త్రిపురలో వామపక్ష కూటమి హావా

Publish Date:Feb 28, 2013

Advertisement

 

 

 

 

మూడు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ శాసనసభల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైన ఈ రాష్ట్రాలలో ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారోనని ప్రధాన రాజకీయపార్టీలు ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నాయి. నాగాలాండ్‌లో 60 స్థానాలకు గాను 59 స్థానాలకు ఓట్లను లెక్కిస్తున్నారు. త్రిపురలో 60 శాసనసభా స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఫలితాల సందర్భంగా మూడు రాష్ట్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


త్రిపురలో వామపక్ష కూటమి అధికారం చేజిక్కుంచుకునే దిశగా దూసుకుపోతుంది. 60 శాసనసభ స్థానాలకు గాను వామపక్ష కూటమి అభ్యర్ధులు 40స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు.

By
en-us Political News

  
వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిలను తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ కౌంటర్ అటాక్ చేశారు. రైతు బీమా విషయంలో ఆమె అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే అభాసుపాలవుతారని, అందుకే తెలుసుకొని మాట్లడితే గౌరవం మిగులుతుందంటూ హితవు పలికారు. కేసీఆర్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు, రైతు బీమా కార్యక్రమాలు విజయవంతంగా రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. రైతు బీమా విషయంలో కేంద్ర ప్రభు రంగ సంస్థ అయిన ఎల్.ఐ.సీ. ని ఒప్పించి కేసీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నారని, దాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలెందుకు చేస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు.  ఎల్ఐసీ జనరల్ ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం 60 ఏళ్ల లోపు ఉన్న వారికే బీమా సౌకర్యం ఉందని, ఆ నిబంధనల ప్రకారమే రైతు బీమా పాలసీ చేయించామని వివరణ ఇచ్చారు. దేశమంతటా ఎల్ఐసీ ఒకే విధానాన్ని అమలు చేస్తుందని, ఆ ప్రకారం 60 ఏళ్ల లోపు ఉన్నవారికే రైతుబీమా కూడా వర్తిస్తుందని, ఈ విషయం షర్మిలకు తెలియదా అంటూ సవాల్ చేశారు. రైతుబంధు, రైతుబీమా పథకాలకు రైతు అయితే సరిపోదా.... వయసుతో ఏం పని.. అంటూ షర్మిల కేసీఆర్ సర్కారు మీద విమర్శలు గుప్పించారు. వయసుతో నిమిత్తం లేకుండా రైతులందరికీ రైతుబంధు పథకంతో పాటు రైతుబీమా వర్తింపజేయాలని షర్మిల డిమాండ్ చేయడంతో వినోద్ కుమార్ స్పందించారు. 
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్ప ఇంట్లో విషాదం నెలకొంది. యెడ్డీ మనవరాలైన 30 ఏళ్ల సౌందర్య తన స్వగృహంలోనే ఉరేసుకుని చనిపోయింది.  బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టరుగా పనిచేస్తున్న సౌందర్యకు 4 నెలల పాప కూడా ఉంది. ఆమె భర్త కూడా డాక్టరే. అయితే ఇటీవలే ఓ పాపకు జన్మనిచ్చిన సౌందర్య పోస్ట్ ప్రెగ్నెన్సీ డిప్రెషన్ కు లోనై.. ఒత్తిడి భరించలేక చనిపోయినట్లు భావిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని సిటీలోని బౌరింగ్ హాస్పిటల్ కు పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టమ్ రిపోర్టు వచ్చాక ఆత్మహత్యకు గల అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది. 
‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్నారు మన పెద్దలు.. ఎలాంటి లక్ష్యం కోసమైనా కష్టపడి పనిచేసిన వారికి ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ మాటలకు అక్షరాలా సరిపోతాడు కర్ణాటకు చెందిన 77 ఏళ్ల అమయ్మహాలింగ నాయక్. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రకటించిన దేశ అత్యున్నత  ‘పద్మ పురస్కారాల’లోని పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యాడు ఈ వ్యవసాయ కష్టజీవి. వ్యవసాయంలో మహాలింగ నాయక్ చేసిన కృషికి గుర్తింపుగా కేంద్రం ఆయనకు పద్మశ్రీ అవార్డుకు ఎంపికవడం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వ్యవసాయంలో మహాలింగ నాయక్ చేసిన కృషి ఏంటి? ఏం సాధించాడో తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో నెటిజన్స్ బాగా సెర్చ్ చేస్తున్నారు. బంజరు భూమిని చక్కని పంటలు పండే క్షేత్రంగా మార్చేయడమే మహాలింగ నాయక్ కృషికి నిదర్శనం.
ఆంధ్ర ప్రదేశ్’లో రాజకీయాల్లో బీజేపీ పరిస్థితి ఏంటో, ఎన్నికల్లో  ఆపార్టీ స్టేక్’ ఏంటో, ఓటింగ్ షేర్ ఏంటో వేరే చెప్పనక్కర్లేదు. లేటెస్ట్’గా ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్’ లోనూ బీజేపీకి ‘జీరో’ సీట్లే వచ్చాయి. ఓటింగ్  షేర్ కూడా జీరోకు దగ్గరగానే వుంది. అయినా, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడడం వలన చేత, రాష్ట్రంలో ఆ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు ఇంకా అంతో ఇంతో  రాజకీయ గౌరవం దక్కుతోంది.
ఎక్కడ కెలికినా ఓకే. సెంటిమెంట్లను మాత్రం కెలక్కూడదంటారు అనుభవజ్ఞులు. సెంటిమెంట్లు గాయపడితే సెంటు భూమి కోసమైనా వెనక్కి తగ్గదు ప్రజానీకం. ఇప్పడదే జరిగింది నర్సాపురంలో పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా ఏర్పాటవుతున్న నర్సాపురం జిల్లాకు భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై నర్సాపురం ప్రజలు భగ్గుమన్నారు. నర్సాపురం పేరుతోనే జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని లేకపోతే ఊరుకునే సమస్యే లేదని అక్కడి వ్యాపార-వాణిజ్య వర్గాలు, సామాన్య ప్రజలు బంద్ కు పిలుపునిచ్చారు. స్థానిక రాజకీయ నాయకులు ప్రజాభిప్రాయంతో రంగంలోకి దిగారు. జిల్లా కేంద్ర సాధన పేరుతో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకొని నర్సాపురం నియోజకవర్గం మొత్తం శుక్రవారం బంద్ నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని వర్తక వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.
అనుకున్నదొకటి.. అయిందొకటి అన్నట్టుగా తయారైంది ఏపీ జిల్లాల ఏర్పాటు ప్రక్రియ. జగన్ ను పట్టిపీడిస్తున్న సమస్యల నుంచి కాసింతైనా ఉపశమనం పొందుదామనుకున్న జగన్ అండ కో ఆశలపై కేంద్ర సర్కారు నీళ్లు చల్లింది. దీంతో తాత్కాలికంగా జిల్లా ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతోంది. వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఆంధ్రా ప్రజలకు కాస్త ఉగాది పచ్చడి లాంటి తీపి, చేదు వార్తలను కలిపి పంచుదామనుకున్నారు జగన్. అయితే జూన్ నాటికి ఆ అవకాశాలు లేకుండా తయారైంది. ఇప్పుడున్న జిల్లాల సరిహద్దులను జూన్ వరకు మార్చవద్దని, కేంద్ర జనగణన డిప్యూటీ డైరెక్టర్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. రాష్ట్రాల ప్రయారిటీల కన్నా కేంద్ర ప్రభుత్వ ప్రయారిటీనే ఎక్కువ కాబట్టి సెన్సస్ విభాగం ఆదేశాలను శిరసావహించడం మినహా జగన్ బాబు చేయగలిగిందేమీ లేకుండాపోయింది. దేశమంతట నూతన గణాంకాల కోసం కోసం కేంద్ర సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగానే ఓటర్ లిస్టులు, నియోజకవర్గాల విభజనలు, బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి. అయితే 2011 తరువాత జనాభాలో విపరీతమైన పెరుగుదల సంభవించింది. ఆయా క్లస్టర్స్ లో వివిధవర్గాల జనాభా సాంద్రతలోనూ అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వీటన్నిటినీ క్రోడీకరించి తాజా సమాచారంతో పూర్తిస్థాయి జనాభా గణాంకాలు నిర్వహించేందుకు కేంద్రం రంగంలోకి దిగుతోంది. 
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. అనుకున్నదొకటి, అయింది అన్నట్లుగా అడుగడుగునా అనుమానాలు అభ్యంతరాలు వ్యక్త మవుతున్నాయి. ఆందోళనలు పురుడు పోసుకుంటున్నాయి. ఇతర జిల్లాల విషయం ఎలా ఉన్నా,అనంతపూర్ జిల్లా విభజన విషయంలో రాజకీయ రగడ తప్పేలా లేదు. రాష్ట్రాల  విభజన అంటూ జరిగితే అనంతపూర్ హిందూపురం జిల్లా ఏర్పడుతుందని అందరూ గట్టిగా నమ్ముతూ వచ్చారు. నిజానికి వైసీపీ ఎన్నికల ప్రణాళికలోనే, ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ఉద్దేశంతోనే, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుండో, హిందూపూర్ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఏర్పాటు అవుతుందని, గట్టిగా నమ్ముతూ వచ్చారు.  అయితే బాలయ్య బాబు తలచింది ఒకటైతే, జగన్ రెడ్డి ప్రభుత్వం వేరొకటి చేసింది.
ఇప్పుడు ఏపీలో ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసిన ఒకటే, చర్చ. జిల్లాల పునర్విభజన. కాదంటే ఉద్యోగుల సమ్మె. నిజానికి, ఈ రెండు వేర్వేరు విషయాలు కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వేస్తున్న తప్పుడు అడుగులకు పుణ్యమే, ఈ రెండు సమస్యలు. పీఆర్సీ మంటలను చల్లార్చేందుకు, వ్యూహాత్మకంగా జగన్ రెడ్డి ప్రభుత్వం జిల్లాల విభజన అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అయితే, ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడొచ్చింది’ అన్నట్లు, ఉద్యోగుల పీఆర్సీ సమస్యకు వేసిన జిల్లాల విభజన మందు వికటించింది. పీఆర్సీ సమస్య చల్లారలేదు. కానీ కొత్త జిల్లాల సమస్య నెత్తినెక్కి కూర్చుంది. సర్కార్ చిక్కులో చిక్కుంకుంది. ఒక విధంగ జనంలో నవ్వుల పాలవుతోంది.    
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు. అదొకటి అలా ఉంటే, అసలు ప్రభుత్వం చేతులు కాలిన తర్వాత అయినా ఆకులు పట్టుకుందా లేక ఇంకా ఏదైనా కొత్త ట్రిక్ ప్లే’ చేస్తోందా? అనే అనుమానాలు కూడా లేక పోలేదు. అవును, మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ‘పీఆర్సీ’ పంచాయతీ విషయంగా ఉద్యోగ సంఘాలతో ఆడుతున్న దాగుడు మూతల గురించే. 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవసరార్ధం బ్రాహ్మణార్ధం అన్నట్లుగా చేపట్టిన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై జిల్లాలలో అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా వైఎస్సార్ కడప జిల్లాలోనే చిచ్చు రాజుకుంది. వైఎస్సార్ జిల్లాను రెండుగా చేసి రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనాపై రాజంపేట వాసులు భగ్గుమంటున్నారు. లోక్‌సభ నియోజకవర్గం కేంద్రంగా ఉన్న రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ లో ఓ భారీ విందు జరిగింది. బహుశా దాన్ని ఇప్పటికీ ఎవరూ మరచిపోయి ఉండరు. హైలెవల్ ఇంటర్నేషనల్ ప్రొఫైల్ కలిగిన టాప్ అమెరికన్ బ్యూరోక్రాట్స్ కు ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఓ భారీ ట్రీట్ ఇచ్చారు. ఇప్పుడా హోటల్ పేరు గుర్తొచ్చి ఉంటుంది కదా. అంతర్జాతీయంగా ప్రఖ్యాతికెక్కిన తాజ్ ఫలక్ నుమాలో ఆనాటి భారీ విందు జరిగింది. అప్పటి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ గారాలపట్టి ఇవాంకా ట్రంప్ ముఖ్యఅతిథిగా వచ్చినందుకు భారత ప్రభుత్వం ఆమె తన జీవితంలో మరచిపోలేని విధంగా రాచమర్యాదలు చేసింది. అమెరికా-భారత్ లాంటి రెండు పెద్ద దేశాల మధ్య జరగాల్సిన ఎన్నో కార్యక్రమాలు, అవగాహనలు, ఒప్పందాలు ఉంటాయి కాబట్టి.. ఆ లెవెల్లో అలాంటి ట్రీట్స్ ఇవ్వడం కామన్. అయితే దాదాపుగా అలాంటి భారీ ట్రీటే మన తెలంగాణ సర్కారులో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి కూడా అదే హోటల్లో ఇవ్వడమే విశేషం. అయితే ఇది దేశాల మధ్యనో, ప్రభుత్వాల మధ్యనో రాచకార్యాలు చక్కదిద్దేందుకు ఉద్దేశించిన విందు కాదు. ఆ సీనియర్ బ్యూరోక్రాట్ కూతురు వివాహం కోసం పలు తాజ్ హోటల్స్ ను బుక్ చేసుకున్నారు. ఆ బుకింగ్ లో అత్యంత ఖరీదైన తాజ్ ఫలక్ నుమా కూడా ఉండడమే ఇప్పుడు చర్చనీయాంశం పరిధిని దాటి సంచలనంగా మారి వివాదాలకూ తావిస్తోంది. ఎటొచ్చీ బంతి అటు తిరిగీ ఇటు తిరిగీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరే ఆగుతుండడంతో విపక్షాలకు మరో అతి ముఖ్యమైన అస్త్రాన్ని అందించినట్లయింది. 
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నంత పనీ చేశారు. తనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆర్మూర్ ఎమ్మెల్యేకే గాక టీఆర్ఎస్ బాసుకు సైతం టేస్టే చూపించారు. వచ్చే ఎన్నికల్లో నువ్వు టీఆర్ఎస్ పార్టీ టికెట్ తెచ్చుకో... మిగిలింది నేను చూసుకుంటా అంటూ అరవింద్ విసిరిన సవాల్ ఎఫెక్ట్... ఎన్నికలు వచ్చేదాకా కాదు.. తన కారుపై, కార్యకర్తలపై దాడి జరిగిన కొన్ని గంటల్లోనే కళ్లకు కట్టించారు. వచ్చే ఎన్నికల్లో 50 వేల ఓట్ల తేడాతో ఆర్మూర్ ఎమ్మెల్యేను ఓడిస్తానని తన వెహికల్ మీద దాడి జరిగిన ప్రాంతంలోనే సవాల్ చేశారు అరవింద్. 
అనుకున్నట్లుగానే, అనుమానించిన విధంగానే, ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయ వేడిని రాజేసింది. జిల్లాల పేర్ల విషయంగా తలెత్తిన వివాదం మొదలు, సరిహద్దుల వివాదాలు, నియోజక వర్గాల సర్దుబాటు, కూడికలు తీసివేతలు, దూర భారాలు, కులం కొట్లాటలు, ఆస్తుల పంపకాలు, రాజకీ కుట్రలు, కుతంత్రాలు ఇలా ఒకటని కాదు, అన్ని రకాల రాజకీయ రచ్చకు  కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం, రంగం సిద్దం చేసింది. వేదికగ మారింది. ఎక్కడి కక్కడ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు, అనుకూలంగా విందులు చిందులు అన్నీ జరిగి పోతున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.