నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Publish Date:Mar 16, 2026

Advertisement

తెలంగాణ గడ్డపై సాహిత్య పరిమళాలు మరోసారి దేశవ్యాప్తంగా గుబాళించాయి. ప్రముఖ కవి  నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచించిన  అనిమేష అనే కవితా సంపుటికి  కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది.  దేశ వ్యాప్తంగా  మొత్తం 24 భారతీయ భాషల్లో ఎంపిక చేసిన ఉత్తమ రచనలలో తెలుగు విభాగంలో నందిని సిధారెడ్డికి ఈ అవార్డు లభించింది.   తెలంగాణ ఉద్యమ సమయంలో  ప్రజలను ఉత్తేజపరిచే రచనలు చేసిన నందిని సిధారెడ్డి, ఈసారి సామాజిక సంక్షోభాన్ని ఇతివృత్తంగా ఎంచుకున్నారు.  అనిమేష కవితా సంపుటి ప్రధానంగా కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలాన్ని, ఆ సమయంలో సామాన్యుడు అనుభవించిన నరకయాతనను ప్రతిబింబిస్తుంది. లాక్‌డౌన్ నాటి ఏకాంతం, మరణభయం, విడిపోయిన బంధాలను ఆయన తన కవిత్వంలో హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించారు.

నందిని సిధారెడ్డి ప్రస్థానం  కవిత్వానికీ, సాహిత్యానికే పరిమితం కాలేదు. తెలంగాణ ఆవిర్భావం తరువాత  ఆయన తెలంగాణ సాహిత్య అకాడమీకి తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోని సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. సిధారెడ్డి గీతాలు గతంలో అనేక ప్రజాపోరాటాలకు ఊపిరిపోశాయి.

ప్రస్తుతం ఆయనకు దక్కిన ఈ గౌరవంపై తెలుగు సాహితీ ప్రపంచం హర్షం వ్యక్తం చేస్తోంది. కరోనా వంటి విపత్కర పరిస్థితులను  మానవీయ కోణంలో అక్షరీకరించడం వల్లే ఈ అవార్డు దక్కింది. సిధారెడ్డి సరళతరమైన శైలి, మనసును హత్తుకునే భావ వ్యక్తీకరణ ఆయనను పాఠకులకు, ప్రజలకు చేరువ చేశాయి. సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు, కవులు, రచయతలు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు. 

By
en-us Political News

  
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
తండ్రి కొడుకులను లాకప్‌లో చంపిన కేసులో అసలేం జరిగింది?
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడుకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జలమే సంపద... దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.
దేశ రాజధానిలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం సంచలన ఘటన చోటుచేసుకుంది.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.