మెగా డీఎస్సీపై వైసీపీ పోరుకు కోర్టు తీర్పు ఎండ్ కార్డ్.!

Publish Date:Aug 5, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి  ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ  ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఈ విషయంలో వైసీపీ చేస్తున్న పోరాటానికి ఎండ్ కార్డ్ పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మెగా డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయనీ, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలనీ కోరుతూ పర్వతరెడ్డి  చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన పిల్ ను విచారించిన  హైకోర్టు.. మెగా డీఎస్సీలో అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు ఎలాంటి  ప్రాథమిక ఆధారం లేదని స్పష్టం చేసింది.  

విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  ఒకవేళ మెగాడీఎస్సీలో అవకతవకలు, అక్రమాలు జరిగితే.. బాధిత అభ్యర్థులు  కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి భయపడుతున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఎలాంటి ఆధారాలు  పిటిషన్ దాఖలు చేయడం సహేతుకం కాదని పేర్కొంటూ..   రాజకీయ ప్రయోజనాలు,  లబ్ధి కోసం ఇటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేస్తే, పిల్  అసలు ఉద్దేశమే దెబ్బతింటుందని ధర్మాసనం పేర్కొంది. 

 రాజకీయాలకు కోర్టులను వేదికలుగా చేసుకోవడాన్ని ఉపేక్సించమని పేర్కొంటూ.. మెగా డీఎస్సీపై  సిబిఐ విచారణ కోరుతూ పర్వత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించింది. కోర్టు విస్పష్ట తీర్పుతో మెగా డీఎస్సీలో అక్రమాలు, నియమక ప్రక్రియలో అవకతవకలు అంటే వైసీపీ చేస్తున్న వాదనలో సరుకులేదని తేలిపోయింది.  ఇక హైకోర్టు తీర్పుతో  డీఎస్సీ నియామక ప్రక్రియ నిరాటంకంగా వేగంగాసాగనుంది. కోర్టు వివాదాల కారణంతో నియామకాలు ఆలస్యమవుతాయేమోనని ఆందోళన చెందిన  నిరుద్యోగ యువత  కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.   

AP Mega DSC, AP High Court, YSRCP PIL Dismissed, Nara Lokesh, AP Teacher Recruitment 2026

By
en-us Political News

  
తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ బతికున్న సమయంలో ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదని మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆరోపించారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన జూనియర్‌ కాలేజీలు.. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా డుతున్నారు.
తాడేపల్లి ప్యాలెస్ ముందు, కాలిపోయే ఎండలో, రోడ్డు పక్కన ప్లాట్‌ఫారమ్‌పై కట్టుకున్న పెళ్లాన్ని పక్కన కూర్చోబెట్టుకుని, నాయకుల దర్శనం కోసం దేహి అని వేడుకుంటున్న
తెలంగాణ రాష్ట్ర ఇంధన రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది.
దేశంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న యూపీఐ డిజిటల్ లావాదేవీల వినియోగానికి సంబంధించి పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
ఐసీయూలో చావుబతుకుల మధ్య వైద్య విద్యార్థిని..!
నూతన రేషన్ కార్డుల రూపకల్పనలో ప్రభుత్వం మార్పులను తీసుకొచ్చింది. గతంలో ఉన్న పాత కాగితపు కార్డుల స్థానంలో లామినేషన్‌తో, డెబిట్ కార్డు సైజులోనే ఈ నూతన కార్డులను రూపొందించారు.
ప్రతిష్టాత్మక గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన ఏపీకీ చెందిన వల్లూరి అజయ్ బాబు
చదువు కోసం ఇంటికి దూరంగా వెళ్లిన ఓ విద్యార్థిని.. తన మనసులోని బాధను తల్లిదండ్రులతో పంచుకుంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన అమర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి.
అదృష్టం అనేది ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. ఇటలీలో ఒక మహిళను వరించిన భారీ అదృష్టం క్షణాల్లో చేజారిపోయినట్లే కనిపించినా, చివరికి అనూహ్య రీతిలో ఆమె వద్దకే చేరింది.
హైదరాబాద్ బోనాల జాతర.. భక్తుల సందడి.. కిక్కిరిసిన రహదారులు.. ఇదే అదనుగా మహిళలను వేధిస్తూ రెచ్చిపో తున్న ఆకతాయిలకు షీ టీమ్స్‌ చెక్ పెట్టాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.