బండి సంజయ్‌కి కేటీఆర్ సవాల్.. ఆరోపణలు నిరూపించు

 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై బీఆ‌ర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అయినప్పటికీ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఆయనకు కనీస పరిజ్ఞానం లేదని అని విమర్శించారు. బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు హద్దు మీరాయని కేటీఆర్‌ అన్నారు. చిల్లర, బజారు మాటలు మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. తనకు రాజకీయ ప్రాధాన్యత దక్కకపోవడంతో వార్తల్లో నిలవాలని తనకు అలవాటైన చౌకబారు నాటకాలకు తెరదీశారని మండిపడ్డారు. 

ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. 48 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే కోర్టుకు లాగాల్సి ఉంటుందని హెచ్చరించారు.నువ్వు చేసిన ఆరోపణలు నిజమని నిరూపించకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. .కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా పని చేస్తున్నప్పటికీ.. ఆయనకు ఆ మాత్రం పరిజ్ఞానం లేకపోవడం విచారకరమని అన్నారు. 

హైదరాబాద్ దిల్ కుషా గెస్ట్ వద్ద సిట్ విచారణ అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాప్ చేశారని దీనికి కారణమైన  ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు, రాధాకిషన్‌రావును ఉరి తీయాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు. సిట్ అధికారులు చూపించిన ఆధారాలు చూసి షాక్ అయ్యానని వెల్లడించారు. ఫోన్ ట్యాప్ జరుగుతుందని మొదటి సారి నేనే గుర్తించాని బండి సంజయ్ తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ ఉన్నారని ఆయన ఆరోపించారు. తన సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో భార్యభర్తలు ఫోన్లును కూడా విన్నారని తెలిపారు. వావి వరుసలు లేకుండా సొంత కూతురు ఎమ్మెల్సీ కవిత ఫోన్లు కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. 6 వేల 500 మంది ఫోన్ ట్యాప్‌కు గురియ్యాని చెప్పారు. ఆ జాబితాలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు పేర్లూ సైతం ఉన్నాయన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గతంలోనే తాను చెప్పానని గుర్తు చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu