పతంజలి

 

మన భారతదేశం లో యోగసూత్రాల ద్వారా యోగశాస్త్రాన్ని మానవాళికి అందించిన గొప్పయోగి పతంజలిగారు. ఈయన శ్రీ క్రిష్ణుడు జీవించిన కాలానికి కొద్దిగా అటుయిటుగా జీవించినవాడు అంటారు.. అంటే దాదాపు 5000 సంవత్సరాలకు పైమాటే. పతంజలి గారు రచించిన యోగసూత్రములు 195. అందులో అష్టాంగయోగము ప్రధానమైనది. యమము, నియమము, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి అని చెప్పారు. అలాగే ఈ ఆసనం వేసుకుంటే ఈ యోగం మనకి కలుగుతుందన్నది ఏ రోగం తగ్గుతుందన్నది కూడా పతంజలి గారు వివరించి మరీ చెప్పారు. అనేక యోగరహస్యాలను పతంజలి గారు యోగ సూత్రాలలో పొందుపరిచారు. ఆయన చెప్పిన ఆసనాలు అన్నీ ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి.. ప్రశాంతతని ఇస్తాయి... ఆయన సూచించిన ఆసనాలెన్నో వాటిలోకొన్నిటి పేర్లు తెలుసుకుందాం....

1. నాడీశుద్ది ప్రాణాయామం
2. బద్దపద్మాసనం
3. పద్మాసనం
4. భుజంగాసనం
5. శలభాసనం
6. పశ్చిమోత్తాసనం
7. హలాసనం
8. విపరీతకరణిముద్రాసనం
9. సర్వాంగాసనం
10. వజ్రాసనం
11. సింహాసనం
12. గోముఖాసనం
13. లోలాసనం
14. హస్తపాదాసనం
15. త్రికోణాసనం
16. చక్రాసనం
17. యోగముద్ర
18. మత్య్యాసనం
19. ధనురాసనం
20. మయూరాసనం
21. అర్ధమత్స్యేంద్రాసనం
22. ఉద్యాణబంధము
23. నౌళిక్రియ
24. శీర్షాసనం
25. శవాసనం


ఇలా ఏ ఆసనం వేసుకుంటే ఏ ప్రయోజనం ఉంటుంది అన్నది కూడా తెలియజేసిన మహాను భావుడు పతంజలి గారు.... ఆయన మన అందరి యోగం బాగుండాలనే యోగశాస్త్రమన్నదాన్ని స్రుష్టించారన్నది అక్షరసత్యం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu