పెళ్లికి ముందు.. పెళ్ళికొడుకు జంపు..
posted on May 11, 2021 3:08PM
అది కృష్ణ జిల్లా. పెడన మండలం చేవేండ్రపాలెం. అతని పేరు వీరాంజనేయులు. అబ్బాయి పెళ్లీడుకొచ్చాడు.. దీంతో తల్లిదండ్రులు ఓ మంచి అమ్మాయితో పెళ్లి కుదిర్చారు. నిశ్చితార్థం అయింది. అటు అమ్మాయి వైపు వాళ్ళు, ఇటు అబ్బాయికి తరుపువాళ్ళు అంత పెళ్లి పనుల్లో పడ్డారు. పెళ్లికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. బంధువులకు శుభలేఖలు పండటంతో పాటు మండపాలు మాట్లాడుకున్నారు. పెళ్లి దుస్తులు తీసుకున్నారు. ఇలా పెళ్ళికి కావాల్సినవి అన్నీ కొనేశారు. అటు అమ్మాయి కూడా పెళ్లి, కొత్తజీవితం గురించి, భర్త గురించి కలలు కంటోంది. అంతా బాగుందనుకునే సమయంలో ఊహించని ట్విస్ట్ జరిగింది..
పెళ్లి పీటలు ఎక్కి అమ్మాయి మేడలో మూడు ముళ్ళు వేయాల్సిన వాడు. మిస్ అయ్యాడు. పనిమీద బయటకువెళ్లిన వాడు తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇరు పక్షాల కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. దీంతో వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. ఐతే పెళ్లికొడుకు మిస్సింగ్ పై ఆరా తీసిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. అసలు ఆ యువకుడు ఏమయ్యాడు..? ఎక్కడున్నాడు..? పెళ్లి నాటికి తిరిగొస్తాడా..? అనేది ఇప్పుడు సస్పెన్స్ సినిమాలో సీన్ లా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. వీరాంజనేయులుకి మచిలీపట్నంకు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. మే 13న పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. ఇంటిల్లిపాది పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈనెల 5వ తేదీన బయటకు వెళ్లిన వీరాంజనేయులు మళ్లీ తిరిగిరాలేదు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తెలిసిన వారి వద్ద విచారణ జరిగిన తండ్రి వెంకటేశ్వరరావు.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే యువకుడు అదృశ్యం ఘటన గ్రామంలో కలకలం రేపింది. మిస్సింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు చేయగా.. యువకుడు భారీగా నగదుతో పరారైనట్లు తేలింది. ఎల్ అండ్ టీ సంస్థలో కాంట్రాక్టులు చేస్తున్నట్లు బంధువుల, స్నేహితులతో పాటు గ్రామస్తులను నమ్మించిన ఆంజనేయులు.. అధిక వడ్డీల పేరుతో భారీగా నగదు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఓస్థానిక ప్రజాప్రతినిథి నుంచి రూ.5లక్షలు తీసుకొని తక్కువ వ్యవధిలో రెట్టింపు మొత్తం ఇవ్వడంతో స్థానికులంతా మనోడి వలలో పడ్డారు.