వ్యాక్సిన్ కూ కుల గజ్జి! అందుకే కొనడంలేదా జగన్ రెడ్డి?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మరణాలు భారీగా నమోదవుతున్నాయి. అధికారికంగా సర్కార్ చెబుతున్న లెక్కలకంటే రెండు, మూడు రెట్లు అధికంగానే కరోనా రోగుల మరణాలు ఉంటున్నాయని చెబుతున్నారు. ఏపీలో కొత్త రకం కరోనా వైరస్ N440K వేరియెంట్ ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్న వార్తలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో నమోదైన ఈ కొత్త రకం వైరస్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. ఇది అత్యంత వేగంగా విస్తరిస్తుందని, తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందనే ప్రచారంతో ఏపీ జనాలు హడలిపోతున్నారు. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ విధించాలని కోరుతున్నారు.

కొవిడ్ మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషనే ప్రధానమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనాను కట్టడి చేసిన దేశాలన్ని వ్యాక్సినేషన్ తోనే సక్సెస్ అయ్యాయి. అందుకే భారత్ లోనే వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలని అంతర్జాతీయ సంస్థలు సూచిస్తున్నాయి. మోడీ సర్కార్ కూడా వ్యాక్సినేషన్ పైనే ఫోకస్ చేసింది. మే1 నుంచి మూడో దశలో భాగంగా 18 ఏండ్లు పైబడిన వారందరికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాదు రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. కేంద్ర సర్కార్ నిర్ణయంతో అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కోసం టీకాలకు భారీగా ఆర్డర్లు ఇస్తున్నాయి. కాని ప్రమాదకర వైరస్ వ్యాప్తిలో ఉన్న ఏపీ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేయకుండా 18 ఏండ్లు పైబడిన వారికి ఇప్పుడే టీకాలు ఇవ్వలేమంటూ  చేతులెత్తేసింది. ఏపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీకా కోసం ఎదురు చూస్తున్న జనాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్రం ఇస్తున్నవి గాక రాష్ట్రం సొంతగా కొనుగోలు చేయడానికి 13.5లక్షల వ్యాక్సిన్లకు ఆర్డర్‌ ఇవ్వాలని, ఇందు కోసం రూ.45 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకొంది. ఇదే ఇప్పుడు రచ్చగా మారింది. పొరుగున ఉన్న కేరళ కోటి వ్యాక్సిన్లు, తమిళనాడు కోటిన్నర, కర్ణాటక కోటి, మహారాష్ట్ర మొత్తం జనాభాకు సరిపోయేంత వ్యాక్సిన్లకు ఆర్డర్‌ ఇవ్వాలని నిర్ణయించి వనరులు సిద్ధం చేసుకొన్నాయి. తెలంగాణ సర్కార్ కూడా 2 వేల 5 వందల కోట్లను వ్యాక్సిన్ కోసం ఖర్చు చేస్తామని ప్రకటించింది. దీంతో ఐదు కోట్లకు పైగా జనాలున్న ఏపీకి 13 లక్షల టీకాలు ఏ మూలకు వస్తాయి? మొత్తం వనరులన్నీ పోగుచేసి రాష్ట్రంలో ప్రజలందరికీ చాలినన్ని వ్యాక్సిన్లకు ఆర్డర్‌ ఇవ్వలేరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. 

కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఏపీలో 5 కోట్ల 26 లక్షల మంది ఉన్నారు. 18 ఏండ్లు పైబడిన వారందరికి టీకాలు ఇవ్వాలి. అంటే ఏపీలో టీకా ఇవ్వాల్సిన వాళ్లే దాదాపు మూడున్నర కోట్ల మంది ఉంటారని అంచనా. మే ఐదవ తేది వరకు ఏపీలో కేవలం 69 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. ఇందులో 52.5 లక్షల మందికి ఫస్ట్ డోస్ట్ ఇవ్వగా.. 16.5 లక్షల మందికి సెకండ్ డోస్ కంప్లీట్ అయింది. ఈ లెక్కన ఇంకా 2.6 కోట్ల మందికి ఫస్ట్ డోస్.. 2.9 కోట్ల మందికి పైగా సెకండ్ డోస్ ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా ఏపీకి ఇంకా దాదాపు ఐదున్నర కోట్ల వ్యాక్సిన్ కావాలి. ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ అవసరం ఉన్నా ఏపీ సర్కార్ మాత్రం ఏ చర్యలు తీసుకోవడం లేదు. 

దేశంలో ప్రస్తుతం కోవిషీల్ట్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  ఏపీకి చెందిన కృష్ణ ఎల్లాకు చెందిన హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థలోనే కోవాగ్జిన్ తయారవుతుంది. అయినా కొవాగ్జిన్ కోసం పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇవ్వలేదు జగన్ రెడ్డి సర్కార్. తెలంగాణ సర్కార్ మాత్రం కొవాగ్జిన్ కోసం భారత్ బయోటెక్ యాజమాన్యంతో నిరంతరం చర్చలు జరుపుతోంది. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ... కంపెనీకి వెళ్లి మరీ ఎండీతో చర్చలు జరిపారు. దేశ వ్యాప్తంగా కోవిషీల్డ్ కంటే కొవాగ్జిన్ కే ఎక్కువ డిమాండ్ ఉంది. కొవాగ్జిన్ కోసం ప్రైవేట్ సంస్థలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.  ఇతర రాష్ట్రాలు  పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇవ్వడంతో పాటు త్వరగా పంపిణి చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి. కాని ఆంధ్ర సర్కార్ మాత్రం చోద్యం చూస్తోంది. దీంతో ఏపీ సీఎంకు రాజకీయం, ఓటు పథకాలు తప్ప ప్రజల ప్రాణాలంటే లెక్క లేదనే ఆరోపణలు వస్తున్నాయి. 

తెలుగు వ్యక్తికి చెందిన ఫార్మా సంస్థలో తయారవుతున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్ కోసం జగన్ రెడ్డి సర్కార్ భారీగా ఆర్డర్లు ఇవ్వకపోవడంపై మరో చర్చ కూడా జరుగుతోంది. భారత్ బయోటెక్ ఎండీ కమ్మ కావడమే ఇందుకు కారణమంటూ సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది. కమ్మ వ్యక్తి సంస్థలో తయారైనందువల్లే కొవాగ్జిన్ కు జగన్ రెడ్డి సర్కార్ ఆర్డర్లు ఇవ్వడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది. స్పుత్నిక్ తో ఉన్న ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ లోని రెడ్డీస్ ల్యాబ్ లోనే ఆ టీకాలను తయారు చేస్తున్నారు. రెడ్డీస్ లో  ఉత్పత్తి అయ్యే స్పుత్నిక్ టీకా జూన్ లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అందుకే కోవాగ్జిన్ వద్దనుకుంటున్న ముఖ్యమంత్రి... రెడ్డీస్ లో రూపొందుతున్న స్పుత్నిక్ వ్యాక్సిన్ కోసమే మూడో దశ వ్యాక్సినేషన్ ను జూన్ నెలకు వాయిదా వేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కమ్మ వ్యక్తి సంస్థ నుంచి తీసుకోకుండా రెడ్డీస్ లో తయారైన వ్యాక్సిన్ కోసమే జగన్ రెడ్డి ఇలా చేస్తున్నారని అంటున్నారు. 

వ్యాక్సిన్ విషయంలో జగన్ సర్కార్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రజలంతా ప్రాణాలు కోపాడుకోవాలని ఆరాటపడుతుంటే... ప్రభుత్వం రాజకీయం చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. వ్యాక్సిన్ పైనా కుల రాజకీయం చేయడం ఏంటని మండిపడుతున్నారు. వ్యాక్సిన్ కోసం నెల రోజులు ఆగితే... అప్పటివరకు కరోనా కాటుకు ఎవరైనా బలైతే బాధ్యులు ఎవరిని నిలదీస్తున్నారు.  ఇప్పటికైనా కుల. కక్ష రాజకీయాలు మాని... రాష్ట్ర ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్లు తెప్పించాలని ఏపీ ప్రజలు, విపక్షాలు కోరుతున్నాయి. లేదంటే కరోనా చావులకు జగన్ సర్కార్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు .