పొట్లాడితే ఆరోగ్యం

మీ వారితో గాని శ్రీమతి తో గాని ఈ మద్య పోట్లాడారా ? లేకపోతే వెంటనే ఆ పనిలో ఉండండి. ఎందుకంటే బాగా పోట్లాడుకునే భార్య భర్తల ఆయుషు పెరుగుతుంది అంటున్నారు. పరిశోధకులు.
అమెరికాలో మిచిగాన్ యూనివర్సిటీ 192  మంది దంపతులపై ఓ అధ్యయనం చేసింది. ఆ  అధ్యయనంలో భాగంగా భార్య భర్తలని నాలుగు గ్రూపులుగా చేశారు. ఇద్దరు ఉద్రేక స్వభావం కలిగిన వారిని మొదటి గ్రూపులో  భర్త అరిస్తే భరించే భార్యలు రెండో గ్రూపులో భార్య అరిస్తే భరించే భర్తలని మూడో గ్రూపులో కోపం కట్టలు తెంచుకున్న సర్దుకుపోయే దంపతులు నాలుగో గ్రూపులో ఉంచారు.
ఈ నాలుగు గ్రూపుల మీద దీర్ఘకాల అధ్యయనం చేశాకా తేలిన విషయం ఏంటంటే కోపతాపాలు అణుచుకుని,సర్దుకుపోయి కాపురం  చేసే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, శక్తికి మించి భరిస్తూ పోయే భార్యాభర్తలు వివిధ అనారోగ్య సమస్యలతో భాదపడటం గుర్తించారు. కాబట్టి ఆవేశాలని  అణుచుకుని  అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే కంటే వీలుచూసుకుని పక్కవారికి  తమ భాదని చేర్చటమే  మంచిది  అంటున్నారు పరిశోధకులు. హాయిగా పోట్లాడుకుంటూ ఆరోగ్యంగా ఉండండి. పోట్లాడమన్నారు  కదా  అని ఎదుటి వారి ఆత్మాభిమానం, ఆరోగ్యం దెబ్బతినేలా పోట్లాడకండేం. 

Wife and Husband fighting, quarelling is good, quarelling is healthy, Fighting is healthy.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu