శరణార్థులని నీడనిస్తే...!
Publish Date:Jun 1, 2016
Advertisement
స్వదేశంలో రాక్షసుల్లాంటి ఉగ్రవాదులు..ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో..ఎటు నుంచి ఏ బుల్లెట్ దూసుకొస్తుందో తెలియక నిత్యం నరకం. కళ్లముందే అయినవారిని కోల్పోతుంటే భరించలేని గుండెకోత. ఇది ఇరాక్, సిరియా, లిబియా తదితర దేశాల్లోని ప్రజల పరిస్థితి. దీంతో మాతృదేశంలో బతకలేక..ప్రాణాలకు తెగించి సముద్రాలపై ప్రయాణించి పరాయి దేశంలోనైనా బతుకుదాం అని ఎందరో శరణార్ధులు యూరప్‌లోని వివిధ దేశాలకు వలస పోతున్నారు. అలా మానవత్వంతో శరణార్ధులను అక్కున చేర్చుకున్న దేశం జర్మనీ. కానీ ఆ మానవత్వమే జర్మనీని కాటేసింది. ఆ దేశంలో శరణార్థుల దారుణాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయి. ధర్మస్టాడ్ సిటీలో ఆదివారం జరిగిన స్క్లోస్ గార్బెన్‌ఫెస్ట్ సంగీతోత్సవం సందర్భంగా 26 మంది జర్మన్ యువతులపై శరణార్థులు అత్యాచారాలకు ఒడిగట్టారు. ఆదివారం నాడు ప్రారంభమైన మ్యూజిక్ ఫెస్ట్‌కు దాదాపు లక్షమంది యువతీ యువకులు హాజరయ్యారు. దీనికి శరణార్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గుంపులుగా వచ్చిన వీరు జర్మనీ యువతులను చుట్టుముట్టి అత్యాచారాలకు పాల్పడినట్టు బాధిత యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు, కొలోగ్నిలో డిసెంబర్ 31వ తేదీన కెథడ్రల్ చర్చి సమీపంలో దారుణ పైశాచికం జరిగింది. ఒకర్ని కాదు, ఇద్దర్ని కాదు ఏకంగా 120 మంది జర్మన్ మహిళలపై దాదాపు వెయ్యిమంది అల్లరి మూకలు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అమ్మాయిలను పశువుల్లా తరుముతూ.. వెంటాడి..వెంటాడి తమ కామవాంఛ తీర్చుకున్నారు. అదే రోజున జర్మనీలోని స్టట్-గార్ట్, డస్సెల్-డార్ఫ్, హంబర్గ్, మ్యూనిచ్, బెర్లిన్ నగరాల్లో కూడా అమ్మాయిలపై పాశవికంగా అత్యాచారాలు జరిగాయి. అత్యాచారాలకు పాల్పడటంతో పాటు సెల్‌ఫోన్లు, పర్సులను దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే ఈ పని శరణార్థులే చేశారా లేక అక్కడి ముఠాలే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చు కదా అని అంతర్జాతీయ సమాజం ప్రశ్నించగా..సామూహిక అత్యాచారానికి గురైన బాధితుల్లో ప్రతిఒక్కరూ అరబ్‌లో మాట్లాడిన వ్యక్తులే మాపై అఘాయిత్యానికి ఒడిగట్టారని చెప్పడంతో అందరి చూపు శరణార్థులపైకే వెళ్తోంది. ఈ సంఘటనలతో శరణార్థులకు వ్యతిరేకంగా జర్మనీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మధ్య ప్రాచ్య దేశాల నుంచి వచ్చినా, వారిలా కనబడినా చితకబాదాలన్న లక్ష్యంతో జర్మన్లు ఊగిపోతున్నారు. మరోపక్క జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మోర్కెల్‌పై విమర్శలు పెరిగిపోతున్నాయి. శరణార్థులను దేశంలోకి రానివ్వడం మూలంగానే ఈ ఆఘాయిత్యాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శరణార్థులు మాత్రం తాము తలదాచుకునేందుకు ఆశ్రయం కల్పించిన విదేశీయులపట్ల తామెందుకు అమానుషంగా ప్రవర్తిస్తామని బావురుమంటున్నారు. మొత్తంగా ఇది వలసవచ్చిన వారి పనా..లేదంటే ఇంటి దొంగల పనా అని తెలుసుకునే పనిలో పడింది జర్మనీ ప్రభుత్వం.
http://www.teluguone.com/news/content/-muslims--45-61442.html





