తిరుమల ఘాట్‌ రోడ్డులో కారు బోల్తా.. భక్తులకు తీవ్ర గాయాలు..!

Publish Date:Jul 19, 2026

Advertisement

 

తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌కు చెందిన భక్తులు తమ కారులో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తుండగా, రెండో ఘాట్‌ రోడ్డులోని 39వ మలుపు వద్ద లింక్‌ రోడ్డుకు సమీపంలో కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. అనంతరం సేఫ్టీ గోడను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, ఇతర భక్తులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రెండో ఘాట్‌ రోడ్డులో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు, ఘాట్‌ రోడ్డు సిబ్బంది ప్రమాదానికి గురైన కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న భక్తులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టగా, గాయపడిన భక్తుల పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

By
en-us Political News

  
ప్రధాని మోడీకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెబుతూ వస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వచ్చే నెల మొదటి తేదీన భోగాపురం రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి వేదికగా జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శ్రీకాకుళం సమీపంలోని చాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 900 చదరపు గజాల ఖాళీ స్థలం కబ్జాలక్ష్యంగా.. ఆ భూమి అసలు యజమానులకు సంబంధం లేకుండా, స్థలాన్ని కబ్జా చేసేందుకు, లేని వ్యక్తులను ఉన్నట్లుగా, ఉన్న వారిని మరణించినట్లుగా చూపిస్తూ బోగస్ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. తద్వారా న్యాయబద్ధమైన వారసుల పత్రాలను ఫోర్జరీ చేసి అక్రమంగా యాజమాన్య హక్కులను పొందడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠ భరిత పరిణామాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది.
రాష్ట్రంలో మాతా–శిశు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోన్న ప్రభుత్వం
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఉభయ సభలను నీట్ వివాదం కుదిపేసింది.
సీజేపీ చలో పార్లమెంట్ ఉద్రిక్తం, పోలీసుల ఆంక్షలు..!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి సస్పెండ్..!
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది.
విచారణ కమిటీ నివేదిక వేళ ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్యకు యత్నం..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరో కీలక దశకు చేరుకుంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.