అన్నను రోకలి బండతో కొట్టి  చంపిన తమ్ముడు.. 

అది రంగా రెడ్డి జిల్లా. కందుకూరు మండలం. మురళి నగర్. అతని పేరు వడ్త్యవాత్ బాల్ రామ్. అతనికి ఇద్దరు పెళ్ళాలు. మొదటి భార్య పేరు గోరి, ఆమె 8 సంవత్సరాలు క్రితం అనారోగ్యం తో మృతి చెందింది. కట్ చేస్తే..  బాల్ రామ్. సరికోండకు చెందిన జయలక్ష్మి ని వివాహం చేసుకొన్నాడు. వీరికి 3 సంవత్సరాల బాలుడు (దేవరాజ్) ఉన్నాడు. కాపురం సజావుగా జరుగుతుందని    

కందుకూరు సీఐ కృషంరాజు తెలిపిన కథనం ప్రకారం.. వడ్త్యవాత్ బాల్ రామ్ ఈ నెల 2వ తేదీన బాల్ రామ్ మద్యం తాగి వచ్చి భార్య, పిల్లలను ఇంట్లో ఉండోదాన్ని గొడవ చేశాడు.దీంతో గ్రామ సమీపన ఉన్న పల్లె ప్రకృతి వణంలోనే జయలక్ష్మి పిల్లలతో కలిసి సాయంత్రం వరకు ఉండగా.. రాత్రి తన తోడి కోడలు.. వారిని ఇంటికి తీసుకువచ్చింది. అయితే, మంగళవారం జయలక్ష్మి.. తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులతో మాట్లాడానికి బాల్ రామ్‌ను కోరగా.. మంగళవారం సాయంత్రం 7 గంటలకు ఇంటికి వచ్చాడు. భార్యను ఎందుకు కొడుతున్నావని బాల్ రామ్ అత్తమామలు అడగా, అత్త మామలని బూతు మాటలు తిట్టడంతో పాటు.. బాల్ రామ్ సొంత తమ్ముడు వడ్త్య వాత్ మోహన్ ను  కూడా బూతులు తిడుతూ.. కొట్టడానికి రావడంతో మోహన్ ప్రక్కనే ఉన్న రోకలి బండ తీసుకొని బాల్ రామ్ (అన్న)ను తలపై కొట్టాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో వెంటేనే బాల్ రామ్‌ను 108 అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం (తెల్లవారుజామున) 2:43 సమయంలో చనిపోయడాని డాక్టర్లు తెలిపారు.