పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. SCO సదస్సుకు ఆహ్వానం

 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌కు  భారత్‌ ప్రధాన నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్బంగా రష్యా- ఉక్రెయిన్ యుద్దానికి సంబంధంచిన తాజా పరిమాణాలను పుతిన్ ప్రధానికి వివరించారు. అయితే, ఈ సంక్షోభానికి శాంతియుత చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందని భారత్ తన స్థిరమైన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించింది. వివాద పరిష్కారానికి హింస మార్గం కాదని భారత్ మొదటి నుంచి చెబుతున్న విషయం తెలిసిందే.

ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా ఇరువురు నేతలు చర్చించుకున్నారు. భారత్-రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు కట్టుబడి ఉన్నామని వారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో, ఈ ఏడాది చివర్లో జరగనున్న 23వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు రావాల్సిందిగా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ కోరారు.

ఈ సానుకూల వాతావరణంలోనే ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. 2019 తర్వాత మోదీ చైనాలో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ పర్యటనకు ముందు ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు ఉన్నతస్థాయి సమావేశాలు జరిగాయి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవలే చైనాలో పర్యటించారు.

 ముఖ్యంగా ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరిని విడనాడాలని, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అజిత్ దోవల్ ఎస్సీఓ భద్రతా సలహాదారుల సమావేశంలో గట్టిగా చెప్పారు. కాగా భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్ సహా మొత్తం పది దేశాలు సభ్యులుగా ఉన్న షాంఘై సహకార సంస్థను 2001లో స్థాపించారు. ఈ ఏడాది టియాంజిన్‌లో జరిగే సదస్సు SCO చరిత్రలోనే అతిపెద్ద సదస్సుగా నిలవనుందని చైనా వెల్లడించింది. సుమారు 20 దేశాల అధినేతలు, 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu