కారు స్టీరింగ్ కాదు... దోశ పెనం..
posted on Sep 6, 2016 5:31PM
.jpg)
సాధారణంగా కారు నడపడానికి మనం స్టీరింగ్ వాడతం. కానీ ఇక్కడ ఏ వ్యక్తి మాత్రం దోశ పెనం వాడుతున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.. అసలు సంగతేంటంటే.. ఆస్టేలియాలో ఓ వ్యక్తి నడుపుతున్న కారుకు స్టీరింగ్ ప్లేస్లో దోశ పెనం ఉంది. ఇది చూసిన ఓ వ్యక్తి పోలీసులకి సమాచారం అందించడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి నడుపుతున్న కారు అత్యంత ఖరీదైన మజ్దా సెడాన్ కారు. అయితే కారు స్టీరింగ్ ఉండాల్సిన స్థానంలో దోశ పెనం ఉండటం చూసి అందరూ షాకయ్యారు. ఇదేంటిలా ఉంది అని అతనిని ప్రశ్నించి కారు రిజిస్ట్రేషన్ పేపర్లు అడుగగా లేవని సమాధానం చెప్పాడు. ఇన్సూరెన్స్ పేపర్లు అడిగినా కూడా లేవని చెప్పడంతో అతనిపై కేసు నమోదు చేసి, ఆ కారును స్వాధీనం చేసుకున్నారు.