106 ఏళ్ల వయసులోనూ చురుగ్గా టీ అమ్ముతున్న వృద్ధుడు ఎక్కడంటే?

Publish Date:Apr 12, 2026

Advertisement

 

వయసు పైబడితే చాలు విశ్రాంతి కోరుకుంటారు ఎవరైనా. 60 ఏళ్లు దాటాయంటే మోకాళ్ల నొప్పులని, ఓపిక లేదని ఇంటికే పరిమితమవుతారు. కానీ ఒడిశాకు చెందిన ఓ శతాయుషి మాత్రం వీటన్నింటికీ మినహాయింపు. 106 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహం కుర్రాళ్లకు సైతం అసూయ కలిగిస్తోంది. భువనేశ్వర్‌కు చెందిన లబణి బెహెరా అనే వృద్ధుడు తన స్వశక్తితో టీ దుకాణం నడుపుతూ, ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా జీవిస్తున్నారు. భువనేశ్వర్ నగర సమీపంలోని గడకణ ప్రాంతంలో నివసించే లబణి బెహెరా, దాదాపు నాలుగు దశాబ్దాలుగా మాంచేశ్వర్ రైల్వే క్రాసింగ్ వద్ద టీ స్టాల్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి, పాలు సేకరించి, తన కస్టమర్ల కోసం వేడివేడి టీ సిద్ధం చేయడం ఆయన దినచర్య. 1989లో కేవలం 70 లీటర్ల పాలతో ప్రారంభమైన ఈ చిన్న దుకాణం, నేడు రోజుకు సుమారు 340 లీటర్ల పాలు వినియోగించే స్థాయికి ఎదిగింది.

ఒకప్పుడు ఈ ప్రాంతంలో పాలు లీటరు రూ.10 ఉండే కాలం నుంచి, నేటి ఆధునిక ధరల వరకు ఆయన ప్రయాణం సాగింది. నాటి రోజుల్లో 50 పైసలకే టీ విక్రయించిన లబణి, నగర రూపురేఖలు మారుతున్నా తన జీవనశైలిని మాత్రం మార్చుకోలేదు. నాడు ఎడ్లబండ్లు తిరిగే పచ్చని పొలాల మధ్య ఉన్న భువనేశ్వర్, నేడు కాంక్రీట్ అడవిగా మారడాన్ని ఆయన కళ్ళారా చూశారు. తన 106 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో నగరం సాధించిన ప్రగతికి ఆయనొక సజీవ సాక్ష్యం.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వయసు రీత్యా ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్‌ను సైతం ఆయన సున్నితంగా తిరస్కరించారు.

 "నేను కష్టపడి సంపాదించుకోగలను, నాకెందుకు పింఛన్?" అని ప్రశ్నించే ఆయన ఆత్మగౌరవం చూసి అధికారులు సైతం అబ్బురపోతున్నారు. తనకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే తన కుమారుడు ఉన్నాడని, అంతేకానీ ప్రభుత్వంపై భారం పడకూడదన్నది ఆయన దృఢ నిశ్చయం.స్థానికంగా లబణి బెహెరా కేవలం ఒక టీ విక్రేత మాత్రమే కాదు, ఒక స్ఫూర్తి ప్రదాత. ఉదయాన్నే వాకింగ్‌కు వచ్చే వారు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఆయన టీ స్టాల్ వద్ద ఆగి చాయ్ తాగుతూ ఆయన చెప్పే పాత రోజు ముచ్చట్లను ఆసక్తిగా వింటారు. ఆయన దుకాణం ఒక సామాజిక వేదికగా మారిపోయింది. 

106 ఏళ్ల వయసులోనూ ఆయన చూపిస్తున్న చురుకుదనం, పనుల పట్ల ఉన్న నిబద్ధత తమకు ఎంతో ప్రేరణనిస్తాయని స్థానికులు చెబుతున్నారు.ప్రస్తుతం తన కుమారుడు కుంజ్ బిహారీ సాయంతో దుకాణాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, ప్రధాన బాధ్యతలు లబణి గారే చూసుకుంటారు. తండ్రి పక్కనే ఉన్న చిన్న గదిలో ఉంటూ దుకాణం పనులను పర్యవేక్షిస్తుంటారని కుమారుడు గర్వంగా చెబుతుంటారు. కాలం మారుతున్నా, యంత్రాల యుగం వచ్చినా.. మనిషిలో పట్టుదల ఉంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని లబణి బెహెరా నిరూపిస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా మరిన్ని ఏళ్లు జీవించాలని స్థానికులు కోరుకుంటున్నారు.

By
en-us Political News

  
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.