వ్యాపారాల పేరుతో కోట్ల రూపాయలలో మోసాలు...వైసీపీ నేతపై పీడీ యాక్ట్

 

వివిధ వ్యాపారాల పేరుతో కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడ్డారు. ఇందులో వీరి పై సుమారు 36 కేసులు నమోదు అయినాయి. ఇప్పటికే వీరు పాల్పడ్డ మోసాలపై బాధితులు ఒక్కొక్కరు వచ్చి ఫిర్యాదులు చేస్తుండంతో వీరి మోసాలు బయటపడ్డాయి. కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడడమే కాక ఆర్థిక నేరాలకు పాల్పడడం జరిగింది. దీనితో దాల్ మిల్ సూరి పై కలెక్టర్  ఉత్తర్వులు మేరకు పీడీ యాక్ట్ కూడా నమోదు చేసామని జిల్లా  ఎస్పీ తెలియజేసారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ విజయ కుమార్ తో కలిసి ఈ కేసు వివరాలను ఎస్పీ విలేకర్ల సమావేశంలో తెలియజేసారు. 

కొత్తచెరువుకు చెందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దాల్ మిల్ సూరిపై పీడీ యాక్ట్‌ నమోదు తెలిపారు. జిల్లాలో వివిధ వ్యాపారాల పేరుతో కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడ్డ దాల్ మిల్ సూరిపై 36 కేసులు నమోదయ్యాయి. కోట్ల రూపాయలకు పైగా మోసాలకు పాల్పడడమే కాకుండా ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలిందని.. సూరిపై కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ కూడా నమోదు చేశామని వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu