తప్పులో కాలేసిన వైసీపీ భాష్య కారుడు విజయసాయి!

అధికార వైసీపీ కీలక నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇటీవల పేర్కొన్న పలు అంశాల పట్ల తెలుగు ప్రజలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి.. ఇటీవల బెంగుళూరులోని నారాయణ హృదయాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్నను పరామర్శించారు. ఈ సందర్బంగా అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులను విజయసాయిరెడ్డి ఆరా తీశారు. 

అనంతరం తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి.. అంటే... జనవరి 27వ తేదీన తారకరత్న కుప్పంలో కుప్పకూలిన నాటి నుంచి ఆయన్ని పరామర్శించే రోజు వరకు ఉన్న ప్రతీది అప్‌డేట్‌గా విజయసాయిరెడ్డి చెప్పారని.. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఇంత క్లారిటీగా అటు నందమూరి ఫ్యామిలీలోని వారు కానీ... ఇటు నారా ఫ్యామిలీలోని వారు కానీ ఇలా చెప్పలేదని.. కానీ విజయసాయిరెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ప్రతి చిన్న అంశాన్ని సైతం.. అరటి పండు తొలు వలచి నోట్లు పెట్టినట్లుగా ఉందని ఈ సందర్భంగా తెలుగు ప్రజులు పేర్కొంటున్నారని తెలుస్తోంది. 

మరోవైపు వృత్తి పరంగా చార్టెడ్ అకౌంట్ అయినా విజయసాయిరెడ్డి.. విదేశాల్లో ఎఫ్ఆర్సీఎస్ పూర్తి చేసి.. భారత్ తిరిగి వచ్చిన వైద్యుడిలాగా నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి చాలా చాలా బాగా చెప్పారంటూ తెలుగు ప్రజలు విజయసాయిరెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అలాగే జగన్ పార్టీలో సైతం ఈ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో చక్రం తిప్పుతోన్నారంటూ.. ఆయన ప్రతిభా పాటవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకొంటున్నారు. 

గతంలో చార్టెడ్ అకౌంటెంట్‌గా.. ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా.. చక్రం తిప్పుతోన్న విజయసాయిరెడ్డి.. వైద్య రంగంలో కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఉందని.. తారక రత్న ఆరోగ్య పరిస్థితిని వివరించినప్పుడే తామందరికీ అర్థమైందని వారు వివరిస్తున్నారు. 

ఇంత వరకు అంతే ఓకే కానీ.. మాజీ మంత్రి, నాటి ప్రతిపక్ష నేత. ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి 2019 మార్చిలో దారుణం హత్యకు గురయ్యారని.. అయితే వైయస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారంటూ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి ఈ విజయసాయిరెడ్డే  ప్రకటించారని.. దీంతో ఇదే విషయం.. మీడియాలో సైతం తెగ వైరల్ అయిందని.. కానీ ఆ తర్వాత.. వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారని.. ఆయన్ని గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపారంటూ.. మీడియాలో వార్తలు వెల్లువెత్తాయని ఈ సందర్భంగా తెలుగు ప్రజలు సోదాహరణంగా విపులీకరిస్తున్నారు. 

మరి ఇన్ని రంగాల్లో ఇంత నాలెడ్జ్ ఉన్న ఈ విజయసాయి రెడ్డి.. ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్ సొంత బాబాయి వైయస్ వివేకా మరణించిన విషయంలో అది గుండెపోటా.. అది గొడ్డలి పోటా అనే విషయం ఎందుకు తెలియలేదని.. తెలుగు ప్రజలు తీవ్ర విస్మయంతో సందేహం వ్యక్తం చేస్తున్నారు.