వైసీపీ సభ్యుల నిరసనలతో మండలి రేపటికి వాయిదా

Publish Date:Mar 4, 2026

Advertisement

 

ఏపీ శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో చైర్మన్ మోషేన్ రాజు సభను గురువారానికి (5-3-26) వాయిదా వేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతుండగా వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం ఎక్కి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. అంతకముందు.. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో మండలిలో రగడ చోటుచేసుకుంది. మాజీ సీఎం జగన్‌ను క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు ఆందోళకు దిగారు. 

దీంతో సభను ఒకసారి వాయిదా వేశారు చైర్మన్. తిరిగి మొదలైన తర్వాత కూడా.. జగన్‌కు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘జగన్‌ను నేను క్రిస్టియన్ అని అన్నాను, ఆ మాటకు కట్టుబడి ఉన్నాను’ అని స్పష్టం చేశారు. జగన్ క్రిస్టియన్ కాదని చెప్పమనండి అంటూ సవాల్ విసిరారు. ‘జగన్ కూడా టీవీలో చూసి ఉంటారు కదా ... కాదని చెప్పమనండి’ అని మంత్రి అన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కుటుంబంతో తిరుమల దర్శనానికి ఎందుకు రాలేదని నిలదీశారు. వైసీపీ సభ్యులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దీంతో వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి జగన్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రసంగించారు. వైసీపీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ వారిపై తీవ్ర వ్యక్తం చేశారు. ‘రూ.320లకు కిలో ఆవు నెయ్యి ఎక్కడైనా దొరుకుతుందా?’ అని ప్రశ్నించారు. వీళ్లు హిందువులు ఎలా అవుతారంటూ వైసీపీ సభ్యులను ఉద్దేశించి అన్నారు. రూ.320లకు ఆవు నెయ్యి కొనాలని అడుగుతున్న వైసీపీ సభ్యులు.. ఎమ్మెల్సీలు ఎలా అయ్యారని నిలదీశారు. సోమువీర్రాజు మాట్లాడుతున్న సమయంలో పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో చైర్మన్ సభను గురువారానికి(మార్చి 5) వాయిదా వేశారు.

By
en-us Political News

  
వీసా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందనే నెపంతో.. ప్రైవేట్ వ్యక్తులు కెమెరాలతో భారత హఎచ్ 1బి వీసా ఉద్యోగులు పని చేస్తున్న కార్యాలయాలకు, వారి నివాసాలకూ కూడా వెళ్లి హల్‌చల్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఉద్యోగులను కలవరానికి గురి చేస్తున్నది.
ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలను తీవ్రంగా పరిగణించిన కాకినాడలోని మొబైల్ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.
తమకు ఇష్టం లేని గర్భాన్ని కొనసాగించమని బలవంతం చేయడం వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
భారతదేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు అత్యంత కీలమైన పెన్షన్ విధానంలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.
ఇప్పటికిప్పుడు ఉద్యోగాలకు ఎలాంటి ముప్పూ లేదని అంటున్నారు కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విశాల్ మిశ్రా. మనుషులతో సమానమైన సృజనాత్మకత, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ప్రస్తుత ఏఐకి లేవని మిశ్రా కుండబద్దలు కొట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలోని లోక్ భవన్‌కు వెళ్లారు.
ఈ అసాధారణ పరిణామం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పెట్రోల్ ధర లీటరుకు సగటున 1.22 డాలర్లకు, డీజిల్ ధర 1.238 డాలర్లకు చేరింది.
తెలంగాణ రాజకీయాల్లో మరో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. క
48 ఏళ్ల ఆసిఫ్ రజా వ్యాపారవేత్త ముసుగులో అమెరికాలోకి ప్రవేశించి ఈ వినాశకర మిషన్‌ను ప్రారంభించాడు.
ప్రధానంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు ఈ స్కామ్‌లో కీలక సూత్రధారిగా భావిస్తున్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.
ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో నిపుణులైన వైద్యుల బృందం గవర్నర్‌కు చికిత్స అందిస్తోంది. ఆయనకు ప్రాథమికంగా పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు.
సాధారణంగా శబరిమల ఆలయ పరిసరాలను నో ఫ్లై జోన్ గా పరిగణిస్తారు. ఇక్కడ ఎటువంటి విమానాలు లేదా హెలికాప్టర్లు ప్రయాణించడానికి అనుమతి లేదు. అయితే, కోస్ట్ గార్డ్‌కు చెందిన హెలికాప్టర్ ఆలయ గోపురం మరియు పరిసర ప్రాంతాల్లో చాలా తక్కువ ఎత్తులో పదేపదే చక్కర్లు కొట్టినట్లు భక్తులు, ఆలయ సిబ్బంది గుర్తించారు.
అమెరికా ప్రతినిధుల బృందంలో ట్రంప్ సన్నిహితుడు జారెడ్ కుష్నర్‌తో పాటు ప్రత్యేక దూత స్టీవ్ విట్‌కాఫ్ ఉన్నారు. వీరిద్దరూ ఇస్లామాబాద్ చేరుకుని, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ముఖాముఖి భేటీ అవుతారు. ఈ పర్యటన ద్వారా ఇరాన్‌తో ఉన్న విభేదాలను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని వాషింగ్టన్ భావిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.