ఎన్నికలు ఫిక్స్డ్ మ్యాచ్ గా మారాయి: బహిష్కరించాలంటూ బొద్దింకల పిలుపు.!

Publish Date:Sep 28, 2026

Advertisement

సంచలనం సృష్టిస్తున్న ఎన్నికల కమిషన్   వివాదంపై  బొద్దింకల పార్టీ  వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు  చేశారు. దేశంలో ఎన్నికల ప్రక్రియపై, ముఖ్యంగా ఓట్ల తొలగింపు,  రిగ్గింగ్ ఆరోపణలపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికల బహిష్కరణ పిలుపునిచ్చారు. ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.  ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్   జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా డిమాండ్ తో. లేనిపక్షంలో జంతర్‌మంతర్ 2.0'పేరిట  ఆందోళనను చేపడతామని  హెచ్చరించారు.   

 దేశంలో ఎన్నికలు  పారదర్శకంగా జరగడం లేదనీ, ఓట్లు చోరీ అవుతున్నాయని ఆరోపించిన అభిజిత్ దిప్కే.. ఎన్నికలను బహిష్కరిస్తే తమ రాజకీయ ఉనికి కోల్పోతామనే భయంతోనే ప్రతిపక్షాలు ఈ తంతులో భాగం అవుతున్నాయని  విమర్శించారు. కానీ..  ఇలాంటి దెబ్బతిన్న, పక్షపాత వ్యవస్థలో కేవలం ఉనికిని కాపాడుకోవడం వల్ల ఒరిగేదేమిటని నిలదీశారు.  పార్టీలు విడిపోతున్నా, నాయకులు ఫిరాయిస్తున్నా ఎలాంటి రక్షణ లభిస్తుందని ప్రశ్నించారు. కేవలం తమకు ప్రయోజనం ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికల అక్రమాల గురించి మాట్లాడి.. ఇతర ప్రాంతాల్లో జరిగే అన్యాయాన్ని విస్మరించడం సబబు కాదన్నారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన ఫిక్స్డ్ మ్యాచ్ వ్యాఖ్యానం సోషల్ మీడియాలో  ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్స్ అయినప్పటికీ, ప్రజలను నమ్మించడానికి కొన్ని క్యాచ్‌లు వదిలేయడం, కొన్ని క్యాచ్‌లు పట్టడం, చివరి ఓవర్ వరకు మ్యాచ్‌ని పొడిగించడం చేస్తారన్న ఆయన... దేశంలో  ఎన్నికలో కూడా  కూడా ప్రతిపక్షాలకు కొన్ని విజయాలను ఇస్తారనీ,  అది చూసి ప్రజలు నిజంగానే అక్కడ పోటీ జరుగుతోందని భ్రమపడతారని  అభిజిత్ దిప్కే అన్నారు. ఆ చిన్న గెలుపులే ప్రతిపక్షాలను ఆటలో నిలబెట్టడానికి ఉద్దేశించిన బిస్కెట్లుగా అభివర్ణించారు.  

ఇటీవల ఎన్నికల కమిషన్‌లో సీఈసీ నిర్ణయాలను మిగిలలిన ఇద్దరు కమిషనర్లు  10 నెలల వ్యవధిలో   14 సార్లు  అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే రాజకీయ మనుగడ కంటే దేశహితం ముఖ్యం అని భావించి, రిగ్గింగ్‌కు గురవుతున్న ఎన్నికలను ప్రతిపక్షాలు పూర్తిగా బహిష్కరించాలని అభిజిత్ దిప్కే పిలుపునిచ్చారు.


[Abhijeet Dipke, Cockroach Janta Party, Election Commission Controversy, Election Boycott Call, CEC Gyanesh Kumar, India Election Rigging]

By
en-us Political News

  
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.