ఆల్ ఈజ్ నాట్ వెల్.. సీజేఐ ఆగ్రహం సీఎస్ పైనేనా?

Publish Date:Apr 30, 2022

Advertisement

తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశంసల వర్షం కురిపించి నెల రోజులు గడిచిందో లేదో.. తెలంగాణ సీఎస్ పనితీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు సీజేఐ ఎన్వీ రమణ.  ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ వచ్చిన సీజేఐ ఎన్వీ రమణ  దేశంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు కేసీఆర్ సహకారం కారణమన్నారు. అలాగే న్యాయాధికారుల పోస్టుల మంజూరులో ఆయన చూపిన చొరవను బహుదా ప్రశంసించారు. అంతలోనే ఏమైందో ఏమో శనివారం హస్తినలో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సదస్సులో తెలంగాణ సీఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, హైకోర్టు సీజేలు తీసుకున్న నిర్ణయాల అమలులో సీఎస్ అలక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఈ సదస్సుకు సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. సీజేఐ సీఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేయడానికీ, సీఎం ఈ సదస్సుకు హాజరు కాకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా అన్న సందేహాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 
ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు కు  చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు   ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.  తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ డుమ్మా కొట్టారు. చీటికీ మాటికీ హస్తిన బయలుదేరే సీఎం కేసీఆర్ ఈ సదస్సుకు డుమ్మా కొట్టడానికి కారణమేమిటన్న విషయంపై సర్వత్రా ఆసక్కి నెలకొంది.  రాజకీయ కారణాల వల్లనే కేసీఆర్ ఈ సదస్సుకు డుమ్మా కొట్టారని అంతా భావిస్తున్నారు. అయితే సీజేఐ తెలంగాణ సీఎస్ తీరుపై చేసిన వ్యాఖ్యలతో కేవలం రాజకీయ కారణాలే కాకుండా ఇతరేతర కారణాలు కూడా సీఎం కేసీఆర్ ఈ సదస్సుకు గైర్హాజర్ కావడానికి కారణమై ఉంటుందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రధాని మోడీని ఫేస్ చేయడం ఇష్టం లేదన్న ఒక్క కారణంతో ఇంత  కీలకమైన సదస్సుకు సీఎం డుమ్మా కొట్టారా అన్న సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి.    
 తెలంగాణలోని న్యాయవ్యవస్థ సమస్యల పరిష్కారంపై సీఎం, హైకోర్టు సీజే పలు నిర్ణయాలు తీసుకున్న
ప్పటికీ  అవి అమలు కాకపోవడం.. దానిపై సీజేఐకు వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితిని దాటవేయడానికే సీఎం ఈ సదస్సుకు గైర్హజరయ్యారని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ కోర్టుల్లో దయనీయ పరిస్థితులపై రమణ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ డుమ్మాకు ఇది కూడా ఒక కారణమన్న భావన వ్యక్తం అవుతోంది. ఆర్భాటంగా నిర్ణయాలు ప్రకటించడం, ఆ తరువాత వాటి గురించి పట్టించుకోకపోవడం కేసీఆర్ శైలి.. ఆ కారణంగానే కోర్టులలో సదుపాయాలు, సౌకర్యాలపై కేసీఆర్ నిర్ణయాలు అమలు కాకపోవడంపై సమాధానం ఇచ్చుకునే పరిస్థితిని తప్పించుకోవడానికి కూడా కేసీఆర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు గైర్హాజర్ కావడానికి ఒక కారణమై ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.