ఆంధ్రప్రదేశ్ బాటలో హస్తిన.. ఏపీలో అన్న క్యాంటిన్లు.. ఢిల్లీలో అటల్ క్యాంటిన్లు

ఢిల్లీ సీఎం రేఖాగుస్తా పేదలను అదుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ను ఫాలో అవుతున్నారు.   పేదల ఆకలి తీర్చే విషయంలో ఆంధ్రప్రదేశ్ లో అన్నా క్యాంటీన్లను ఏపీ సీఎం చంద్రబాబు ఏర్పాటు చేస్తే.. ఢిల్లీ సీఎం హస్తినలోనూ అదే ఒరవడిని ఫాలో అవ్వాలని  నిర్ణయించుకున్నారు.  పేదలకు మూడు పూట్లా నాణ్యమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా అదే బాటలో హస్తినలో అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నారు.

ఈ విషయాన్ని ఆమె పంద్రాగస్టు వేడుకలలో ప్రకటించారు. ఢిల్లీ వ్యాప్తంగా తొలి విడతలో వంద చోట్ల అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, అటల్ బీహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా వీటిని ప్రారంభించనున్నట్లు తెలిపారు.  అటల్ క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నట్లు తెలిపారు.  నిరుపేదలు, విద్యార్థులు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులందరికీ అటల్ క్యాంటిన్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని రేఖా గుప్తా తెలిపారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu