ఉద్యోగాలలో విజయం మహిళలదే

మహిళలకి ఉన్న ఉద్యోగ ప్రజ్ణకి సాటి లేదు అంటున్నారు పరిశోధకులు .ఇక భవిష్యత్తు వారిదే అని కూడా గట్టిగా చెబుతున్నారు. నిన్నటి దాకా మేధస్సు, అనుభవం , మాత్రమే కార్పొరేట్ కార్యాలయాలలో మంచి స్తితి లో ఉండటానికి ఉపయోగ పడతాయి అని నమ్మేవారు . అయితే ఈ మధ్య అమెరికాకు చెందిన " ఈగన్ జెండర్ " అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ఆ రెండింటి కన్నా , ఉద్యోగంలో ప్రజ్న ఉన్నవారే గొప్ప విజయాలు సాధించగలరని తేలింది. సుమారు అయిదు వందల మందికి పైగా సీనియర్ ఎగ్సిక్యుటివ్ ల పనితీరుని పరిశీలించి న మీదట ఈ విషయం తెలిసింది.  ఓ బృందంగా పని చేసేటప్పుడు పరస్పర సహకారం, కోప తాపాల నియంత్రణ , స్నేహంగా వుండటం, మొదలైన లక్షణాలు వున్నవారు ఉద్యోగం లో చక చకా పైకి ఎక్కుతున్నారుట.

 

 

అలా కాకుండా కేవలం ప్రతిభ , అనుభవాన్నే నమ్ముకున్నవారు వెనకపడుతున్నారుట. సో మహిళల సహజ లక్షణాలు అయిన స్నేహశీలత ,సహనం వంటివి వారి బలాలు గా మారి , వారిని ఉన్నత స్తాయికి చేరుస్తున్నాయి అని వీరు పరిశీలించి, పరిశోధించి , చెబుతున్నారు . అయితే వీరు ఒక సలహా కూడా చెబుతున్నారు ..వీరి అద్యయనం లో అమ్మాయిలలో ఆత్మవిశ్వాసం ఆశించిన స్తాయిలో లేకపోవటం, స్వతంత్రం గా వ్యవహరించటం లో తడబాటులని కూడా గమనించారుట. ఈ విషయాల మీద కాస్త ఫోకస్ పెట్టండి చాలు ..మీకు తిరుగు లేదు అని గట్టిగా చెబుతున్నారు. మరి ఆ రెండు అస్త్రాలని కూడా మన అమ్ముల పొదిలో చేర్చు కుంటే సరి ...