ఎనిమిది పదుల వయస్సులో రైతు రోశయ్య విజయగాధ స్ఫూర్తిదాయకం.. చంద్రబాబు

Publish Date:Mar 13, 2026

Advertisement

ప్రకృతి సేద్యాన్ని అనుసరిస్తూ ఆదర్శంగా నిలిచిన రైతు రోశయ్యను  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించకుండా ప్రకృతి పద్ధతుల్లో పంటలు పండిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారని   అభినందించారు. ప్రకృతి సేద్యం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు  ఖర్చులు కూడా తగ్గుతాయన్న సీఎం  చంద్రబాబు.. రైతు రోశయ్య  వ్యవసాయ పద్ధతులను  ఇతర రైతులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. 

రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందనీ,    రసాయనాల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతుల్లో సాగు చేస్తే పంటల నాణ్యత మెరుగుపడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందనీ అన్నారు.  ప్రకృతి సేద్యంలో మంచి ఫలితాలు సాధిస్తున్న రైతులను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తుందన్న సీఎం చంద్రబాబు  రోశయ్య లాంటి రైతులు  మరింత మంది ముందుకు వచ్చి ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని  ఆకాంక్షించారు.

భూమిని తల్లిలా భావించి...ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, అత్తోట గ్రామానికి చెందిన   ఎనభై ఏళ్ల రోశయ్య.. తనకున్న   75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ, నెలకు రూ.20 వేలకు పైగా ఆర్జిస్తున్నారనీ, ఆయన విజయగాధ స్ఫూర్తిదాయకమన్నారు. 2016లో ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నాడు తీసుకున్న చర్యలతో ప్రేరణ పొంది ప్రకృతి సాగు మొదలు పెట్టిన రోశయ్య  సాధిస్తున్న విజయాలు ఆదర్శం. ఆయనకు అభినందనలని చంద్రబాబు పేర్కొన్నారు. 

By
en-us Political News

  
ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం, 2027, 2028 ఆర్థిక సంవత్సరాలకు గాను భారతదేశ జీడీపీ 6.5 శాతం స్థాయిలో నమోదు కానుంది. ప్రపంచంలోని ఇతర దిగ్గజ దేశాలతో పోలిస్తే ఇది అధికం. ముఖ్యంగా చైనా 4.4 శాతం వృద్ధికే పరిమితం అవుతుందని, అగ్రరాజ్యం అమెరికా సైతం 2.3 శాతం వృద్ధికి మాత్రమే పరిమితమౌతుందని ఐఎంఎఫ్ నివేదిక అంచనా వేసింది.
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్‌ ఖేరాకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
ప్రపంచ చమురు రవాణాలో 20శాతం కంటే ఎక్కువ భాగం హర్మూజ్ జలసంధి గుండానే జరుగుతుంది. అయితే ఇరాన్, ఆ తరువాత అమెరికా అమెరికా నావికాదళ దిగ్బంధన ఆదేశాల కారణంగా గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత నెలకొంది. అయితే ఈ పరిస్థితులలో కూడా భారత్ వృద్ధి అంచనాను ఐఎమ్ఎఫ్ పెంచడం సానుకూల సంకేతమనే చెప్పాలి.
ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లు ఆడింది. అయితే ఒక్క మ్యాచ్ లో కూడా విజయం సాధించలేదు. నాలుగు మ్యాచ్ లలో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒక మ్యాచ్ వర్షార్పణమైంది. దీంతో పాయింట్ల పట్టికలో అడుగు నుంచి తొలి స్థానంలో నిలిచింది.
ఎండీ జాకీర్ ఉస్మాన్, బషీర్‌బాగ్‌కు చెందిన జువెలర్ సుఖేష్ గుప్తా కలిసి నిజాం కాలం నాటి విలువైన ఆభరణాల్లో వాటా ఇస్తామని చెప్పి తన నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని అగర్వాల్ ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
చిన్న వయస్సులోనే కాలేయ సమస్యల బారిన పడటం వల్ల వారి ఉత్పాదకత దెబ్బతినడమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. అయితే కాలేయ వ్యాధులు ప్రారంభంలోనే గుర్తిస్తే 90 శాతం వరకు తిరిగి నయం చేసుకునే అవకాశం ఉంది. దీనికి ఖరీదైన మందుల కంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలే ప్రధానమైన పరిష్కారం.
1990 నుంచి 2023 వరకు దేశంలో ఫ్యాటీ లివర్ వ్యాధి విస్తరణలో 23% పెరుగుదల ఉంది. అధ్యయనాల ప్రకారం, భారతదేశంలో ఫ్యాటీ లివర్ కేసులు 23% కంటే ఎక్కువగా పెరిగాయి. నగర ప్రాంతాల్లో ఇది 9 నుంచి 32 శాతం పెరుగుదల ఉండగా, రాష్ట్రాల్లో అయితే ఏకంగా 60శాతం వరకూ చేరినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ నెల 19 నుండి వచ్చే నెల 31 వరకు ఎండల తీవ్రత విపరీతంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
గమ్యానికి చేరుకోవడానికి కేవలం ఇరవై నిమిషాల దూరంలో ఉన్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం రెండు ప్రాణాలను బలితీసుకుంది. అదే కుటుంబానికి చెందిన ముగ్గురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
Publish Date:Apr 14, 2026
ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
తమ డిమాండ్ల పరిష్కారం కోసం వచ్చేనెల 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించింది. ఆ లోగా తమ సమస్యలు పరిష్కరించాలనీ లేకుంటే థియేటర్ల మూత తప్పదని స్పష్టం చేసింది.
జగిత్యాల ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
భాగ్యనగర వాసుల జీవనాడి, అత్యంత వేగవంతమైన ప్రయాణానికి వేదికైన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై మరోసారి నిబంధనలు తుంగలో తొక్కారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.