మనుషుల్నిపిట్లల్లా కాల్చేశారు.. పీవోకేలో 19 మంది మృతి.!

Publish Date:Jul 28, 2026

Advertisement

 పీఓకే లో హింస  పతాకస్థాయికి చేరింది. రావలకోట్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వం,  స్థానిక పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై పాకిస్తాన్ రేంజర్స్   విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 19 మంది మృత్యువాత పడ్డారు. ఈ దారుణ ఘటనతో పీఓకే సరిహద్దు ప్రాంతాల్లో  ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి.

గత కొంతకాలంగా పీవోకేలో  నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల,  అదనపు పన్నుల భారం, విద్యుత్ బిల్లుల బలవంతపు వసూళ్లు, ప్రాథమిక మానవ హక్కుల నిరాకరణపై స్థానికులు  ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో వేలాది మంది  వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.  ఈ   ప్రదర్శనలను అణచివేసేందుకు పాకిస్తాన్ భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. 

రావలకోట్‌లోని ప్రధాన మార్గాల్లో నిరసనలు తెలుపుతున్న ప్రజా సమూహంపైకి పాకిస్తాన్ రేంజర్స్ విరుచుకుపడ్డాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తొలుత భాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు, ఆపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే  కాల్పులకు తెగబడ్డారు.  భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 19 మంది అక్కడికక్కడే మరణించగా, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాల ద్వారా తెలుస్తోంది.  క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడాన్ని కూడా భద్రతా బలగాలు అడ్డుకున్నట్లు చెబుతున్నారు.  

  పాకిస్తాన్  ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో దాని ప్రభావం పీఓకే ప్రాంతవాసులపై తీవ్రంగా పడింది. తమ ప్రాంత సహజ వనరులను ఇస్లామాబాద్ కేంద్ర ప్రభుత్వం   దోచుకుంటూ, తమకు కనీస మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం లేదని స్థానికులు  నిరసిస్తున్నారు. ఈ పౌర ఆందోళనలను కప్పిపుచ్చేందుకు, పీవోకే ఆందోళనలకు సంబంధించిన వార్తలు బయటకు పొక్కకుండా ఉండేందుకు  పాకిస్తాన్ ప్రభుత్వం ఇంటర్నెట్, టెలికాం సేవలపై కూడా  ఆంక్షలు విధించింది.

పాక్ ఆర్మీ,  రేంజర్స్ పీవోకేలో  సాగిస్తున్న అణచివేత చర్యలు, దమనకాండ, మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ వేదికలపై విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ.. పాకిస్థాన్ ప్రభుత్వం ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. ఇస్లామాబాద్ యంత్రాంగం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.  

ప్రస్తుతం రావలకోట్  పరిసర ప్రాంతాల్లో కర్ఫ్యూ వంటి నిశ్శబ్ద వాతావరణం అలముకుంది. వీధుల్లో భారీ సంఖ్యలో సైనిక వాహనాలు గస్తీ తిరుగుతుండటంతో,   ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థి.    అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, ఐక్యరాజ్యసమితి పీఓకేలో జరుగుతున్న అరాచకాలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని స్థానిక ప్రజాసంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.  

PoK Firing,  Rawalkot Violence , Pakistan Rangers Action, PoK Protests  

By
en-us Political News

  
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావారనికి తోడు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండ దెబ్బతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షాలు పెద్ద ఉపశమనాన్ని అందించినప్పటికీ.. భారీ వర్షాల హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది.
ఇంత కాలంగా ప్రభుత్వ శాఖలలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు అదనపు బాధ్యతలు స్వీకరించినప్పుడు లేదా వేర్వేరు ప్రాజెక్టుల ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రతి పదవికి ఒక వాహనం చొప్పున బహుళ వాహనాలను ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 2022 నాటి పాత మార్గదర్శకాలకు అనుబంధంగా తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ఆర్థిక శాఖ వ్యయ విభాగం అటువంటి సదుపాయాలకు చెక్ పెట్టాయి.
హక్కుల హననానికి తోడు పీవోకేలో గళమెత్తుతున్న ప్రజలపై పాక్ బలగాలు పాశవిక అణచివేతకు పాల్పడుతున్నారు. గత రెండు రోజులుగా రావల్‌కోట్, మీర్పూర్ ప్రాంతాల్లో పాక్ బలగాలు జరిపిన దాడులు, కాల్పుల్లో 40 మంది పౌరులు తమ ప్రాణాలను కోల్పోయారు. పీవోకేలో జనం ప్రాథమిక హక్కులు, న్యాయమైన డిమాండ్ల కోసం చేపట్టిన శాంతియుత నిరసనలపై పాక్ సైన్యం యుద్ధం ప్రకటించింది.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి వద్ద ఉన్న ఈ సహజసిద్ధ జలపాతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పరవళ్లు తొక్కుతోంది
మద్యం విధానం పేరుతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవకతవకలు, అక్రమాలపై సమగ్ర విచారణ జరుపుతున్న విచారణాధికారులు, ఈ కేసులో మాజీ మంత్రి పాత్రపై కీలక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో అరెస్టు ముప్పు నుంచి తప్పించుకునేందుకు, ఆయన సుప్రీం కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ తాను పీఓకేలో నిరసనలు చేస్తున్న వారిని భారత్‌తో సమానమైన వర్గంలో చేరుస్తున్నానని పేర్కొన్నారు. వారిని కూడా భారతదేశం లాంటి శత్రువులుగానే పరిగణిస్తున్నాననీ, అందుకే ఆ ఆందోళనకారులతో చర్చిందేదే లేదనీ, వారు పాకిస్థాన్ శత్రువులని చెప్పారు.
మూడు దశాబ్దాల భవిష్యత్ ను ముందుగానే చూడగల విజనరీ అయిన చంద్రబాబు నాయుడు 1997లో ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయ ఆవశ్యకతను గుర్తించారు. ఆ దిశగా అడుగులు వేశారు. ఇక హుద్‌హుద్ తుఫాను అనంతరం.. సురక్షిత, ఆధునిక విమానాశ్రయం ప్రతిపాదనను ఆయన మరింత గట్టిగా ముందుకు తీసుకువెళ్లారు. ఓ వైపు సముద్ర తీరం, మరొకవైపు మన్యప్రాంతాల నడుమ వ్యూహాత్మక ప్రదేశంగా భోగాపురాన్ని అయిన ఎంపిక చేశారు.
మొదట చర్చల సందర్భంగా, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై కొత్త ఎఫ్ఐఆర్ లు నమోదు చేయబోమని, ఇప్పటికే నమోదైన పాత కేసులను కూడా పూర్తిగా ఉపసంహరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు.. వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందంటూ ఆ హామీ అమలుపై వెనక్కు తగ్గిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిసిర్ బేస్రాపై ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పోలీసులపై దాడులు, నరమేధాలు, ఐఈడీ పేలుళ్లు, వసూళ్లు సహా ఏకంగా 150కి పైగా కేసులు నమోదయ్యాయి. 2007లో ఖుంటీ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసినప్పటికీ, 2009లో బిహార్‌లోని లఖిసరాయ్ కోర్టు సముదాయంపై మావోయిస్టులు దాడి చేసి అతడిని విడిపించుకుపోయారు. ఆ సంఘటన తర్వాత దాదాపు రెండు దశాబ్దాల అజ్ఞాతంలోనే ఉన్నారు.
వర్షాల తీవ్రత వల్ల పలు జిల్లాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కామరూప్, ధుబ్రి, లఖింపూర్, దిబ్రూగఢ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
ఇన్ స్పెక్టర్, బాధిత మహిళ కొంత కాలం పాటు సహజీవనం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. అనంతరం ఈ పరిణా మాల నేపథ్యంలో బాధిత మహిళ ఫిర్యాదుపై ఉన్నతాధి కారులు చేపట్టిన విచారణలో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తేలడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆయనను సస్పెండ్ చేస్తూ హైదరా బాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో రహదారులు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు రెండు గంటల వ్యవధిలోనే నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ సైబర్ ముఠాల దందాను అరికట్టడానికి సాధారణ చట్టాలు సరిపోవనీ, అందుకే ఇకపై డిజిటల్ అరెస్టు మోసాలను పాతకాలపు ఐటీ చట్టాల కింద కాకుండా, వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద నమోదు చేసి, దర్యాప్తు జరపాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.