, Samuthirakani, Nizhalgal Ravi, Ravindra Vijay Crew:  Music by Jhanu Chanthar, Jakes Bejoy Cinematography by Dani Sanchez-Lopez Edited by Llewellyn Anthony Gonsalvez Written by Tamizh Prabha, Selvamani Selvaraj Directed by Selvamani Selvaraj Produced by Rana Daggubati, Dulquer Salmaan, Prashanth Potluri, Jom Varghese   Dulquer Salmaan has become the poster boy of period dramas and in Telugu, he did every film that narrates a story in the past. Mahanati, Sita Ramam, Lucky Baskhar all have gone to the bygone era and Kaantha is a film within a film that too from 1950's. Rana Daggubati has produced the film and he even been part of it. Bhagyashri Borse is playing the leading lady. Let's dive into the details about the film.    Plot:  TK Mahadevan (Dulquer Salmaan) is one of the biggest stars of Cinema and he is the discovery of a highly talented and respected director, Ayya (Samuthirakani). Ayya wants to direct a film, Shantha, to honor his mother and it is Mahadevan, who gives the idea after their first film. But they both are not on talking terms and have ego issues. Still, Mahadevan comes forward to rejuvenate the film but on his own terms.  He changes the movie title to Kaantha but the leading lady Kumari (Bhagyashri Borse) promises to Ayya that she would listen to only his word. Mesmerised by her talent and beauty, Mahadevan doesn't object to her yet he keeps showcasing his star power on sets. Slowly, Kumari and Mahadevan grow closer and fall in love. But Mahadevan is already married and that too, to a very famous media baron. So, where does the ego battle and fame lead the story forward? What does Pheonix (Rana Daggubati) do to find out the truth behind everything? Watch the movie to know more.  Analysis:  Dulquer Salmaan deserves every award in the book for his stunning performance. He is able to bring the yesteryear actor character to life with ease and deliver the melodrama on point. He is the cog that holds the script together with his genuine and honest performance. The mirror scene in the first hour and climax juxtaposed perfectly and he nailed both with variations.  Rana Daggubati is cool and good in his performance. Bhagyashri Borse got a very heavy role and she needed to look innocent. While she tried her best the performance did not really stand out as much as the script needed. Still, she did look the part and her screen presence had been stunning. Samuthirakani looked too serious and did not really carry the layered character as it came across monotonous.  Selvamani Selvaraj's ambition is applaudable has he is able to bring authenticity to the proceedings from the first frame. But the writing and execution lacked any sort of novelty as they looked like derived from Mahanati and Iddaru without the same level of brilliance. The sequences looked repetitive rather than engaging after a point as narrative did not really hold on to one sort of rhythm.  While it starts as a battle of egos, it transforms into romance, then into a film within a film and then an investigation. None of the elements really sustain the interest as much as the performances do. While Dulquer aces out some of the other actors did seem a little bit uneven. Technically, the portions of film within a film are brilliant and even production values are high quality.  Sound department worked hard to bring the old world atmosphere believable and frames are richly lit to feel like a painting. Writing needed to be much better for this drama to really flourish as the narrative seems to be going in rounds unable to find the unifying cog and tone. Kaantha is film for performances and each actor delivers at least one brilliant scene while Dulquer just smacks it out of the park.  Bottomline:  Performances and technical values enhance a middling drama.    Rating: 2.75/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
  తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబం పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కొండా సురేఖ క్షమాపణలు చెప్పడంతో.. ఈ కేసు విషయంలో నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారు.   నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ.. గతేడాది అక్టోబర్ లో మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను అందరూ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. ఇక నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడిన సురేఖపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతకాలంగా నాంపల్లి స్పెషల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది.   Also Read: కాంత మూవీ ఫస్ట్ రివ్యూ   అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా.. అక్కినేని కుటుంబం విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని చెబుతూ కొండా సురేఖ క్షమాపణలు తెలిపారు.   కొండా సురేఖ క్షమాపణలు చెప్పడంతో తాజాగా ఈ కేసును విత్ డ్రా చేసుకున్నారు నాగార్జున. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.  
    -డిజె ట్వీట్ వైరల్  -అసలు ట్వీట్ లో ఏముంది! - తెలుసు కదా ఓటిటి లోకి రెడీ    ఒరిజినల్ పేరుతో కాకుండా తన హిట్ సినిమాలోని క్యారక్టర్ పేరుతో అభిమానులు,ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించే హీరోలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి ఒక అరుదైన హీరో 'డిజె టిల్లు అలియాస్ సిద్దు జొన్నలగడ్డ'(Siddhu Jonnalagadda).గత నెల 17 న 'తెలుసు కదా'(Telusu kada)అనే మూవీతో  థియేటర్స్ లోకి అడుగుపెట్టాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కగా టిల్లు సరసన రాశి ఖన్నా(Raashii Khanna)శ్రీనిధి శెట్టి(Srindhi Shetty)జంటగా కనిపించారు. బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంది.   ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి వేదికగా సందడి చెయ్యడానికి రెడీ అవుతుంది. ఈ మేరకు నవంబర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికార ప్రకటన కూడా వచ్చింది. రీసెంట్ గా స్ట్రీమింగ్ విషయంపై టిల్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు. సదరు ట్వీట్ లో 'చిల్డ్రెన్స్ డే రోజున 'తెలుసు కదా'స్ట్రీమింగ్ కి తీసుకురావడం పెద్ద స్పాయిలర్ అని మెన్షన్ చేసాడు. ఇప్పుడు ఈ ట్వీట్ టిల్లు అభిమానుల్లో వైరల్ గా మారింది. మరి థియేటర్స్ లో పెద్దగా ఆదరణ నోచుకోని తెలుసు కదా ఓటిటి లో ఏ మేర అదరణని అందుకుంటుందో చూడాలి.   also read:   నన్ను చంపాలని చూసారు..అందుకు కారణం వాళ్ళకి తెలుసు    'తెలుసు కదా' ని ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory)నిర్మించగా నీరజా కోన(Neeraja Kona)దర్శకత్వం వహించింది. అగ్ర టెక్నీషీయన్స్ అందరు 'తెలుసు కదా' కి వర్క్ చేశారు. సరికొత్త కథ, కథనాల విషయంలో మాత్రం మేకర్స్ కాంప్రమైజ్ కాలేదు.        
  విభిన్న చిత్రాలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్.. 'కాంత' అనే మరో ఆసక్తికర సినిమాతో రేపు(నవంబర్ 14) ప్రేక్షకులను పలకరించనున్నాడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 1950లలో హీరో, డైరెక్టర్ మధ్య ఇగో క్లాష్ నేపథ్యంలో రూపొందిందిన ఈ మూవీ యొక్క ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. (Kaantha Movie)   ముందుగానే 'కాంత' ప్రత్యేక షోలను ప్రదర్శిస్తున్నారు. తాజాగా తమిళ మీడియా కోసం స్పెషల్ షో వేయగా.. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో డ్రామా బాగా పండిందని, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ జరిగిన తీరు కట్టిపడేసిందని చెబుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ అనే మాట వినిపిస్తోంది.   Also Read: ఇది నిజంగా రాజమౌళి సినిమాయేనా..?   దుల్కర్ సల్మాన్, సముద్రఖని పోటాపోటీగా నటించి సినిమాని మరోస్థాయికి తీసుకెళ్ళారట. భాగ్యశ్రీ బోర్సే తన నటనతో సర్ ప్రైజ్ చేసింది అంటున్నారు. కెమెరా, ఆర్ట్, మ్యూజిక్ ఇలా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కూడా గొప్ప పనితీరుని కనబరిచాయని చెప్తున్నారు.   మొత్తానికి 'కాంత' సినిమాకి తమిళ మీడియా నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. మరి సాధారణ ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.  
SS Rajamouli has been exploring and re-defining the limits of Telugu film reach with each of his film. Post Magadheera, he had decided to not take small steps anymore and Baahubali, RRR have been global sensations. Now, with his Globe Trotter, SSMB29 starring Mahesh Babu, Priyanka Chopra, Prithviraj Sukumaran, he is aiming for a Hollywood collaboration and huge level production that is unheard of for any Telugu Cinema.  He is planning his film's announcement event also at the same level in Ramoji Film City. While the event has been restricted to only registered people with physical passes Hyderabad Police have announced even many more restrictions, traffic diversions. This is all a routine drill and very important too.  But the kind of response his character posters have been receiving from the film has been mixed. The Sanchari song sung by Shruti Haasan is gaining good traction but Priyanka Chopra's look as Mandakini, did not really resonate with audiences as the team anticipated.  So, the pre-dominant question has been if the director is growing over-confident or is he over-conscious to release very little. Some claims have arised that he used AI to develop Prithviraj's look and Priyanka Chopra's look too. It is hard to imagine him being a perfectionist using AI just for non-complicated posters.  Many audiences are of the opinion that Rajamouli is conscious about how much he can reveal at this moment and he might just shock at the event with the quality, he normally delivers. Whatever be the end result, the goal for Rajamouli has always been to deliver something unique from his side even with well-known stories. We have to wait and see, how he designed entire event at this grand scale to mesmerise world and make an announcement.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  -ఆదాశర్మ ని చంపాలని చూసింది ఎవరు! - ఆ రెండు చిత్రాల విశిష్టత ఏంటి   -ది కేరళ స్టోరీ ఎప్పుడు వచ్చింది   - బస్తర్ కథ ఏంటి      అందం, అభినయం కలగలిపిన నటీమణుల లిస్ట్ లో 'ఆదాశర్మ'(Adah sharma)కూడా ఖచ్చితంగా   ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ పై ఆ స్థాయిలో పెర్ ఫార్మెన్సు ని చూపగలదు. వర్సటైల్ దర్శకుడు 'పూరి జగన్నాధ్' దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు నాట అడుగుపెట్టింది. ఆ చిత్రంలో హయతి అనే క్యారక్టర్ లో అత్యద్భుతంగా నటించి యువకుల హృదయాల్లో గిలిగింతలు రేపింది. ఆ తర్వాత హీరోయిన్ గా కొన్ని చిత్రాలు చేసినా  హిట్ కాలేదు. కానీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా చేసిన కొన్ని చిత్రాలు మాత్రం సక్సెస్ అయ్యాయి. వాటిల్లో ఆమె మొదటి చిత్రం 1920 ,బస్టర్ ది నక్సల్ స్టోరీ(Bastar The Naxal Story), ది కేరళ స్టోరీ(The Kerala Story).ఈ మూడు చిత్రాలు హిందీలో తెరకెక్కినవే. పైగా ప్రధాన క్యారక్టర్ లో కనపడి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. సదరు క్యారెక్టర్స్ ఎంతో రిస్క్ తో కూడా కూడుకున్నవి.     రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఆదాశర్మ సదరు చిత్రాల గురించి తన అనుభవాన్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతు రిస్క్ ఉన్న క్యారెక్టర్స్ చేసినప్పుడే కెరీర్ కి మరింత విలువ పెరుగుతుంది. 1920 సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఆ చిత్రం ఒప్పుకోవడమే పెద్ద సాహసం. ది కేరళ స్టోరీ తర్వాత నా కెరీర్ మారిపోయింది. మంచి కథలు నా దగ్గరకి రావడం స్టార్ట్ చేసాయి.  బస్తర్ కి, ది కేరళ స్టోరీ రిలీజ్ అయినప్పుడు ఎన్నో బెదిరింపులు వచ్చాయి.దేశం లో సగం మంది నన్ను చంపాలని అనుకున్నారు. మిగతా సగం మంది నన్ను ప్రశంసించారు. ఒక రకంగా వాళ్లంతా నన్ను రక్షించినట్లే అని ఆదాశర్మ చెప్పుకొచ్చింది.   also read:  సద్బ్రాహ్మణుడైన సత్య ప్రకాష్ భయపెట్టే విలన్ గా ఎలా మారాడు!    ఆదా శర్మ చెప్పినట్టుగానే ఆ రెండు చిత్రాలు వచ్చినప్పుడు కొంత మంది నుంచి ఎన్నో విమర్శలు వచ్చాయి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే చాలా ఏరియాల్లో నిరసన జ్వాలల్ని వెళ్ళగక్కాయి. అదాశర్మ కేరళ స్టోరీ లో హిందూ యువతీ. కానీ ముస్లిమ్ వ్యక్తిని పెళ్లి చేసుకొని మతాన్ని మార్చుకుంటుంది. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులని ఎదురుకుంటుంది. ఆదాశర్మ  నటన కూడా సదరు క్యారక్టర్ లో పతాక స్థాయిలో ఉంటుంది. ఇక బస్టర్ లో  ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ నక్సలైట్ గా మారి సమాజాన్ని ప్రశ్నించే క్యారక్టర్ లో కనపడింది.           
Sandeep Reddy Vanga has created a huge niche for himself with his movies Arjun Reddy, Kabir Singh and Animal. Now, the audiences are eagerly waiting for his next film with Prabhas, Spirit. The cop drama is slated to be one of the most brutal and action-packed films with heavy drama from the star, in recent times.  The director is said to be recording dialogues as well to complete the shoot at a given pace. He released an audio teaser with Prakash Raj and Prabhas having an exchange about his "One Bad Habit". As everyone is waiting for the movie to go on floors, Sandeep confirmed that the movie will go on floors from this month end.  At the pre-release event Jigiris, the director confirmed about it. He attended as the chief guest and wished the team all the success. When the fans present there asked him for the update, he confirmed about Spirit shooting start dates and announced that updates will be announced at appropriate time.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  సూపర్ స్టార్ తో సినిమా చేయడానికి దర్శకులందరూ ఆసక్తి చూపుతారు. అలాంటిది అధికారికంగా ప్రకటించిన ఒక భారీ ప్రాజెక్ట్ నుండి డైరెక్టర్ తప్పుకునే సాహసం చేస్తాడా?. తాజాగా ఓ దర్శకుడు అదే పని చేసి షాకిచ్చాడు.   సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ కెరీర్ లో 173వ సినిమాగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కి దర్శకుడిగా సుందర్ సి పేరుని కూడా ప్రకటించారు.      Also Read: ఇది నిజంగా రాజమౌళి సినిమాయేనా..?   'తలైవా 173'(Thalaivar173) వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు తాజాగా దర్శకుడు సుందర్ ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి హృదయానికి కష్టంగా ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని సుందర్ తెలిపారు.   ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండి, 'తలైవా 173'కి తగిన సమయాన్ని కేటాయించలేకనే సుందర్ తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కొందరేమో స్క్రిప్ట్ విషయంలో రజినీకాంత్ సంతృప్తిగా లేరని, అందుకే సుందర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.     ఇదిలా ఉంటే, 'తలైవా 173' నుండి సుందర్ సి తప్పుకోవడంతో.. ఆయన స్థానంలో దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ ని తీసుకోవాలని సూపర్ స్టార్ అభిమానులు కోరుతున్నారు.  
      -సత్య ప్రకాష్ అసలు ఎవరు! -విలన్ గా ఎన్ని సినిమాలు  -సత్య ప్రకాష్ లా నటించే వాళ్ళు ఎంతోమంది  - ఎ ఎస్ రవికుమార్ చౌదరి ఏం చెప్పాడు      సిల్వర్ స్క్రీన్ పై ఇప్పుడంటే విలనిజం యొక్క మేనరిజం, నట ఉదృతి కొంచం తగ్గింది. కానీ ఒకప్పుడు హీరోలకి ఎంత మంది అభిమానులు, వీరాభిమానులు ఉండే వారో, విలన్ కి అదే విధంగా ఉండేవారు. అభిమాన హీరో హావభావాలతో యాక్ట్ చేసే వాళ్ళు కూడా ఎంత మంది ఉండేవారో, విలన్ హావభావాల ప్రదర్శన విషయంలో అభిమానులు తగ్గేదేలే అనే విధంగా ఉండే వారు. అటువంటి కొంత మంది విలన్స్ లో 'సత్య ప్రకాష్' కూడా ఒకరు.మూడు   దశాబ్దాల క్రితమే  వచ్చిన 'పోలీస్ స్టోరీ' మూవీలో సత్య అనే క్యారక్టర్ లో సత్య ప్రకాష్(Satya Prakash)ప్రదర్శించిన విలనిజాన్ని ప్రాక్టీస్ చేసినవాళ్లు కోకొల్లలు.   పోలీస్ స్టోరీ అనే కాదు చాలా సినిమాల్లోను తనదైన విలనిజంతో మెస్మరైజ్ చెయ్యడం సత్య రాజ్ స్పెషాలిటీ. రీసెంట్ గా 'ఓజి' లోను తన సత్తా చాటాడు. నెగిటివ్ రోల్స్ లో సత్య ప్రకాష్  మేనరిజం చాలా సపరేట్ గా ఉంటుంది. ఆవేశంతో ఒకే డైలాగ్ ని పదే పదే నొక్కి చెప్పడంలో సిద్ధహస్తుడు. అసలు సత్య ప్రకాష్ ప్రదర్శించే విలనిజం చూసి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా భయపడేవాళ్ళు. దీంతో బయట కూడా అదే విధంగా ఉంటాడనే అభిప్రాయం చాలా మందిలో ఉండేది. కానీ సత్య ప్రకాష్ ఒక సద్బ్రాహ్మణుడు. నిత్యం వేద మంత్రాలు పఠిస్తూ సదరు మంత్రాల యొక్క విశిష్టిత గురించి పది మందికి చెప్తాడు. అసలు తాను ఒక వ్యక్తి తో మాట్లాడుతుంటే ముందుగా దైవం గురించే చర్చ ఉంటుంది. అంత దైవ భక్తుడు. మరి విలనిజాన్ని ప్రదర్శించడనికి ముఖ్య కారణం నటన మీద ఆసక్తి. నటనని కూడా దైవంగా భావించాడు. సత్య ప్రకాష్ గురించి ఈ వివరాలన్నింటినీ ప్రముఖ దర్శకులు 'ఏఎస్ రవికుమార్ చౌదరి'(as Ravikumar chowdary)ఒక ఇంటర్వ్యూలో  చెప్పడం జరిగింది.    Also read:  కాంతార చాప్టర్ 1 ,కొత్తలోక చాప్టర్ 1 ఎవరు గెలిచారు.. ఒక్క పాయింట్ తేడా అంతే     ఒడిస్సా కి చెందిన సత్య ప్రకాష్  తెలుగు చిత్ర పరిశమ్రలో బడా విలన్స్ రాజ్యమేలుతున్న రోజుల్లోనే సినీ రంగ ప్రవేశం చేసి తన సత్తా చాటాడు. తన మొదటి చిత్రం నాగార్జున హీరోగా 1991 లో వచ్చిన జైత్ర యాత్ర. తెలుగులో దాదాపుగా అందరి అగ్ర హీరోల సినిమాల్లో చేసాడు. ప్రతి సినిమాలో తన బ్రాండ్ ఆఫ్ విలనిజం మాత్రం పక్కా.  మొత్తం పదకొండు భాషల్లో సుమారు 500 చిత్రాల వరకు చేసాడు. డైరెక్టర్ గాను ఎంట్రీ ఇచ్చి తన కుమారుడు తో 'ఊల్లాల్లా, ఊల్లాల్లా  అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.      
Superstar Rajinikanth and Kamal Haasan have decided to come together for a film and then, they have announced that Rajini will act in production of Kamal. The movie had been announced to be directed by Sundar C. Many wanted Arunachalam kind of fantasy comedy once again from this combination.  But Sundar C had made the difficult decision to step back from the prestigious project due to unforeseen circumstances. He described the project as a dream, thanked both legends for their guidance and lessons, and apologized for disappointing fans. He promised to continue delivering entertaining movies further too.    The reasons behind this decision have been uncertain but several media reports speculate that Sundar C could not manage the dates and pace at which the movie had to be completed. Some are speculating that Rajini wanted a complete script but it did not reach up to the expectations.  Well, fans of Rajinikanth are asking their idol to bring Karthik Subbaraj for another film as the director made a highly enjoyable fan-boy film, Petta. We have to wait and see, how the things will move forward as the speculations would be rampant from now on.  His Full Letter Reads:  It is with a heavy heart that I share some important news with you. Due to unforeseen and unavoidable circumstances, I have made the difficult decision to step back from the prestigious project, #Thalaivar173. This venture, featuring the legendary Superstar Thiru. Rajinikanth Avl and to be produced by the illustrious Ulaganayagan Thiru. Kamal Haasan Avl, was indeed a dream come true for me. In life, there are moments when we must follow the path laid out for us, even if it diverges from our dreams. My association with these two icons goes back a long way, and I will always hold them in the highest regard. The special moments we have shared over the past few days will be cherished forever by me. They have taught me invaluable lessons, and I will continue to seek their inspiration and wisdom as I move forward. Although I am stepping away from this opportunity, I shall continue to seek their expert guidance. I thank both of them from the bottom of my heart for considering me for this magnum opus. Please accept my sincere apologies if this news has disappointed those who had eagerly anticipated this venture. I am committed to making it up to you and promise to continue bringing you entertainment that keeps your spirits high. Thank you for your unwavering support and understanding. It means the world to me, and I look forward to creating more memories with you all. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  నేటి బిజీ జీవితాల్లో అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించడం వల్ల మనల్ని మనం కోల్పోవడం, మనకు మనం ప్రాధాన్యత ఇచ్చుకోవడం తగ్గుతుంది. ఇతరులు ఏదైనా అడిగినప్పుడు చాలామంది  నో చెప్పాలనుకుంటారు. కానీ చివరికి సరే అని చెబుతుంటారు. నో చెబితే ఎదుటివారు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ ఒకటైతే.. మనం కాకపోతే ఎవరు సహాయం చేస్తారు అనే మంచితనం కూడా ఇలా సరే అని చెప్పడానికి కారణం అవుతుంది.  కానీ ఇలా సరే అని చెప్పిన తరువాత చాలామంది ఆ పని పూర్తీ చేయడంలో చాలా అలసిపోతారు,  తమ మీద తాము చిరాకు పడతారు, నేనెప్పుడూ ఇంతే ఇలా తప్పు  చేస్తుంటాను అని అసంతృప్తి కలిగిస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ సరిహద్దులు నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. సరిహద్దులు నిర్ణయించుకోవడం అంటే ఇతరులను దూరం పెట్టడం లేదా దూరం చేసుకోవడం అస్సలు కాదు.. తమను తాము గౌరవించుకుంటూ ఇతరులను కూడా గౌరవించేలా చేసేది ఇలా సరిహద్దులు నిర్ణయించుకోవడమే..  సరిగ్గా సరిహద్దులను నిర్ణయించినప్పుడు సంబంధాలు బలపడతాయి. అపరాధ భావన  లేదా తప్పు చేసిన ఫీలింగ్ లేకుండా ఎవరికైనా నో చెప్పాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే.. దేని వల్ల ఎక్కువ అలసిపోతున్నాం, చిరాకు వడుతున్నాం,  ఒత్తిడి గురవుతున్నాం అనే విషయాలు ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకుంటే ఏది ముఖ్యం,  ఏది ముఖ్యం కాదు.. అనే విషయాలు అర్థం చేసుకోవచ్చు.  ఇది ఎవరికైనా ఏ విషయానికి నో చెప్పాలి,  దేనికి చెప్పకూడదు  అని నిర్ణయించుకోవడంలో సహాయపడుతుంది. ఎవరైనా ఏదైనా సహాయం అడిగినప్పుడు దాని విషయంలో పరిమితులు,  సామర్థ్యం మొదలైనవి మొహమాటం లేకుండా చెప్పాలి.  షో-ఆఫ్ చేయడానికి చాలామంది తమ గురించి కొండంత చెప్పుకుని తరువాత ఇబ్బంది పడుతుంటారు. అందుకే తమ గురించి తాము ఎక్కువ చెప్పుకోకూడదు. ఇలా చేస్తే ఇండైరెక్ట్ గా నో చెప్పినట్టు అవుతుంది. ఇతరులు ఏదైనా అడిగినప్పుడు ఆ పని చేసే సామర్థ్యం లేదా సమయం లేనప్పుడు అదే విషయాన్ని చెప్పాలి.  అంతేకానీ ఎదుటివారికి అనవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వకూడదు. ఇది అపార్థాలకు,  తగాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఎవరికైనా దేని గురించి అయినా కారణాలు చెప్పే బదులు,  తాము ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం వంటివి వివరించి చెప్పాలి.  ఇది ఎదుటి వ్యక్తిని బాధపడకుండా ఉంచుతుంది. ఎదుటివారు సరిహద్దులను మరచిపోయి అన్ని విషయాలను, పనులను సహాయం అడుగుతుంటే.. అలాంటి వారికి సున్నితంగానే సరిహద్దును గుర్తు చేయాలి.  సాధ్యమైనంత వరకే సమయాన్ని ఇవ్వాలి కానీ ఇతరుల కోసమే పూర్తీ సమయాన్ని వెచ్చించకూడదు. ఎదుటివారి దృష్టిలో ఎప్పుడూ తటస్థంగానే ఉండాలి.  అంచనాలు పెరుగుతూ ఉంటే వారి దృష్టిలో ఆశించడం కూడా పెరుగుతుంది. ఎవరి అవసరాలు వారికి ముఖ్యమని ఎదుటివారికి అర్థమయ్యేలా చేస్తుండాలి. ఇలా ఉంటే ఎదుటివారు కూడా ఏ విషయం అడగాలి, ఏది అడగకూడదు  అనే విషయం అర్థం చేసుకోగలుగుతారు. సొంత పనులు వదులుకుని మరీ ఇతరుల కోసం పాకులాడకూడదు.  ఎవరికోసం ఖర్చయ్యే సమయం అయినా సరే.. ఎన్ని కారణాలు చూపించినా  ఒక్క సెకెను కూడా తిరిగి తెచ్చుకోలేం. కాబట్టి సొంత పనుల తర్వాతే ఇతరుల పనులు చేసివ్వాలి.  ఇది స్వార్థం అని చాలామంది అనుకుంటారు. కానీ మనం బాగుంటేనే.. ఇతరుల కోసం మనం చేసే పనులకు గౌరవం ఉంటుంది.                                  *రూపశ్రీ
  ప్రతి వ్యక్తి గౌరవంగా ఉండాలని అనుకంటాడు.  తను ఎక్కడ ఉంటే అక్కడ తనకు గౌరవం లభిస్తుంది అంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వపరంగా ఉన్నతంగా ఉన్నట్టే లెక్క.  కానీ చాలా మంది వ్యక్తిత్వ పరంగా సరిగా లేకుండా.. నలుగురు గౌరవం ఇవ్వడం లేదని వాపోతుంటారు.  అయితే అందరూ గౌరవం ఇవ్వాలంటే ప్రతి వ్యక్తి కొన్ని నియమాలు పాటించాలి. ఈ నియమాలు పాటిస్తే అందరూ ఆటోమేటిక్ గా గౌరవం ఇస్తారు.  నలుగురిలో ఎప్పుడూ గౌరవాన్ని ఇస్తూ వ్యక్తిని హుందాగా ఉంచే ఆ 5 నియమాలు ఏంటో తెలుసుకుంటే.. పిలుపు.. ఎవరిని అయినా, దేనికైనా పిలవడం లేదా పలకరించడం చాలా కామన్.  ఏదేనా పని కోసం కావచ్చు,  సహాయం కోసం కావచ్చు.  ఎవరిని అయినా సరే.. రెండు కంటే ఎక్కువ సార్లు పిలవకూడదు.  పదే పదే ఎక్కువ సార్లు పిలవడం వల్ల వ్యక్తుల దృష్టిలో చిన్నతనంగా మారతాము.  దీని వల్ల వ్యక్తిత్వం కూడా పలుచబడుతుంది.  సమయం కేటాయించగలిగే వారు లేదా తోడుగా ఉండగలం అనుకునేవారు అయితే ఎక్కువ సార్లు అడిగించుకోకుండానే వచ్చేస్తారు. కానీ రాలేదంటే.. వారు ఏదైనా సమస్యలో ఉండాలి, లేదంటే వారికి వచ్చే ఉద్దేశం లేక రాకపోయి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరినీ దేనికోసం ఎక్కువసార్లు పిలవకూడదు. సలహాలు, సూచనలు.. కొందరికి అత్యుత్సాహం ఉంటుంది.  పక్కన ఉన్నవారు అయినా తెలిసిన వారు అయినా స్నేహితులు అయినా, కుటుంబ సభ్యులు అయినా.. ఇలా ఎవరైనా సరే.. వారు ఏదైనా ఇబ్బంది లేదా సమస్యలో ఉన్నట్టు కనిపిస్తే ఊరికే ఉండలేరు.  తమ తెలివి తేటలు ఉపయోగించి ఏదో ఒక సలహా లేదా సూచన ఇస్తూనే ఉంటారు. ఎదుటివారు తాము చెప్పింది యాక్సెప్ట్ చేసేవరకు ఏదో ఒకటి చెప్పడం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఎదుటివారి దృష్టిలో గౌరవం ఉండదు.  అందుకే ఎదుటివారు తమకు తాము అడిగేవరకు ఎవరికీ ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వకూడదు. వినడం.. ఎదుటివారు ఏదైనా చెప్పేటప్పుడు వినాలంటే చాలామంది చాలా బోర్ ఫీలవుతారు. అదొక టైం వేస్ట్ పని అన్నట్టు ఫీలయ్యేవారు, ఎదుటివారు చెప్పింది వినడం పెద్ద తలనొప్పి అనుకునేవారు ఎక్కువ. కానీ ఎదుటివారు ఏదైనా చెప్పేటప్పుడు శ్రద్దగా వెంటే వారు చెప్పే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్ల వారికి తిరిగి సమాధానం చెప్పాలంటే ఎక్కువ సేపు మాట్లాడాల్సిన అవసరం ఉండదు.  అందుకే ఎక్కువ వినాలి,  తక్కువ మాట్లాడాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ప్లానింగ్స్.. ఏదైనా పని చేయడానికి ప్లానింగ్ గా ఉండటం చాలామంది కామన్ గా చేసేపని.  అయితే ప్లానింగ్ అనుకోగానే దాన్ని అందరికీ వివరించి చెప్పడం,  ఆ పని తర్వాత ఏం జరుగుతుంది,  దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి.. మొదలైన విషయాలన్నీ చాలామంది పూస గుచ్చినట్టు వివరించి చెప్పేస్తుంటారు.  దీనివల్ల అనుకున్న పనులు జరగకపోయినా,  అసలు పనులు మొదలు పెట్టలేకపోయినా చాలా అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చేయబోయే పనుల గురించి ఎవరికీ చెప్పకూడదు.  పనులు పూర్తయ్యే దాక ఎవరికీ చెప్పకూడదు. సంతోషం.. సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అలాగే.. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేవారు కూడా ఉంటారు.  అందుకే చాలామంది తమ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉండటం కోసం చాలా సతమతం అవుతుంటారు. ఈ క్రమంలో తమ ప్రాధాన్యతలు కోల్పోవడం, తమ పనులు మానుకోవడం వంటివి కూడా చేస్తారు. కానీ అందరినీ సంతోషంగా ఉంచడం అసాధ్యం  అనే విషయాన్ని గ్రహించాలి.  అందరినీ సంతోషంగా ఉంచడం ఒక్కరి పనే కాదని,  ఎవరి సంతోషాన్ని వారు నిలబెట్టుకోవాలని తెలుసుకోవాలి.  ఇలా ఉంటే అందరూ గౌరవిస్తారు.                                              *రూపశ్రీ.
  ఈ ప్రపంచంలో భార్యాభర్తల బంధం  చాలా అపురూపమైనది.  వేర్వేరు ప్రాంతాలలో పుట్టి పెరిగిన ఇద్దరు వ్యక్తులు వివాహం పేరుతో కలిసి జీవించడం,  ఎలాంటి పరిస్థితులు  ఎదురైనా ఒకరికి ఒకరు తోడుండటం ఈ బంధాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.  అయితే భార్యాభర్తల బంధంలో తమదే పై  చేయి ఉండాలనే పిచ్చి ఆలోచన చాలామందిలో ఉంటుంది. మరీ ముఖ్యంగా మగవారు భార్యల విషయంలో ఆధిపత్య ప్రవర్తన కలిగి ఉంటారు.  ఈ వివాహ బంధంలో చాలామంది ఆడవారు ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అదే ట్రోఫీ వైఫ్.. అసలు ట్రోఫీ వైఫ్  అంటే  ఏంటి? ఇలాంటి పరిస్థితిలో ఎక్కువమంది భార్యలు ఎందుకు ఉన్నారు? ఈ పరిస్థితిలో ఉన్నారని చెప్పడానికి భార్యాభర్తల మధ్య  ఉండే పరిస్థితులు ఏంటి? తెలుసుకుంటే.. ట్రోఫీ భార్య అంటే.. ట్రోఫీ భార్య అంటే.. భర్త కేవలం భార్య బాహ్య రూపానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం. అతని దృష్టిలో భార్యకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు.  మూడు ముళ్లు వేసి పెళ్లి పేరుతో తన ఇంటికి తీసుకుని వచ్చి భార్యను కేవలం తన అవసరానికి వాడుకోవడం చేస్తుంటాడు.  ఇలాంటి పరిస్థితిలో ఉన్న బార్యలు అందరూ ట్రోఫీ భార్యలే.  ట్రోఫీ భార్యల పరిస్థితులు.. భార్యాభర్తల బంధంలో ఏ నిర్ణయం తీసుకున్నా భార్యాభర్తలు ఇరువురూ కలిసి తీసుకోవాలి అనుకుంటారు.  భర్త అయినా, భార్య అయినా తమ పార్ట్నర్ తమను కూడా అబిప్రాయం అడగాలని అనుకుంటారు. కానీ ట్రోఫీ భార్యలు మాత్రం ఇలాంటి ప్రాధాన్యతకు నోచుకోరు.  భర్త ఏ నిర్ణయం తీసుకున్నా తన సొంతంగా తీసుకుంటాడు.  భార్య అభిప్రాయంతో కానీ,  భార్య  ఆలోచనలతో కానీ అతనికి ఆసక్తి ఉండదు. భార్యాభర్తల బంధంలో ప్రేమ ఉండాలని చాలామంది అనుకుంటారు. ముఖ్యంగా భర్త చూపించే ప్రేమ భార్యకు ఎంతో ముఖ్యం. కానీ ట్రోఫీ భార్యలు మాత్రం భర్త ప్రేమకు నోచుకోరు. భర్తలు ఒక వేళ ప్రేమ చూపించినా అదంతా షో-ఆఫ్ కే.. అంటే నలుగురు చూడాలని, తనను మంచి భర్తగా ట్యాగ్ వేయాలనే కోరికతో  నలుగురిలో భార్యల పట్ల ప్రేమ చూపిస్తుంటారు. భార్యాభర్తలు అంటే.. ఒకరి వల్ల మరొకరు సంతోషంగా ఉండాలి. కానీ కొందరు మాత్రం తమ సంతోషాన్ని మరచి ఇతరులకు బాగా కనిపించాలని, ఇతరుల దృష్టిలో ఏది సరైనది అయితే.. అలాగే తాము ఉండాలని అనుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఉండే భార్యలు అందరూ ట్రోఫీ భార్యలే. భర్త ఎప్పుడూ భార్యను అన్ని విషయాలలో నియంత్రణ చేస్తుంటే.. ఆ బార్య ట్రోఫీ భార్య అని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. ఏం మాట్లాడాలి? ఏం తినాలి? ఏ దుస్తులు ధరించాలి? ఇలా ప్రతి విషయంలో భర్త జోక్యం చేసుకుంటూ ఉంటారు. భార్య ఎమోషన్స్ ను ఎప్పుడూ పట్టించుకోకుండా కేవలం తనకు నచ్చినది జరగాలని భర్త డిమాండ్ చేస్తుంటే ఆ  భార్య ట్రోఫీ వైఫ్ అని అర్థమట. వివాహం అయిన తరువాత ఆడపిల్లను కేవలం తనకు భార్య  అనే కోణంలో మాత్రమే చూస్తూ ఆమెకంటూ ఎలాంటి వ్యక్తిగత జీవితం,  స్పేస్ లేకుండా చేస్తుంటారు కొందరు భర్తలు.  ఇలా తమను తాము కోల్పోయే భార్యలు అందరూ ట్రోఫీ వైప్ లు.                                 *రూపశ్రీ.
  మందులు వాడటం నేటి కాలంలో చాలా సహజం అయిపోయింది. చిన్న సమస్య నుండి, పెద్ద ఆరోగ్య సమస్య వరకు ప్రతి సమస్య తగ్గడానికి మందులు వాడుతుంటారు.  ఇందులో టాబ్లెట్లు, ఇంజెక్షన్లు  ఉంటాయి. కొందరు వైద్యుల సలహాతో మందులు వాడితే.. మరికొందరు సొంతంగా మందులు కొని అడపాదడపా వాడుతూనే ఉంటారు. అయితే మందులను ఎక్కువ కాలం వాడితే ఎవ్వరూ ఊహించనంత డేంజర్ సమస్య ఎదురవుతుందని చాలామందికి తెలియదు. ఏదైనా ఆరోగ్య సమస్య కారణంగా మందులను ఎక్కువ కాలం వాడటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు క్రమంగా తగ్గుతాయట.  ఈ లోపం శరీరం లోపల పెరుగుతూనే ఉంటుందని, దీని కారణంగా అలసట,  రోగనిరోధక శక్తి తగ్గడం, ఎముకలు బలహీన పడటం.. వంటి అనేక సమస్యలకు కారణమవుతుందట.  అసలు ఏ మందులు వాడటం వల్ల ఇలాంటి సమస్య ఎదురవుతుంది? ఎక్కువ కాలం మందులు వాడాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుంటే.. ఆస్ప్రిన్ ఆస్ప్రిన్ శరీరం విటమిన్ సి శోషణను తగ్గిస్తుంది. దీని వలన విటమిన్ సి క్రమంగా క్షీణిస్తుంది. దీర్ఘకాలిక ఆస్ప్రిన్ వాడకం వల్ల ఐరన్ నిల్వలు కూడా తగ్గుతాయి.  రోజుకు 100 mg తక్కువ మోతాదులో ఆస్ప్రిన్ తీసుకునే 65 ఏళ్లు పైబడిన వారిలో రక్తహీనత ప్రమాదం 20 శాతం పెరిగిందని ఒక అధ్యయనం తేల్చింది. టైలెనాల్, ఎసిటమైనోఫెన్ గ్లూటాతియోన్ శరీరంలోని ప్రధాన యాంటీఆక్సిడెంట్. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. టైలెనాల్ వంటి మందులు దాని స్థాయిలను తగ్గిస్తాయి, కాలేయం దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతాయి. తక్కువ గ్లూటాతియోన్ స్థాయిలు వృద్ధాప్యం, మధుమేహం, ఇన్ఫెక్షన్లు,  బలహీనమైన రోగనిరోధక పనితీరు వంటి సమస్యలకు కారణం అవుతుంది. గర్భనిరోధక మాత్రలు గర్భనిరోధక మాత్రలను నిరంతరం ఉపయోగించడం వల్ల శరీరంలో ఫోలిక్ యాసిడ్, బి2, బి6, బి12, విటమిన్ సి, విటమిన్ ఇ, మెగ్నీషియం, సెలీనియం,  జింక్ వంటి అనేక విటమిన్లు,  ఖనిజాలు క్షీణిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఈ లోపం చాలా తీవ్రంగా ఉంటుంది. చాలా మంది మహిళలు సప్లిమెంట్లను తీసుకోవలసి వస్తుంది. దీనికి గల కారణాలపై స్పష్టత లేదు.. కానీ ఈ మాత్రలలోని ఈస్ట్రోజెన్,  ప్రొజెస్టెరాన్ శరీర పోషక ప్రక్రియలను ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. మెట్‌ఫార్మిన్ మధుమేహం ఉన్నవారికి సూచించబడే మెట్‌ఫార్మిన్, పేగులో విటమిన్ బి12 శోషణను తగ్గిస్తుంది. ఎక్కువకాలం  ఉపయోగించడం వల్ల విటమిన్ బి12 లోపానికి దారితీస్తుంది. ఇది నరాల దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది. యాంటాసిడ్లు యాంటాసిడ్లు కడుపులోని ఆమ్లాన్ని తగ్గిస్తాయి. కానీ ఇదే ఆమ్లం ఆహారం నుండి విటమిన్ బి12 విడుదలకు సహాయపడుతుంది. దీర్ఘకాలిక యాంటాసిడ్ వాడకం వల్ల కాల్షియం, పొటాషియం,  జింక్ లోపాలు కూడా ఏర్పడతాయి, దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి,  కండరాల పట్టు తగ్గుతుంది. స్టాటిన్స్ స్టాటిన్ మందులు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి,  గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ అవి కండరాల శక్తి ఉత్పత్తికి అవసరమైన కోఎంజైమ్ Q10 ను  తగ్గిస్తాయి. ఈ లోపం కండరాల నొప్పి, బలహీనత,  వాపుకు కారణమవుతుంది. యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ హానికరమైన బ్యాక్టీరియాను చంపుతాయి. కానీ అవి మంచి గట్ బాక్టీరియాకు కూడా హాని చేస్తాయి. ఇది గట్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఊబకాయం, అలెర్జీలు, జీర్ణ సమస్యలు,   రోగనిరోధక శక్తి తగ్గడానికి దారితీస్తుంది. స్టెరాయిడ్స్ స్టెరాయిడ్లు శరీర ఖనిజ సమతుల్యతను అనేక విధాలుగా దెబ్బతీస్తాయి.  కాల్షియం శోషణను తగ్గిస్తాయి, ఎముకలు బలహీనపడటానికి దారితీస్తాయి,  విటమిన్ డి పనితీరును కూడా తగ్గిస్తాయి. ఇది మెగ్నీషియం,  పొటాషియం స్థాయిలను తగ్గిస్తుంది.  బలహీనత, అలసట,  తిమ్మిరికి దారితీస్తుంది. దీర్ఘకాలిక స్టెరాయిడ్ వాడకం కూడా బి విటమిన్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. నరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. జాగ్రత్త.. ఎక్కువ కాలంగా ఏవైనా మందులు వాడుతుంటే, వాటితో పాటు ఏ విటమిన్ లేదా మినరల్ సప్లిమెంట్లు తీసుకోవాలో  వైద్యుడిని లేదా డైటీషియన్‌ను అడగాలి. ఈ సాధారణ జాగ్రత్తలు అలసట, రక్తహీనత, ఎముకల నష్టం,  హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆహారమే ఆరోగ్యానికి ఔషదంగా పనిచేస్తుంది.  భారతీయ ఆయుర్వేదం చాలా వరకు ఆరోగ్య సమస్యలకు ఆహారాన్నే ఔషదంగా సూచిస్తుంది. బోలెడు రకాల వంటకాలు,  దేశ విదేశీ రుచులు ఎప్పుడు కావాలంటే అప్పుడు లభించే నేటికాలంలో ఆహారం దగ్గర కంట్రోల్ లో ఉండటం కాసింత కష్టమైన పనే.. కానీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునేవారు, డైటింగ్ చేస్తున్నవారు..  బయట ఫంక్షన్లు,  పార్టీలు,  శుభకార్యాలు,  ఫ్రెండ్స్ తో లంచ్, డిన్నర్ వంటివి చేసేవారు ఆహారం దగ్గర కంట్రోల్ ఉండలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటారు.  అలా బాధపడక్కర్లేకుండా బయట తినేటప్పుడు అతిగా తినడాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుంటే.. హెల్తీ ఫుడ్స్.. వేయించిన, క్రిస్పీ లేదా క్రీమీ వంటకాలకు బదులుగా గ్రిల్ చేసిన, బేక్ చేసిన, ఆవిరి మీద ఉడికించిన లేదా ఉడికించిన వంటకాలను ఎంచుకోవాలి. వంట చేసిన విధానం మీద ఆ వంటలో ఉండే కేలరీలు డిసైడ్ అవుతాయి. గ్రిల్ చేసిన లేదా ఆవిరి మీద ఉడికించిన ఆహారాలకు తక్కువ నూనె అవసరం అవుతుంది.  వేయించిన లేదా క్రీమీ ఆహారాలలో ఎక్కువ ఫ్యాట్  ఉంటుంది. అందుకే  రెస్టారెంట్లలో వేయించిన ఆహారాల కంటే గ్రిల్ చేసిన లేదా కాల్చిన,  స్టీమ్ చేసిన  ఆహారాన్ని ఎంచుకోవడం మేలు. డ్రింక్స్ వద్దు.. రెస్టారెంట్‌లో భోజనం చేసేటప్పుడు అతిగా తినకుండా ఉండటానికి డ్రింక్స్ కు  బదులుగా నీటిని మాత్రమే తీసుకోవాలి. బయట భోజనం చేసేటప్పుడు కూల్ డ్రింక్స్  లేదా జ్యూస్‌లు ఆర్డర్ చేయడం చాలా కామన్. కానీ ఇవి  కేలరీలు పెరగడానికి కారణం అవుతాయి. అందుకే కూల్ డ్రింక్స్, జ్యూస్ ల కంటే నీరు మాత్రమే తీసుకోవడం మేలు. హెల్తీ ఛాయిస్.. రెస్టారెంట్లలో ఫ్రైస్ లేదా చిప్స్ కు బదులుగా కూరగాయలు లేదా సలాడ్ ఎంచుకోవాలి. చాలా వంటకాలు అధిక కేలరీల కలిగిన  సైడ్ డిష్ లతో కాంబినేషన్ గా ఉంటాయి.  ఇలాంటి వాటిని హెల్తీ  ఛాయిస్ గా మార్చుకోవాలి. ప్రోటీన్ ఫుడ్..  బయటకు వెళ్లి ఆహారం తీసుకున్నా.. ఆ ఆహారం ప్రధానంగా ప్రోటీన్ ఆహారమై ఉండేలా చూసుకోవాలి. దీని కోసం చికెన్, టర్కీ లేదా చేప వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకోవచ్చు. ఈ ఆహారాలు కడుపు నింపడమే కాకుండా ఎక్కువసేపు శక్తిని,  హెల్తీ ఫ్యాట్స్ ను కూడా అందిస్తాయి. పోర్షన్.. చాలావరకు రెస్టారెంట్లలో ఆర్డర్ చేసే ఆహారం పెద్ద మొత్తంలో ఉంటుంది.  బిర్యానీ,  మండీ.. లాంటి వాటి జోలికి వెళ్లకుండా ప్లేట్ మీల్స్ టైప్ లో ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని సింపుల్ గా తక్కువగా తినడం మంచిది. ఒకవేళ పెద్ద మొత్తంలో ఆహారం ఆర్డర్ చేయాల్సి వచ్చినా సొంతంగా వడ్డించుకోకుండా ఎవరితోనైనా ఆహారాన్ని వడ్డించమనాలి. దీని వల్ల ఎక్కువ ప్లేట్ లో పెట్టుకోకుండా ఉంటారు.  ఆహారం లిమిట్ లోనే ఉంటుంది. నెమ్మది.. బయట తినేటప్పుడు నెమ్మదిగా తినడం చాలా ఇంపార్టెంట్. ఏవో పనులు ఉన్నాయనో లేదా అందరూ వేగంగా తింటున్నారనో ఆహారాన్ని సరిగా నమలకుండా వేగంగా తింటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. నిదానంగా తింటే ఆహారం కూడా ఎక్కువగా కాకుండా సరిపడినంత తినవచ్చు. ఆహారం ఎంత బాగా నమిలితే అంత బాగా కడుపు నిండిన ఫీల్ ఉంటుంది.                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
న్యూమోనియా ప్రాణాంతక శ్వాసకోశ సమస్య. ఇది ఇన్పెక్షన్ లాగా వ్యాపిస్తుంది.  దీనిగురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 12న ప్రపంచ న్యుమోనియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. న్యుమోనియా అనేది బ్యాక్టీరియా, వైరస్‌లు లేదా శిలీంధ్రాల వల్ల కలిగే తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్పెక్షన్.  ఊపిరితిత్తులలోని అల్వియోలీ అనే చిన్న గాలి సంచులు వాపుకు గురై చీము లేదా ద్రవంతో నిండిపోవడానికి ఇది  కారణమవుతుంది. ఈ ద్రవం ఆక్సిజన్ ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల  శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే ఇది ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు లేదా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువ. అయితే న్యుమోనియాను కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. చలి, వణుకు.. న్యుమోనియా  ముఖ్య లక్షణం తీవ్రమైన చలి,  వణుకుతో కూడిన అధిక జ్వరం. సాధారణ జ్వరంతో చలి రావడం సహజం. కానీ న్యుమోనియాలో వణుకు చాలా తీవ్రంగా ఉంటుంది. ఎన్ని దుప్పట్లు కప్పినా ఈ సమస్య ఉన్నవారికి వణుకు తగ్గదు. ఇలా వణుకు తగ్గకపోవడం.. శరీరం ఇన్ఫెక్షన్‌తో వేగంగా పోరాడటానికి ప్రయత్నిస్తుందనడానికి సంకేతమని వైద్యులు అంటున్నారు. దీని వలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఛాతీ నొప్పి, శ్లేష్మంతో కూడిన దగ్గు.. న్యుమోనియా కేవలం పొడి దగ్గు మాత్రమే కాదు, తరచుగా శ్లేష్మంతో కూడి ఉంటుంది. శ్లేష్మం పసుపు, ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రక్తంతో కూడిన గోధుమ రంగులో ఉండే అవకాశం ఉంటుంది.  అంతేకాకుండా రోగులు శ్వాస తీసుకునేటప్పుడు లేదా దగ్గుతున్నప్పుడు  ఛాతీ నొప్పి ఎక్కువగా అనుభవిస్తారు. ఈ నొప్పి ఊపిరితిత్తుల వాపు వల్ల వస్తుంది. శ్వాస సమస్యలు.. న్యుమోనియా ఊపిరితిత్తులలోని గాలి సంచులు నిండిపోయి శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. రోగులు తగినంతగా శ్వాస తీసుకోలేకపోతున్నట్లు ఇబ్బంది పడతారు . శ్వాస వేగంగా మారుతుంది. చిన్న పిల్లలలో శ్వాస తీసుకునేటప్పుడు వారి ముక్కు రంధ్రాలు మంటగా ఉండటం లేదా వారి  ఛాతీ లోపలికి కుచించుకుపోయినట్టు ఉంటుంది. ఇది సమస్య చాలా ఎక్కువ ఉందనడానికి సంకేతం. అలసట, గందరగోళం, పెదవుల రంగు.. న్యుమోనియాతో బాధపడుతున్న వ్యక్తి తీవ్ర అలసట,  బలహీనతకు లోనవుతారు. వృద్ధులలో ఈ ఇన్ఫెక్షన్ మానసిక గందరగోళానికి లేదా అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడానికి కారణమవుతుంది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల పెదవులు,  గోళ్లు నీలం రంగులోకి మారవచ్చు. ఈ లక్షణాలన్నీ తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ను సూచిస్తాయి.                            *రూపశ్రీ.