ఉత్త‌రాఖండ్‌ ప్రమాదం... 10 మంది మృతి..

 

ఉత్త‌రాఖండ్‌లోని ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఉత్త‌రాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఓ ప్రైవేటు బ‌స్సు లోయ‌లో ప‌డింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్ర‌యాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 38 మంది ప్రయాణికులు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఘ‌ట‌న‌పై ఉత్త‌రాఖండ్ గ‌వ‌ర్న‌ర్ కె.కె పాల్, ముఖ్య‌మంత్రి హ‌రీశ్‌రావ‌త్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. గాయాల‌పాల‌యిన వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu