శ్రీవాణి టికెట్ల విక్రయంలో గందరగోళం
posted on Aug 16, 2025 12:14PM
.webp)
సరైన ప్రణాళిక, కార్యాచరణ, ఏర్పాట్లూ లేకుండా శ్రీవాణి టికెట్ల విక్రయానికి తిరమల తిరుపతి దేవస్థానం ఉపక్రమించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవానికి టీటీడీ శనివారం (ఆగస్టు 16) ఉదయం పదిన్నర గంటలకు శ్రీవాణి టికెట్ల విక్రయాన్ని ఆరంభిస్తామంటూ ప్రకటించింది. ఇందు కోసం ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేసింది.
శ్రీవాణి టికెట్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో శుక్రవారం (ఆగస్టు 15)రాత్రి నుంచే క్యూలో నిలుచోవడంతో టీటీడీ అధికారలు, అర్ధరాత్రి నుంచే టికెట్ల విక్రయాలను ఆరంభించేశారు. ఈ సమయంలో భక్తుల మధ్య స్వల్ప తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. దీంతో టికెట్లు దొరకని భక్తులు అన్నమయ్య భవనం ఎదుట నిరసనకు దిగారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు భక్తులకు సర్ది చెప్పడంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు.