పంద్రాగస్టున కొత్త రేషన్ కార్డుల పంపిణీ.!

Publish Date:Aug 6, 2026

Advertisement

 తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏళ్ల తరబడి కొత్త రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది అర్హులైన లబ్ధిదారులకు పంద్రాగస్టున   నూతన రేషన్ కార్డుల పంపిణీ  చేయనుంది.  పౌర సరఫరాల శాఖ ద్వారా సామాన్య ప్రజలకు సంపూర్ణ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి  ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.  

 షన్ కార్డుల పంపిణీ  కార్యక్రమాన్ని  సంగారెడ్డి  వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   ప్రారంభిం చనున్నారు.   ఆగస్టు 15న  తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ  కొనసాగనుంది. నూతన రేషన్ కార్డుల రూపకల్పనలో ప్రభుత్వం   మార్పులను తీసుకొచ్చింది. గతంలో ఉన్న పాత కాగితపు కార్డుల స్థానంలో లామినేషన్‌తో,  డెబిట్ కార్డు సైజులోనే ఈ నూతన కార్డులను రూపొందించారు.  

పాత కార్డులపై కుటుంబ సభ్యుల పేర్లు,   వివరాలు,   చిరునామా,  సభ్యుల ఫొటోలు కనిపించేవి. అయితే ఇప్పుడు పంపిణీ చేయనున్న  ఈ స్మార్ట్ రేషన్ కార్డులపై కుటుంబ సభ్యుల ఫొటోలు , పేర్లు ఉండవు. దానికి బదులుగా ప్రతి కార్డుపై ఒక ప్రత్యేకమైన విశిష్ట సంఖ్య,  క్విక్ స్కానింగ్ కోసం ఒక బార్‌కోడ్‌ను మాత్రమే ఉంటుంది. ఈ అధునాతన బార్‌కోడ్ ద్వారా రేషన్ దుకాణాల్లో లేదా అధికారుల వద్ద డిజిటల్ స్కేనర్ సహాయంతో బార్‌కోడ్‌ను స్కాన్ చేయగానే, లబ్ధిదారుల కుటుంబానికి చెందిన సంపూర్ణ వివరాలు, సభ్యుల పేర్లు, ఆధార్ సీడింగ్ సమాచారం ఆన్‌లైన్ డేటాబేస్ ద్వారా  డిస్ప్లే అవుతాయి.

ఈ వినూత్న బార్‌కోడ్ విధానం ద్వారా సమాచార దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు రేషన్ సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.  నకిలీ కార్డుల నిరోధానికి,  అర్హులైన ప్రతి ఒక్కరికీ సక్రమంగా రేషన్ సరుకులు అందేలా చూడటానికి ఈ డిజిటల్ డిజైన్   దోహదపడు తుందంటున్నారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాలను పారదర్శకంగా సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేసి తుది జాబితాను ఆమోదించి, ఆగస్టు 15 నాటికి పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. 

 new ration cards in Telangana, Revanth Reddy ration card distribution, August 15 ration cards, Barcode ration card,  Debit Card Size 

By
en-us Political News

  
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు శనివారం నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు.
సామాజిక మాధ్యమాలు, డేటింగ్ యాప్‌ల వేదికగా అమాయకులకు వలవేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సంచలన హనీట్రాప్ ముఠా గుట్టు
మియాపూర్ జీఎస్ఎమ్ మాల్ వద్ద ఘోర ప్రమాదం..!
ప్రపంచ ఫుట్‌బాల్ రంగాన్ని శాసించిన మహా దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ జీవితంలో తీరని శోకం అలముకుంది.
క్యాబ్ డ్రైవర్ నుంచి కార్పొరేట్ లీడర్‌గా స్ఫూర్తిదాయక ప్రయాణం..!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది.
తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడున్నర సంవత్సరాలు అయిందని, ఇప్పటికీ తాను న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టను న్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
2015లోనే అప్పటి పాక్ జలవనరులు, విద్యుత్ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ జాతీయ స్థాయిలో నీరు, గ్యాస్, విద్యుత్ విచ్చలవిడిగా దుబారా చేసే అలవాటు వల్లే దేశంలో తీవ్ర కొరత ఏర్పడిందని బాహాటంగా చెప్పారు. నీటి సమస్యలు పూర్తిగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని, దానికి బయటి దేశాలను బాధ్యులను చేయలేమని అన్నారు. నాటి మంత్రి వ్యాఖ్యలకు, నేటి పాక్ పాలకులు భారత్‌పై చేస్తున్న ఆరోపణలకు పొంతనే లేకపోవడం గమనార్హం.
ఒంటరిగా ఫీలవుతున్నారా? మీతో కాఫీ తాగేందుకు, సినిమాకు వెళ్లేందుకు అందమైన అబ్బాయి కావాలా? అదీ 50 శాతం డిస్కౌంట్‌తో!
మరొకవైపు, రెండు ప్రధాన టన్నెళ్ల పరిధిలో చేపడుతున్న కాంక్రీట్ సీసీ లైనింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా ఐదు గ్యాంట్రీ యంత్రాల....
సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ చెల్లింపులపై ఇటీవల నెట్టింట ఊపందుకున్న ఛార్జీల ప్రచారానికి ప్రముఖ డిజిటల్ వ్యాపార దిగ్గజం ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ తెరదించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.