షరపోవా ఆట ముగిసినట్లేనా!

Publish Date:Mar 8, 2016

Advertisement

 

టెన్నిస్‌ పట్ల ఆసక్తి ఉన్నా లేకున్నా, ప్రపంచంలో చాలామందికి షరపోవా అంటే ఎవరో తప్పకుండా తెలిసి తీరుతుంది. 17 ఏళ్ల  వయసులోనే వింబుల్డన్‌ను సాధించిననాటి నుంచి... ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో సెరీనా విలియమ్స్‌తో హోరాహోరీ పోరు సాగించిన రోజు వరకూ షరపోవా ఆటను ప్రతి టెన్నిస్‌ అభిమానీ ఆస్వాదిస్తూనే ఉన్నాడు. దశాబ్దకాలంపాటు టెన్నిస్‌లో అప్రతిహతంగా కొనసాగుతూ 35 గ్రాండ్ స్లామ్‌ టైటిల్స్ (సింగిల్స్)ను గెలుచుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే షరపోవా అందం అన్నా, ఆ అందాన్ని మించిన ఆట అన్నా అభిమానులు పడిచస్తారు. అలాంటి వ్యక్తి నిషేధిత ఉత్ప్రేకరాన్ని వాడి పట్టుబడిందనీ, ఈ ఏడాది జరగబోయే ఒలంపిక్స్ నుంచి దూరం కానుందనీ తెలియడంతో క్రీడా ప్రపంచం నివ్వెరపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా గాయాలతో బాధపడుతూ ఊగిసలాడుతున్న షరపోవా కెరీర్‌ ఈ దెబ్బతో తిరిగి పుంజుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది.


షరపోవా ‘మెల్‌డోనియం’ అనే నిషేధిత ఉత్ప్రేరకాన్ని తీసుకుందన్నది అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య ఆరోపణ. ఇప్పటికే షరపోవా నుంచి సేకరించిన రక్తనమూనాలో ఈ మందు ఉంది కాబట్టి, ఇందులో నిర్దోషినని షరపోవా చెప్పుకునేందుకు ఏమీ మిగలదు. కాబట్టి ఆట నుంచి నిషేధం ఎలాగూ ఖాయం. ఇక తాను తెలియక ఈ ఉత్ప్రేకరాన్ని వాడానని షరపోవా చెబుతున్న వాదనలో కూడా పస కనిపించడం లేదని క్రీడాపండితులు అంటున్నారు. తన గుండె పనితీరు సరిగా లేకపోవడం, కుటుంబనేపథ్యంలో డయాబెటీస్ ఉండటంతో దానికి విరుగుడుగా మెల్డోనియంను తీసుకున్నట్లు షరపోవా చెబుతోంది. కానీ మెల్‌డోనియం రక్తప్రసరణను మెరుగుపరిచే మాట వాస్తవమే అయినా..... ఆటగాళ్లు మరింత చురుకుగా ఆడేందుకు ఈ మెల్‌డోనియంను తీసుకుంటారన్నది బహిరంగ రహస్యం.

 

పదేళ్లుగా తాను ఈ మందుని వాడుతున్నాననీ, ఈ ఏడాది మొదట్లోనే దీనిని ఉత్ప్రేరకాల జాబితాలో చేర్చారని షరపోవా అంటున్న మాట వాస్తవమే! కానీ టెన్నిస్‌ సమాఖ్య తాజా జాబితాను తన వెబ్‌సైట్లో ఉంచుతుంది. తనకి అనుబంధంగా ఉన్న దేశాల టెన్నిస్‌ సమాఖ్యలన్నింటికీ జాబితాకు సంబంధించిన సమాచారాన్ని అందచేస్తుంది. పైగా మెల్‌డోనియం అమాయకమైన మందేమీ కాదు. అమెరికాలో ఇప్పటికీ ఈ మందుని అమ్మడం చట్టవ్యతిరేకం. ఇక తూర్పు ఐరోపాలోని చాలా దేశాలలో ఈ మందుని ఒక ఉత్ప్రేరకంగానే ఎక్కువగా వాడుతుంటారు.నాలుగేళ్ల వయసులోనే టెన్నిస్‌ రాకెట్‌ను పట్టుకుని తనకిష్టమైన ఆటలో ఓ చరిత్ర సృష్టించిన షరపోవా, అదే ఆట నుంచి అవమానకరంగా దూరం కావడం బాధించే విషయమే. అందుకే ఎంతో పరిణతితో కనిపించే ఈ క్రీడాకారిణి, తన నిషేధం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కన్నీటి పర్యంతం అయింది. ఒక పక్క ఆట నుంచి ఆమె ఎలాగూ కొంత దూరం కానుంది.

 

ఇక ఆర్థికంగా కూడా షరపోవాకి ఇది కోలుకోలేది దెబ్బ. అత్యంత ధనికురాలైన క్రీడాకారిణిగా ఉన్న షరపోవా ఇప్పడు ఒక్కొక్కటిగా తన వ్యాపార ఒప్పందాలను కోల్పోయే పరిస్థితిలో ఉంది. షరపోవా గురించి క్రీడాలోకం కరకాలుగా స్పందించింది. నిషేధిత జాబితా గురించి తనకేమీ తెలియదని షరపోవా చెప్పడం అతితెలివి అని కొందరంటే, షరపోవా తెలియకుండా ఓ ఉచ్చులో బిగుసుకుపోయిందని మరికొందరు జాలిపడుతున్నారు. ఎవరు ఏమన్నా, ఎలా అనుకున్నా ఒకటి మాత్రం నిజం! టెన్నిస్‌ నుంచి షరపోవా కనీసం మరో ఏడాది కాలం దూరం కానుంది. మరి ఆ తరువాత తిరగి ప్రపంచస్థాయి ఆటతీరుని ప్రదర్శిస్తుందా! మరో సంచలనానికి దారి తీస్తుందా! అలా జరుగుతుందనే ఆశిద్దాము! మరోవైపు షరపోవా ఉదంతం ఇతర క్రీడాకారులకు ఓ గుణపాఠంగా నిలవాలని కోరుకుందాము!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.