కమల దళంలో.. కుమ్ములాటలు.. క్యాడర్ బజార్ !!

Publish Date:Jul 21, 2025

Advertisement

 

భారతీయ జనతా పార్టీ  (బీజేపీ) లో ఏమి జరుగుతోంది ? రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ బీజేపీలో ఏదో జరుగుతోంది,అనేది ఇప్పడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సంస్థాగత వ్యవహరాల్లో పార్టీకి, పార్టీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్)కు మధ్య ఒక పెద్ద అగాధమే ఏర్పడిందనేది, ప్రముఖగ్మ వినవస్తోంది. 

సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి, బీజేపీ, ఆర్ఎస్ఎస్’ అధినాయకుల మధ్య విభేదాల  కారణంగానే, పార్టీ జాతీయ అధ్యక్షుని ఎంపిక ఎంతకీ ముడి పడడం లేదని ఇటు బీజేపీ ముఖ్యనాయకులు, సంఘ్ పరివార్ సంస్థల కీలక నేతలు, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంగీకరిస్తున్నారు. అదలా ఉంటే, మరో వంక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ముఖ్య నేతల మధ్య ఎంతో కాలంగా ఎంతో కొంత గుంభనంగా సాగుతున్న అంతర్గత కుమ్ములాటలు, విభేదాలు ఇప్పడు బహిరంగంగా బయటకు తన్ను కొచ్చాయి. 

పతాక స్థాయికి చేరాయి. ముఖ్యంగా, కేంద్ర మంత్రి బండి సంజయ్,మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం,పార్టీని ఒక కుదుపు కుదిపింది. దీంతో, పార్టీ అధ్యక్షునిగా రామచంద్ర రావు ఎంపిక విషయంలో తలెత్తిన విభేదాలు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా వంటి సంఘటనలతో,  అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితిని మరింతగా దిగజారుస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 
నిజానికి, రాజకీయ పార్టీలలో అంతర్గత విభేదాలు కొత్త కాదు. అందుకు బీజేపీ మినహాయింపు కాదు. 

కానీ, క్రమశిక్షణకు మారు పేరుగా ముద్ర వేసుకున్న బీజేపీలో అంతర్గత విభేదాలు చాలా వరకు అంతర్గంగానే ఉంటాయే, కానీ,  బజారుకు ఎక్కడం అంతగా ఉండదు. అందుకే, బండి వర్సెస్ ఈటల మాటాల యుద్ధం మేదో దృష్టిని గట్టిగా ఆకర్షిస్తోంది. అయితే, ప్రస్తుత బీజేపీ నేతలంతా సంఘ్ పరివార్’ సంస్కృతీ నుంచి వచ్చినవారు కాదు. ఈటల విషయాన్నే తీసుకుంటే.

ఆయన వామపక్ష భావజాలం నుంచి వచ్చిన నాయకుడు. అంతే కాకుండా, ఆయన బీజేపీలోకి వచ్చే నాటికే, ఏడు సార్లు ఎమ్మెల్యేగా, కేసీఆర్ మంత్రి వర్గంలో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ముఖ్యమంత్రి రేసులో ఉన్న నాయకుడు. సో.. సహజంగానే’ ఆయన ఆశించిన అధ్యక్ష పదవి రాకుండా పోవడంతో నిరాశకు గురయ్యారని, దానికి బండి సంజయ్’తో ఉన్న చిరకాల వైరం తోడవడంతో ఈటల భగ్గుమన్నా రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 

నిజానికి అధికార కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి, ఈటల వర్సెస్ బండి వార్’కు  పెద్దగా తేడాలేదు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ,రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై, రాజగోపాల రెడ్డి, అది కాంగ్రెస్ పార్టీ విధాలకు విరుద్దమంటూ  తీవ్రంగా తప్పు పట్టారు. నిజానికి, అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక్క కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి మాత్రమే కాదు, అసంతృప్తి ఉడికి పోతున్న నాయకులు ఇంకా ఉంటారు.

 ఇక బీఆర్ఎస్ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. అయితే, ఇతర పార్టీల కథ ఎలా ఉన్నా, బీజేపీలో అంతర్గత విభేదాలు.. మీడియా దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. అందుకే, ఈట ల వర్సెస్ బండి మాటల యుద్ధం రాష్ర్ం రాజకీయాల్లో సంచలనంగా మారిందని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే.  బండి వర్సెస్ ఈటల ‘వార్’ ఎలా ఎండ్’ అవుతుంది? అనేది ఆశక్తికరంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.


 

By
en-us Political News

  
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.