నాలుగు రోజుల పాటు శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనం రద్దు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం క్షేత్రానికి భక్తుల రద్దీ భారీగాపెరిగింది. వరుస సెలవు రావడం, అలాగే శ్రావణమాసంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోవడం శుభప్రధమన్న భక్తుల విశ్వాసం కలిసి శ్రీశైల క్షేతం భక్త జనసంద్రంగా మారింది. దీంతో  మల్లన్న స్పర్శ దర్శనాలను నాలుగు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం (ఆగస్టు15) ఆగస్టు18 వరకు మల్లన్న స్పర్శ దర్శనాలు, గర్భాలయ, అభిషేక, ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఒక వైపు శ్రీశైలం డ్యాం గేట్లు తెరిచి ఉండడం, మరోవైపు వరుస సెలవు దినాలు కావడం, ఈ రెంటికీ తోడు  శ్రావణ మాసం కావడంతో మల్లన్న దర్శనానికి తరలివస్తున్న భక్తులతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడుతోంది.  

వచ్చిన భక్తులందరికీ మల్లన్న అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ఈవో తెలిపారు. భక్తులు శీఘ్ర, అతి శీఘ్ర టికెట్లైన 150, 300, 500 రూపాయల టికెట్లను తీసుకొని ఆయా క్యూ లైన్ ల ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ ఉన్నప్పటికీ, నిలిపివేసిన సేవలు వినా మిగతా ఆర్జిత సేవలు యధావిధిగా కొనసాగుతాయని అధికారలు తెలిపారు.  స్వామివారి ఆలయంలో హోమాలు,  స్వామి వారి కళ్యాణం యథావిథిగా జరుగుతాయన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu