కరోనా మందులు.. బంగారు దొంగతనం..
posted on May 11, 2021 3:48PM
వైపు కరోనా మానవత్వాన్ని కనుమరుగు చేస్తోంటే.. మరోవైపు డబ్బుకోసం కొందరు ఎంతటికైనా తెగిస్తున్నారు. ఒక వైపు కరోనా ఎక్కడ తమ ప్రాణాలు తీస్తుందో అని జనం భయపడుతున్నారు. మరో వైపు ఆ కరోనా నుండి ఎలా తప్పించుకోవాలని అదే జనం ఆలోచిస్తున్నారు. ప్రజల భయాన్ని, వాళ్ళ అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొంత మంది మోసాలు చేస్తున్నారు. ఒక వైపు వాక్సిన్ బ్లాక్ లో అమ్ముతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపు హాస్పిటల్స్ లో అవయవాలు తీసుకుంటున్నారని. మరో వైపు హాస్పిటల్స్ లో పని చేసే వాళ్ళు కరోనా పేషంట్స్ వంటి మీద ఉన్న బంగారు దొంగిలిస్తున్నారని. మరో వైపు కరోనా వల్ల చనిపోయిన వారి శవాలను స్మశానంలో దహన సంస్కారం చెయ్యాలంటే 15 వేయిల నుండి 25 వేయిల వరకు డబ్బులు వసూల్ చేస్తున్నారని. రకరకాల వార్తలు వింటున్నాం కొన్నీ వీడియోలో చూశాం..
కరోనా కాలంలో చాలా మంది ఇబ్బందులకు గురవుతుంటే కొంతమంది వీటిని అదునుగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. వృద్ధ మహిళలనే టార్గెట్ చేస్తు బంగారం, నగదును అపహరిస్తున్నారు. కరోనా టాబ్లెట్స్ అంటూ మహిళలకు మత్తు టాబ్లెట్స్ ఇచ్చి మత్తులోకి జారిన వెంటనే ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దొంగలు దోసుకెళ్తున్నారు. సూర్యాపేట జిల్లా కుడ కుడ గ్రామంలో రెడ్డబోయిన ఎల్లమ్మ (75)వృద్ధ మహిళ పై దుండగులు కరోనా నిర్మూలించే మాత్రలు అని చెప్పి ప్రభుత్వం వారు పంపించారని ఇంటింటికి తిరిగి ఇస్తున్నామని చెబుతూ మత్తు టాబ్లెట్ ఇచ్చారు. ఆమె మత్తులోకి జారిన వెంటనే ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. మూడు తులాలన్నర పుస్తెలతాడును అపహరించారు. కరోనాకు వ్యాక్సిన్ మత్రమే వచ్చిందని.. ఇలా కరోనా మందులని ఎవరైనా చెబితే నమ్మవద్దని.. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.