మోడీతో ఫైట్ కు చంద్రబాబు.. తెలంగాణకు 791 కోట్లు.. ఏపీకి 433 కోట్లు

 

ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీ ప్రత్యేక హోదాపై చేతులెత్తేసినట్టు స్పష్టంగా అర్ధమవుతోంది. విభజన సమయంలో తాము కనుక అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు.. ఏకంగా పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రగల్భాలు పలికిన ఎన్డీయే ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని.. అసలు ప్రత్యేక హోదా ఇవ్వాల్సి న అవసరం ఏంటని రివర్స్ లో ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా రాదనే విషయం అర్ధమైపోయింది.

 

ఇదిలా ఉండగా ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదాపై మోదీ సర్కారుతో యుద్ధం చేసేందుకు చంద్రబాబునాయుడు సంసిద్ధులవుతున్నట్లు సమాచారం. ఫారెన్ టూర్ ముగించుకొని వచ్చిన ఆయన అధికారులతో సమావేశమై.. అసలు ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు ఎంత.. ఇతర రాష్ట్రాలకు.. మనకు ఇచ్చిన నిధుల కేటాయింపులు..తదితర విషయాలపై నివేదిక తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తెలంగాణలోని 7 జిల్లాలకు రూ. 791 కోట్లు కేటాయించగా.. ఏపీలోకి 10 జిల్లాలకు కేవలం రూ. 433 కోట్లు మాత్రమే కేటాయించినట్టు గుర్తించారు. అంతేకాదు ఇంకా ఏపీపై కేంద్ర వ్యవహరించిన తీరుపై కూడా చంద్రబాబు మోడీ ముందు తెలియజేయనున్నట్టు సమాచారం. మరి చంద్రబాబు విన్నపాలు మోడీ వింటారా?.. ప్రత్యేక హోదాపై ఎలా స్పందిస్తారో తెలియాలంటే వెయిట్ చేయాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu