పసికూనపై పవర్ చూపించిన భారత్

 

మంగళవారం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 260 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి మరో 79 బంతులు మిగిలుండగా విజయకేతనం ఎగరవేసింది. వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి గ్రూపు-బిలో అగ్ర స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ప్రముఖలు టీం ఇండియాకు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారత్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా టీం ఇండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డంగ్ అన్ని విభాగాల్లోనూ రాణించి విజయం సొంతం చేసుకుందని, ఇలాగే విజయాల బాటలో పయనించాలని ఆకాంక్షిస్తున్నానని ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. అంతేకాక ప్రపంచ కప్ చరిత్రలో ధోనీసేన (2011 ఈవెంట్లో చివరి నాలుగు విజయాలు సహా) అత్యధిక విజయాల రికార్డు (9) సాధించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu