గవర్నర్ కు కూడా అదే చెప్పారు..!
Publish Date:Aug 9, 2014
Advertisement
ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కే అధికారాలు ఉంటాయని కేంద్రం స్పష్టం చేయడంపై తెలంగాణ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని గవర్నర్ నరసింహన్ కు కూడా తెలియజేసినట్లు సమాచారం.శనివారం ఉదయం రాజీవ్ శర్మ..గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. గవర్నర్ కు అధికారాలు కట్టబెట్టాలన్న కేంద్రం నిర్ణయం తరువాత వీరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఏం చర్చించారన్నది తెలియరాలేదు. గ్రేటర్ హైదరాబాద్ విషయంలో కేంద్రం జోక్యంపై తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. హైదరాబాద్ పై అధికారాన్ని వదులుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా లేదని గవర్నర్ కు చెప్పినట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-kcr-govt-on-hyd-39-37041.html
http://www.teluguone.com/news/content/-kcr-govt-on-hyd-39-37041.html
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026





