జగన్ పై  కోర్టు ఫైర్.. 

మరోసారి ఏపీ హై కోర్టు జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా విజృంభ‌ణ విప‌రీతంగా వున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో పడకల లభ్యతతో పాటు ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో ఫీజుల వసూళ్ల వంటి అంశాల‌పై  హైకోర్టులో విచారణ కొన‌సాగుతోంది. సామాజిక కార్య‌క‌ర్త తోట సురేశ్ బాబుతో పాటు ప‌లువురు వేసిన పిటిష‌న్లు విచార‌ణ‌కు వ‌చ్చాయి.  

క‌రోనా నియంత్ర‌ణ కోసం రాష్ట్ర ప్రభుత్వం స‌రైన చ‌ర్య‌లు తీసుకోవట్లేద‌ని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సిజన్ కొరత లేదని మొన్న ప్ర‌భుత్వం  అఫిడవిట్‌లో పేర్కొంద‌ని, ఇప్పుడు ఆక్సిజన్ బెడ్లు ఖాళీ లేవని నోడల్ అధికారులే చెబుతున్నారని  హైకోర్టు వ్యాఖ్యానించింది.

ప్రభుత్వ అఫిడవిట్‌లో వివ‌రించిన దానికి, వాస్తవ పరిస్థితికి పొంతన లేదని అసంతృప్తి వ్య‌క్తం చేసింది. రాష్ట్రంలో క‌రోనా నియంత్ర‌ణ కోసం తీసుకుంటోన్న చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది హైకోర్టుకు వివ‌రిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తున్న.. తమకు ఏం పట్టనట్లు కూర్చున్న సీఎం లు ఇద్దరే ఇద్దరు. ఒకరు జగన్ రెడ్డి మరొకరు కేసీఆర్ దొర. ఎన్ని


ఏపీలో కరోనా పేషంట్ కి పాడైన ఆహరం.. 

 శ్రీకాకుళం జిల్లాలోని ఓ కొవిడ్‌ ఆస్పత్రిలో వసతుల లేమిపై వజ్రపుకొత్తూరు డిప్యూటీ తహసీల్దార్‌ (డీటీ) మురళీకృష్ణ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కరోనా చికిత్సకు డబ్బు చెల్లించి తన తల్లితో పాటు తాను కూడా ఆస్పత్రిలో చేరారని.. సిబ్బంది సరిగా పట్టించుకోవడం లేదని వాపోయారు. పాడైన ఆహారం పెడుతున్నారని.. పదేపదే అడిగినా వాటర్‌ బాటిల్‌ కూడా  ఇవ్వడం లేదని మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేరినప్పటి నుంచి డ్యూటీ డాక్టర్‌ను చూడలేదని చెప్పారు.  

కానూరు లో ఆక్సిజన్ అందక.. 

కానూరు పరిధిలోని టైమ్‌ ఆసుత్రిలో కరోనా బాధితులకు అందించే ఆక్సిజన్‌ నిండుకోవడంతో బుధవారం రాత్రి ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇక్కడ మొత్తం 40 మంది చికిత్స పొందుతున్నారు. అందులో 30 మందికి ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి ఉంది. ఆక్సిజన్‌ అందించాల్సిన ఏజెన్సీ బుధవారం సరఫరా చేయలేకపోయింది. రోజూ ఇక్కడ 80 ఆక్సిజన్‌ సిలిండర్ల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ నిల్వలు బుధవారం సాయంత్రం వరకు వచ్చేలా ఉండడంతో బాధితుల్లో ఆందోళన చెలరేగింది. ఆసుపత్రి వర్గాలు ఎంతప్రయత్నించినా సాయంత్రం వరకు దొరకలేదు. చికిత్స పొందుతున్న 30 మందికి రాత్రి 9 గంటల వరకు ఆక్సిజన్‌ నిల్వలు సరిపోతాయి. ఆ తరువాత రాకపోతే పరిస్థితి ఏమిటి అని తర్జనభర్జనలు పడడం మొదలు పెట్టారు. కానీ ఫలితం కనపడలేదు. దీంతో అక్కడ ఉత్కంఠ పరిస్థితులు చోటుచేసుకున్నాయి.