పేర్ని నాని సీన్ అయిపోయిందా.. జగన్ దూరం పెట్టేశారా?

బందరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానికి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ కి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోతోందా? ఆ క్రమంలో జగన్ నుంచి పేర్ని నానికి  మద్దతు కరవౌతోందా? అంటే.. అవుననే  అంటున్నాయి వైసీపీ శ్రేణులు.  మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబుతోపాటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించేందుకు అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మీడియా సమావేశాలు పెట్టి మరీ.. పేర్ని నాని ఎంత గొంతు చించుకొన్నా కూడా... వాటిని పార్టీ అధినేత జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదని కూడా అంటున్నారు.

అందుకు గతంలో బందరు లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి.. స్థానికంగా పర్యటిస్తున్న సమయంలో... పేర్ని నాని కుమారుడు కిట్టు, అతడి స్నేహితుడు, కార్పొరేటర్ అస్గర్ అలీ.. అడ్డుకొని... నానా యాగీ చేయడం.. ఈ పంచాయతీ కాస్తా...  తాడేపల్లి ప్యాలెస్ చేరి రచ్చ రచ్చ కావడంతో అప్పటి నుంచీ  పేర్ని నానితో సీఎం   జగన్   అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

 అదే సమయంలో  సీఎం జగన్   లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరితో గతంలో ఉన్న స్నేహాన్ని కొనసాగిస్తున్నారని.. అలాగే పార్టీ అధినేత జగన్ ఫుల్ సపోర్ట్ సైతం బాలశౌరికి ఉందని వారు చెబుతున్నారు. అందుకు కారణాలను సైతం వారు సోదాహరణగా పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. 

ప్రతి చిన్న అంశంపై స్పందించే పేర్ని నాని లాగా.. వల్లభనేని బాలశౌలి ఎప్పుడూ స్పందించరని..  ఓ వేళ బాలశౌరి మీడియా ముందుకు వచ్చినా.. ఎవరిపైనా విమర్శలు గట్రా చేయరని..  అలాగని పార్టీ తనకు ఎంపీ సీటు ఇచ్చిందని.. ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకు బాకాలు ఊదరు, భజనలు  చేయరని..  ఓ వేళ ఏప్పుడైనా ఎంపీగా బాలశౌరి  మీడియా ముందుకు వచ్చినా.. ఎంపీ నిధులు వల్ల బందరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై మాత్రమే మాట్లాడతారని.. అంతేకాదు.. ఎప్పుడు ఎవరినీ టార్గెట్ చేసి మాట్లాడిందే లేదని బందర్ వైసీపీ శ్రేణులు  ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి.  

అలాగే ఢిల్లీలో ఎంపీ వల్లభనేని బాలశౌరికి మంచి పరిచయాలు ఉన్నాయని.. వాటి వల్ల సాక్షాత్తూ పార్టీ అధినేత  జగన్‌కు సైతం అప్పుడో .. ఎప్పోడో.. ఒకప్పడు లబ్ది చేకూరుస్తున్నయని కూడా వారు చెబుతున్నారు. అందుకే ఎంపీ బాలశౌరి పైచేయి సాధించాలంటూ ఎమ్మెల్యే పేర్ని నాని చేస్తున్న ప్రయత్నాలు..  వర్కౌట్ కావడం లేదని బందరు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.