లాల్ దర్వాజా బోనాలవేళ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..!

Publish Date:Aug 8, 2026

Advertisement

 

బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టను న్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. లాల్ దర్వాజా, దర్బార్ మైసమ్మ–కార్వాన్, అంబర్‌పేట్ మహంకాళి ఆలయం, చిలకలగూడ కట్ట మైసమ్మ–పోచమ్మ ఆలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 9, 10 తేదీల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఆగస్టు 9న ఉదయం 6 గంటల నుంచి, ఆగస్టు 10న ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపులు ముగిసే వరకు పాత బస్తీలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. ఇంజిన్ బౌలి, ఆలియాబాద్, లాల్ దర్వాజా, గౌలీపురా, ఛత్రినాక, చార్మినార్, మొఘల్‌పురా, హరిబౌలి తదితర ప్రాంతాల్లో వాహనాలను ప్రత్యా మ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తారు.

మదీనా ఎక్స్ రోడ్స్ నుంచి ఇంజిన్ బౌలి వరకు ప్రధాన రహదారిని బోనాల ఊరేగింపు పూర్తయ్యే వరకు పూర్తిగా మూసివేయనున్నారు. చార్మినార్, ఫలక్‌నుమా, నయాపూల్ వైపు TG, APSRTC బస్సులను అనుమతించకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపనున్నారు. భక్తుల వాహనాల కోసం శాలిబండ, అల్కా థియేటర్, ఆర్యవైశ్య మందిరం, VDP స్కూల్ మైదానం, మిత్రా స్పోర్ట్స్ క్లబ్, చార్మినార్ బస్ టెర్మినల్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. దర్బార్ మైసమ్మ బోనాలు, ఏనుగు ఊరేగింపు నేపథ్యంలో ఆగస్టు 8 రాత్రి 9 గంటల నుంచి ఆగస్టు 10 ఉదయం వరకు కార్వాన్, పురానాపూల్, టప్పాచబుత్రా, జియాగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. 

పురానాపూల్, టప్పాచబుత్రా, యాదవ్ భవన్, మొఘల్ కా నాలా వైపు నుంచి ఆలయం దిశగా వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తారు. కార్వాన్‌లో ప్రభుత్వ పాఠశాల మైదానం, తోలి మసీదు సమీపంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం, జగత్ సింగ్ ప్రైవేట్ స్థలంలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అంబర్‌పేట్ మహంకాళి ఆలయంలో బోనాల నేపథ్యంలో ఆగస్టు 9 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 10 మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయి. ఉప్పల్–చాదర్‌ఘాట్, MGBS మార్గాల్లో భారీ వాహనాలు, బస్సులను అంబర్‌పేట్ ఫ్లైఓవర్ మీదుగా నడిపించనున్నారు.

ఆలయానికి వచ్చే భక్తులు అంబర్‌పేట్ GHMC మైదానంలో వాహనాలను పార్క్ చేయాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లించనున్నారు. చిలకల గూడ శ్రీ కట్ట మైసమ్మ–పోచమ్మ ఆలయం వద్ద ఆగస్టు 9, 10 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. సీతాఫల్‌మండి, చిలకలగూడ, అల్లుగడ్డ బావి, సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులు, వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అత్యవసర ట్రాఫిక్ సహాయం కోసం 9010203626 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. తాజా ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాలని సూచించారు.

Lal Darwaza Bonalu, old city, Medina X Roads, Sitaphalmandi, Chilakalguda, Allugadda well, CP Sajjanar,  DGP C.V. Anand, CM Revanth reddy

By
en-us Political News

  
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు శనివారం నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు.
సామాజిక మాధ్యమాలు, డేటింగ్ యాప్‌ల వేదికగా అమాయకులకు వలవేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సంచలన హనీట్రాప్ ముఠా గుట్టు
మియాపూర్ జీఎస్ఎమ్ మాల్ వద్ద ఘోర ప్రమాదం..!
ప్రపంచ ఫుట్‌బాల్ రంగాన్ని శాసించిన మహా దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ జీవితంలో తీరని శోకం అలముకుంది.
క్యాబ్ డ్రైవర్ నుంచి కార్పొరేట్ లీడర్‌గా స్ఫూర్తిదాయక ప్రయాణం..!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది.
తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడున్నర సంవత్సరాలు అయిందని, ఇప్పటికీ తాను న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
2015లోనే అప్పటి పాక్ జలవనరులు, విద్యుత్ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ జాతీయ స్థాయిలో నీరు, గ్యాస్, విద్యుత్ విచ్చలవిడిగా దుబారా చేసే అలవాటు వల్లే దేశంలో తీవ్ర కొరత ఏర్పడిందని బాహాటంగా చెప్పారు. నీటి సమస్యలు పూర్తిగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని, దానికి బయటి దేశాలను బాధ్యులను చేయలేమని అన్నారు. నాటి మంత్రి వ్యాఖ్యలకు, నేటి పాక్ పాలకులు భారత్‌పై చేస్తున్న ఆరోపణలకు పొంతనే లేకపోవడం గమనార్హం.
ఒంటరిగా ఫీలవుతున్నారా? మీతో కాఫీ తాగేందుకు, సినిమాకు వెళ్లేందుకు అందమైన అబ్బాయి కావాలా? అదీ 50 శాతం డిస్కౌంట్‌తో!
మరొకవైపు, రెండు ప్రధాన టన్నెళ్ల పరిధిలో చేపడుతున్న కాంక్రీట్ సీసీ లైనింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా ఐదు గ్యాంట్రీ యంత్రాల....
సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ చెల్లింపులపై ఇటీవల నెట్టింట ఊపందుకున్న ఛార్జీల ప్రచారానికి ప్రముఖ డిజిటల్ వ్యాపార దిగ్గజం ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ తెరదించారు
నోరు పారేసుకుంటే ఇళ్లకు వచ్చి కొడతాం....!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.