జగన్ 'జలదీక్ష'... కేసీఆర్ ఎలా కడతారు.. చంద్రబాబు చేతకాని తనంగా ఉన్నారు..

 

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జలదీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆయన ఈ దీక్ష చేపట్టారు. మూడు రోజుల పాటు జరిగే ఈ దీక్షకు ప్రజల నుండి మంచి స్పందనే వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు కర్నూలులో జగన్ చేపట్టిన ఈ దీక్షకు మద్దతుగా నియోజవకర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో రిలే దీక్షాశిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు తెలిపారు.

 

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇప్పించుకోలేకపోయారని, ఇప్పుడు నీటి ప్రాజెక్టులపై కూడా చేతకాని విధంగా ఉండిపోయారని అన్నారు. కృష్ణా, గోదావరి నదులపై ఇష్టమొచ్చినట్టు కట్టడాలు నిర్మిస్తున్నారు.. దిగువకు నీరు రావని తెలిసినా కేసీఆర్ ఎలా ప్రాజెక్టులు కడుతున్నారు.. ఈ విషయం తెలిసినా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు.. అని ప్రశ్నించారు. మనకు నీరు రాదని తెలిసినా చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అని మండిపడ్డారు.